Just In
- 2 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 21 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 24 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
నా వయసు గురించి మాట్లాడితే దబిడి దిబిడే - మంత్రికి బాలయ్య మాస్ వార్నింగ్..!?
- Lifestyle
నిద్ర లేమి దురద:ప్రాణహాని కలిగించే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు దారితీస్తుందా?
- Movies
Hunt review డిఫరెంట్ మర్డర్ మిస్టరీ.. సుధీర్ బాబు ఎలా చేశాడంటే?
- Finance
Investment: రూ.250 కోట్ల పెట్టుబడి నిర్ణయం.. పరుగులు మెుదలెట్టిన స్టాక్
- Sports
Team India : ఈ టీమిండియా వెటరన్ బ్యాటర్ కెరీర్ ముగిసినట్లేనా?
- Automobiles
హైవేపై అందంగా రీల్ చేసిన చిన్నది: కట్ చేస్తే రూ. 17,000 ఫైన్.. కారణం మాత్రం ఇదే
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
మీరు చేసే పనులన్నీ గూగుల్ పసిగడుతుందని తెలుసా, రక్షించుకోవడం ఎలా ?
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ముందుగా గూగుల్ లో రకరకాలైనవి వెతికేస్తుంటారు. ఇంటర్నెట్లో ఏ సమాచారం కావాలన్నా అందరూ ముందుగా ఆశ్రయించేది గూగుల్ నే కదా. అయితే ఆ గూగుల్ మీ సమాచారాన్ని పసిగడుతుందని మీకు తెలుసా..మీరు చేసే ప్రతీ పని గూగుల్ రహస్యంగా చూస్తూ ఉంటుంది. మనం ఏదైనా విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు గూగుల్ మన కార్యకలాపాలను పసిగట్టే అవకాశాలున్నాయి. మీ వ్యక్తిగత సమాచారం, మీరు తాజాగా విజిట్ చేసిన ప్రదేశాలు, మీ ఇష్టా ఇష్టాలు ఇలా అనేక విషయాలు గురించి గూగుల్ వద్ద సమాచారం ఉంటుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి వీటినుంచి మనల్ని రక్షించుకోలేమా అనే సందేహం చాలామందికి రావచ్చు. అలాంటి వారి కోసం కొన్ని రకాల టిప్స్ ఇస్తున్నాం. వీటిని ఫాలో అయితే మీరు మీ సమస్య నుండి కొంతవరకు బయటపడవచ్చు.

లాగిన్ , లాగౌట్
మీరు మీ గూగుల్ ఎకౌంట్‌కు సైన్ ఇన్ అయ్యారో లేదో చెక్ చేసుకోండి. అక్కడ మీ అకౌంట్‌లో పర్సనల్ ఇన్మరేషన్ అండ్ ప్రైవసీ సెక్షన్‌లో ఉండే మై యాక్టివిటీ పై క్లిక్ చేయండి. మీరు సెర్చ్ చేసిన కంటెంట్ రోజులు, వారాలు, నెలల వారిగా అక్కడ కనిస్తుంటుంది.దీన్ని డిలీటం చేయడం ద్వారా మీరు కొంత మేర రక్షణ పొందవచ్చు.

Serch history
ఎడమ వైపు సైడ్ బార్‌లో ఉండే మై అకౌంట్ యాక్టివిటీ కంట్రోల్‌లోనికి వెళ్లండి. వెబ్ అండ్ యాప్ యాక్టివిటీపై క్లిక్ చేయండి. డిలీట్ యాక్టివిటీ బై అనే ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు అవసరం లేదనుకున్న హిస్టరీని డిలీట్ చేయవచ్చు.అలాగే దీన్ని ఆఫ్ చేయాలనుకుంటే కుడి వైపు ఉండే బ్లూ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Find 'My Activity
మనం తరచుగా గూగుల్‌లో చేసే సెర్చ్‌లను ఇది విశ్లేషణ చేస్తోంది. అంటే మనం గూగుల్ నుంచి తీసుకునే సమాచారాన్ని మాత్రమే గాక మిగితా కంపెనీ యాప్‌ల ద్వారా మనం అందించే సమాచారాన్ని కూడా సంగ్రహించి విశ్లేషిస్తుంది.

Location
మీరు ఏ సమయంలో ఎక్కడ ఉన్నరో గూగుల్‌కు ఇట్టే తెలిసిపోతుంది. మీరు మీ గూగుల్ అకౌంట్ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి మాత్రమే గాక మీ సెర్చ్‌ను బట్టి కూడా గూగుల్ మీ లొకేషన్‌ను చెప్పేస్తుంది. దీన్ని ఆఫ్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నారనేది తెలియకుండా ఉంటుంది. యాక్టివిటీ కంట్రోల్స్ సెక్షన్‌లో లొకేషన్ హిస్టరీని క్లిక్ చేస్తే మీరు విజిట్ చేసిన ప్రదేశాల గురించిన సమాచారం అక్కడ కనిపిస్తుంది.

Location డిజేబుల్
యాక్టివిటీ కంట్రోల్‌లో సెక్షన్ లొకేషన్ హిస్టరీ పక్కన ఉండే బ్లూట్యాబ్ ను ఆఫ్ చేస్తే దానిని డిజేబుల్ చేసినట్లే. మీ లొకేషన్ హిస్టరీ డిలీట్ చేయాలి అంటే కుడి వైపు క్రింద బాగంలో ఉండే ట్రాష్ సింబల్‌పై క్లిక్ చేయండి సరిపోతుంది.

Youtube Activity
మీరు యూ ట్యూబ్‌లో ఎలాంటి కాంటెంట్ కోసం వెతుకుతున్నారు? ఎలాండి వీడియోలను చూస్తున్నారు? తదితర వివరాలన్నీ గూగుల్‌కు తెలిసిపోతాయి. మీరు దీన్ని చూడాలనుకుంటే యాక్టివిటీ కంట్రోల్స్ సెక్షన్ లోనికి వెళ్లి యూ ట్యూబ్ సెర్చ్ హిస్టరీ, యూ టూయబ్ ప్లే హిస్టరీపై క్లిక్ చేస్తే మీ యూ ట్యూబ్ యాక్టివిటీలకు సంబందించిన సమస్త సమాచారం అక్కడ కనిపిస్తుంది.

మీ డివైస్‌లలోని సమాచారం...
మీ డివైస్‌లో ఉన్న కాంటాక్ట్, క్యాలెండర్‌లు, యాప్‌లు, మ్యూజిక్‌లు ఇంకా మీ బ్యాటరీ వినియోగం తదితర అంశాలకు సంబందించిన సమాచారం అంతటినీ గూగుల్ సేకరిస్తుంది. యాక్టివిటీ కంట్రోల్స్ లోనికి వెళ్లి ఇన్ఫర్మేషన్ ఫ్రం అదర్ డివైసెస్ అనే సెక్షన్‌పై క్లిక్ చేస్తే ఆ సమాచారం మీకు కనిపిస్తుంది. ఇంతకు ముందు విధంగానే ఆ సెక్షన్ దగ్గర ఉన్న బ్లూ ట్యాప్‌ను టర్న్ ఆప్ చేస్తే ఇది డిజిబుల్ అవుతుంది.

monthly security and privacy report
గూగుల్ మీకు నెల వారి యాక్టివిటీ రిపోర్టును కూడా అందిస్తుంది. మీరు ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా మీ మెయిల్ కి నెలవారీకి సంబంధించి మీరు వాడిన వివరాలు కనిపిస్తాయి. ఇందుకోసం మీరు https://www.google.com/settings/dashboardలోకి వెళ్లండి. మరిన్ని వివరాలు తెలుస్తాయి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470