వై-ఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..!

Posted By: Madhavi Lagishetty

మీరు మీ వైఫై పాస్‌వర్డ్ తెలుసుకోవాలనుకుంటున్నారా..?, ఇతరుల వైఫై నుంచి ఇంటర్నెట్ పొందలానకుంటున్నారా..?, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌కు కనెక్ట్ చేసిన వై-ఫై నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను ఎలా చూడాలో తెలుసుకోవాలనుకుంటున్నారా..?

వై-ఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..!

ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మారుమూల గ్రామాల్లో సైతం అందుబాటులో వచ్చేసింది. ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌ను వాడే స్థాయికి చేరుకున్నారు. అంతేకాదు ఒకరోజు కోసం ఇంటర్నెట్ ప్యాక్, ఒకనెల కోసం చౌకైన ఇంటర్నెట్ ప్యాక్స్, పబ్లిక్‌లో ఉచిత వై-ఫై, వై-ఫై రౌటర్ ద్వారా ఇంట్లోనూ వై-ఫై‌ను వాడుతున్నారు.

ఈ మధ్యకాలంలో సందర్శిస్తున్న ప్రదేశాల్లో చాలావరకు కాఫీ దుకాణాలు, రెస్టారెంట్లలో వైఫైను సదుపాయం కల్పిస్తున్నారు. కానీ వెళ్లిన ప్రతిసారీ వై-ఫై పాస్‌వర్డ్‌ను అడుగుతూ ఎదుటివారి ముందు షేమ్‌గా ఫీల్ అవాల్సి ఉంటుంది. అయితే, ప్రతిసారి అలా చేయకుండా...ఒకసారి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో కనెక్ట్ అయిన తర్వాత పాస్‌వర్డ్‌ను సేవ్ చేసుకోవాలి. మీరు గతంలో ఫోన్‌కు కనెక్ట్ చేసిన నెట్‌వర్క్ వై-ఫై పాస్‌వర్డ్‌ను అవసరమైనప్పుడు  తెలుసుకోవడం మంచిది.

ఉత్తమ స్మార్ట్ఫోన్లు రూ. 10,000/- కన్నా తక్కువలో : రెడ్మి నోట్ 4, గెలాక్సీ J2, ఒప్పో A37, గెలాక్సీ J7

అయితే మీరు కనెక్ట్ చేసిన వైఫై నెట్‌వర్క్ పాస్ వర్డ్ ను ఈజీగా చూడానికి కొన్ని ట్రిక్స్ రెడీగా ఉన్నాయి. అయితే ఈ టిక్ర్స్ ఆండ్రాయిడ్ డివైస్‌లకు మాత్రమే అప్లై అవుతాయి.

వై-ఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..!

స్టేప్ 1:

మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వైపై పాస్‌వర్డ్ వ్యూయర్ (రూట్) యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోండి.

వై-ఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..!


స్టేప్ 2:

యాప్ ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఫోన్‌లోని డేటాను యాక్సిస్ చేసుకునేందుకు మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. పర్మిషన్ ఓకే చేసినట్లయితే వై-ఫై పాస్‌వర్డ్‌ను స్టోర్ చేసిన సేవ్ ఫైల్‌ను చదవడానికి అనుమతిస్తుంది.

వై-ఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..!

స్టేప్ 3:

గతంలో మీరు కనెక్ట్ చేసిన అన్ని నెట్‌వర్క్స్ పాస్‌వర్డ్స్ జాబితాను యాప్ ప్రదర్శిస్తుంది.

వై-ఫై పాస్‌వర్డ్ తెలుసుకోండిలా..!

స్టేప్ 4:

మీరు మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయాలనుకుంటే...జాబితాలో ఒక ఎంట్రీని నొక్కండి. ఇక్కడ మీరు పాస్‌వర్డ్‌ను క్లిప్ బోర్డ్‌ను కాపీ చేయవచ్చు. లేదా ఏదైనా యాప్‌ను ఉప‌యోగించి దాని నుంచి షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఒక క్యూఆర్ కోడ్‌ను జెనరేట్ చేయవచ్చు.

Read more about:
English summary
Knowing the passwords come in handy when you need the Wi-Fi password of a network you previously connected to on the phone. we have compiled steps to easily see passwords for Wi-Fi networks you've connected.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot