మీకు ఇష్టమైన ఫేస్ బుక్ పేజీల నుంచి పోస్టులను ఎలా చూడాలి?

Posted By: Madhavi Lagishetty

ఫేస్ బుక్ ...ఈ యాప్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇందులో పర్సనల్ విషయాలు, ఇమేజ్ లు, నచ్చిన పుస్తకాలు, ప్రముఖులు, సినిమాలు, హీరోల గురించి పేజీలు పెడుతుంటారు. అయితే వీటిలో మీకు ఇష్టమైన కొన్ని పేజీల నుంచి పోస్టులు మిస్ అవుతున్నారా? డోంట్ వర్రీ. ఫేస్ బుకు దాని అల్గోరిథంలో కొన్ని మార్పులు చేస్తోంది. దీంతో మీకు నచ్చిన పోస్టులను మిస్ చేయకుండా...నోటఫికేషన్ రూపంలో చూడవచ్చు.

మీకు ఇష్టమైన ఫేస్ బుక్ పేజీల నుంచి పోస్టులను ఎలా చూడాలి?

మీకు ఇష్టమైన ఫేస్ బుక్ పేజీ నుంచి నోటిఫికేషన్లను పొందడానికి...మీరు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. వాటి గురించి ఈ ఆర్టికల్లో తెలియజేస్తున్నాం. వెబ్, మొబైల్ ఈ రెండింటిలో వేర్వేరుగా ఉంటుంది. మీకు ఇష్టమైన ఫేస్ బుక్ నుంచి రెండు డివైజుల నుంచి పోస్టులను ఎలా పొందాలను ఈ కింది స్టెప్స్ ద్వారా తెలుసుకోండి.

పీసీలో ఫేస్ బుక్ ఉపయోగిస్తుంటే?

మీరు పీసీలో ఫేస్ బుక్ ను ఉపయోగిస్తుంటే...మీ ఫేస్ బుక్ నుంచి పోస్ట్ లను చూడటానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1...మీరు తరుచుగా పోస్టలను చూడాలనుకుంటున్న పేజీని సెర్చ్ చేయండి. దానిని ఓపెన్ చేయండి.

స్టెప్ 2. నెక్ట్స్ టాబ్ పై హోవర్ చేయండి.

స్టెప్ 3 ఇప్పుడు మీ న్యూస్ ఫీడ్ లో మొదటిది చూడండి అనే అప్షన్ను సెలక్ట్ చేసుకోండి.

పేజీలో ఏదైనా కొత్త పోస్టు ఉంటే...దానిని నోటిఫికేషన్ల రూపంలో పొందాలనుకుంటే...ఈ కింది రెండు స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 4. నోటిఫికేషన్ పక్కన పెన్సిల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 5. ఇప్పుడు ఈ పేజీ నుంచి మీరు ఏం చూడాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోండి. డైలాగ్ బాక్స్ మీ స్క్రీన్ పై కనిపిస్తుంది. పోస్ట్ అనే బాక్సును చెక్ చేయండి. మీ ఆఫ్షన్ కు సంబంధించిన పేజీ పోస్టు కంటెంట్ను మీరు ఎప్పుడైనా చూడవచ్చు. పూర్తయ్యింది క్లిక్ చేయండి.

ఇప్పుడు మీరు మీకు ఇష్టమైన ఫేస్ బుక్ పేజీ నుంచి పోస్టును మిస్ కాకుండా చూస్తారు.

మొబైల్లో ఫేస్ బుక్ చూస్తుంటే?

మీరు మొబైల్ లో మీ ఫేస్ బుక్ అకౌంట్ను రన్ చేస్తుంటే...ఈ గైడ్ చక్కగా పనిచేస్తుంది. ఎలాగో చూడండి.

స్టెప్ 1. ఫేస్ బుక్ పేజీని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారో ఓపెన్ చేయండి.

స్టెప్ 2. ఫాలోయింగ్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3. ఇప్పుడు నోటిఫికేషన్లను పొందండి పై టోగుల్ చేయండి.

మీ న్యూస్ ఫీడ్ సెక్షన్ లో మొదటిది చూడండి ఆప్షన్ను సెలక్ట్ చేసుకోండి. కొత్త పోస్టులను పబ్లిష్ చేసినప్పుడు...మీరు ఐదు నోటిఫికేషన్లను చూస్తారు. ఈ పేజీ నుంచి వచ్చే పోస్టులు మీ న్యూస్ ఫీడ్ లో చూస్తారు.

ఈ పేజీ నుంచి నోటిఫికేషన్లను స్వీకరించాలనుకుంటే...ఎడిట్ నోటిఫికేషన్ సెట్టింగ్స్ ఆప్షన్ను నొక్కండి. పోస్టులు ముందు సర్కిల్లను టిక్ చేయండి. పేజీ పోస్టును పబ్లిష్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.

ఎయిర్‌టెల్ రూ. 499 ప్లాన్ బెస్ట్ అనే దానికి కారణాలు !

English summary
Facebook is making few changes in its algorithm. As a result of this, no one can guarantee that you would be able to see every post from your favorite Facebook pages. However, if you don't want to miss any posts from your favorite Facebook page, you need to make few changes to receive the notification of the posts.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot