ట్రాయ్ కొత్త రూల్స్ ప్రకారం టాటా స్కై లో చానెల్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలా...?
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్చి 31 వ తేదీ వరకు నూతన డిటిహెచ్ నియమాల కింద చానెల్స్ ను ఎంచుకోవడం లేదా ప్యాక్లను మలచుకోవడం కోసం గడువు పొడిగించింది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మార్చి 31 వ తేదీ వరకు నూతన డిటిహెచ్ నియమాల కింద చానెల్స్ ను ఎంచుకోవడం లేదా ప్యాక్లను మలచుకోవడం కోసం గడువు పొడిగించింది. క్రొత్త DTH గైడ్ లైన్స్ ప్రకారం, వినియోగదారులు ఇప్పుడు కావలసిన ఛానెల్లను ఎంపిక చేసి, దానికి చెల్లించవచ్చు . అలాగే సర్వీస్ ఛార్జ్ గా వర్తించే రూ. 130 + GST బేస్ ఫీజు ఉంది.అయినప్పటికీ, వారి కనెక్షన్లో చానెళ్లను ఎన్నుకోవడము గురించి చాలామంది ఇంకా తెలియదు. ఈ శీర్షికలో భాగంగా టాటా స్కై లో చానెల్స్ సెలెక్ట్ చేసుకోవడం ఎలాగో స్టెప్ బై స్టెప్ మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

స్టెప్ 1
టాటా స్కై అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి ‘Click to Select బ్యానర్ ను సెలెక్ట్ చేయండి లేదా కింద ఉన్న లింక్ ను క్లిక్ చేయండి https://packselection.tatasky.com/PRRedirect/PRWebMQ?_ga=2.153809009.853175044.1550505957-1668817277.1550505957 link

స్టెప్ 2
సబ్స్క్రైబర్ ID లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి. మీ ఫోన్ కు OTP వస్తుంది వెంటనే దానిని ఎంటర్ చేయండి

స్టెప్ 3
Recommended packs TataSky packs మరియు All channels అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి.అందులో మీకు కావలసింది ఎంచుకోండి

స్టెప్ 4
ఇండివిజువల్ గా చానెల్స్ ను సెలెక్ట్ చేసుకోవడానికి ‘All Channels' అనే ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోండి .

స్టెప్ 5
ప్యాక్ మరియు చానెళ్లను ఎంచుకున్న తరువాత, వినియోగదారులు స్క్రీన్ పైభాగంలో గ్రాండ్ టోటల్ ను తనిఖీ చేయవచ్చు.

స్టెప్ 6
ఇప్పుడు, Submit & Proceed button పై క్లిక్ చేయండి.దీని తరువాత, పోర్టల్ చెల్లింపును అడుగుతుంది


Click it and Unblock the Notifications








