ఎండాకాలంలో మంచి ఏసీ కొనాలనుకుంటున్నారా,అయితే సమగ్ర వివరాలు మీకోసం

|

భారతదేశ ఆర్థికాభివృద్ధి, పెరుగుతున్న కొనుగోలుశక్తి సమానత్వం, ఒక మధ్యతరగతి కుటుంబానికి సౌకర్యవంతమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందేలా అధికారం కలిగించింది. ఒకప్పుడు ACఅంటేనే లగ్జరీసింబల్ వలె పరిగణించబడేవి. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి మధ్యతరగతి గృహాల్లో మెట్రోనగరాల్లోనే కాకుండా చిన్నచిన్న గ్రామాలలో కూడా కనిపిస్తున్నాయి అంటే నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామమే. నూతన సాంకేతికతలు, ఆరోగ్యప్రయోజనాలు, ఇంధనసామర్ధ్యాల పరిచయంతో, వినియోగదారులు తమ అవసరాలపట్ల మరింత అవగాహన కలిగున్నారు. వారు ఎన్నోరకాల బ్రాండ్లు, ఉత్పత్తి సమర్పణలను ప్రత్యామ్నాయాలుగా కూడా కలిగున్నారు. పరిశ్రమ నిపుణులు, విశ్లేషకులు 'శక్తిసామర్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ, ఆవిష్కరణలు' అనే మూడుఅంశాలను 2014లో వినియోగదారుల కొనుగోలు ఆలోచనలకు మార్గనిర్దేశం చేశారు కూడా.

 

ప్రస్తుతం వస్తున్న బ్రాండ్లు అత్యంత శక్తివంతమైన స్టార్ రేటింగ్ ఎసిలను కూడా ప్రారంభించాయి. అనూహ్యంగా ఆరోగ్య పరిస్థితులు, స్థానిక వాతావరణ నమూనాలు, వినియోగదారుల అవసరాల ఆధారంగా భారతీయ మార్కెట్లకై ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడి విలువజోడించిన లక్షణాలను కలిగుoడేలా జాగ్రత్తలను తీసుకుంటున్నారు. అంతేకాకుండా శీతలీకరణ పరికరాల వలెనే కాకుండా, ఈ కొత్త ఎసిలు తేమనియంత్రణ, గాలిశుద్దీకరణ లక్షణాలను కలిగుoడడమే కాకుండా దోమలను ఎటువంటి విషకారకాలు లేకుండా నియంత్రించగలిగే సామర్ధ్యంతో, చక్కటి నిద్రానుభూతిని ఇచ్చే లక్షణాలతో మార్కెట్లో లభిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రభాలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈవేసవిలో ఎసి కొనుగోలు చేయునపుడు, LGఇండియా, AC's మార్కెటింగ్ హెడ్ సౌరభ్ బియాషియా సూచనల ప్రకారం:

ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఆ రెండు సైట్లలో మాత్రమే !ఈ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఆ రెండు సైట్లలో మాత్రమే !

సామర్థ్యం:

సామర్థ్యం:

ఎసి సామర్థ్యాన్ని, అవసరమయ్యే గది పరిమాణంపై ఆధారపడి పరిగణించాలి. ఒక ఖచ్చితమైన కొలత 120~140 చదరపుఅడుగుల పరిధికి 1టన్ను, 150~180 చదరపుఅడుగుల ప్రాంతానికి 1.5టన్ను మరియు 180~240 చదరపు అడుగుల ప్రాంతానికి 2టన్నుల సామర్థ్యం అవసరం.

శక్తిసామర్ధ్యం:

శక్తిసామర్ధ్యం:

నేడు, పెరుగుతున్న మెర్క్యురీ స్థాయిలు మరియు విద్యుత్ సుంకాలను దృష్టిలో ఉంచుకుని సరైన శక్తిసామర్ధ్యాలు కలిగిన AC ఎంచుకోవలసిన పరిస్తితి ఉంది. AC స్టార్ రేటింగ్ ఇంధన సామర్ధ్యం కలిగి వస్తాయి; దీనిని EER అని పిలుస్తారు, ఇది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE)చే ప్రామాణీకరించబడింది. అందువల్ల, ఎక్కువ స్టార్లు కలిగి ఉన్నఎసిలు తక్కువ యూనిట్ విద్యుత్తుని వినియోగిస్తాయి.

స్ప్లిట్(లేదా)విండోAC:
 

స్ప్లిట్(లేదా)విండోAC:

మీకు విండోAC లేదా స్ప్లిట్ కావాలా అనేది మరొక నిర్ణయకారకం. విండో యూనిట్లు చవకగా మరియు సులువుగా ఇన్స్టాల్ అయినప్పటికీ, స్ప్లిట్ ఎసిలు ప్రశాంతమైనవిగా, ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచిగాలిని అందిస్తాయి.

ఉత్పత్తి ధర:

ఉత్పత్తి ధర:

ధర అనేది మరొక ముఖ్యమైన అంశం. ఇది ఫీచర్లను మరియు స్టార్ల రేటింగ్స్ ఆధారితంగా నిర్ణయించబడి ఉంటుంది. ప్రతి స్టార్ రేటింగ్ పెరుగుదలకు కనీసం రు.2,500 ల పెరుగుదల ఉంటుంది. ఇన్వర్టర్AC అనేది సాధారణంగా 5-స్టార్ రేటెడ్ స్ప్లిట్ AC కంటే 20% ఎక్కువగా ఉంటుంది.

ఎయిర్ క్వాలిటీ:

ఎయిర్ క్వాలిటీ:

ఇంట్లో ఎసి ఉన్నప్పుదు అంతర్గత గాలినాణ్యత చాలా ముఖ్యమైనది; అందువల్ల ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు మంచి ఫిల్టర్తో కూడిన AC ముఖ్యం. ఒక మంచి ఫిల్టర్ శుభ్రంగా గాలిని ఇవ్వడమే కాకుండా ఎవాపరేటర్,దుమ్మును సంగ్రహించడం ద్వారా ఊపిరి స్థాయిలను పెంచడo చేస్తుంది. AC శీతలీకరణ, పనితీరు మరియు శక్తిసామర్ధ్యాన్ని పెంచుతుంది.

సంస్థాపన అవసరాలు:
విండోAC, Windowsకి అనుసంధానించబడేలా తయారు చేయబడిన కాంపాక్ట్ యూనిట్. స్ప్లిట్ ఎసి, ఇంటి వెలుపల కంప్రెసర్ యూనిట్ కలిగి ఉంటుంది. మరియు గదిలోపల ఇండోర్ యూనిట్ కలిగుంటుంది, ప్రత్యేకించి గాలిలో మంచి ప్రవాహానికై రూపొందించబడింది. అధీకృత సర్వీస్ సెంటర్ నుండే ఎల్లప్పుడూ ఇన్స్టాలేషన్ జరగాలి. AC పనితీరు ఎల్లప్పుడూ మంచి లేదా చెడు సంస్థాపనలపైనే ఆధారపడి ఉంటుంది.

 

నిర్వహణ&క్లీనింగ్:

నిర్వహణ&క్లీనింగ్:

ఎసిలు కార్లతో సమానం. ఉత్తమమైన పనితీరులో ఉండటానికి ఎల్లప్పుడూ పర్యవేక్షణ అవసరం. ఇన్స్టాలేషన్ తర్వాత, క్రమబద్ధమైన సేవలు అవసరం, ముఖ్యంగా మొదటి త్రైమాసికం.
శీతలీకరణ వేగం:
రోజులో వేర్వేరు సమయాల్లో అవసరానికి తగ్గట్లు వేగాలను నియంత్రంచేవిధంగా ACకి సర్దుబాటు చేయగలిగే థర్మోస్టాట్(ఉష్ణోగ్రత సెట్టింగ్), కనీసం రెండు శీతలీకరణ వేగాలు, రెండు ఫాన్ల వేగాలు ఉండాలి. ఎనర్జీ ఎఫీషియంట్ సెట్టింగ్, కోరుకున్న శీతలీకరణని అందించేటప్పుడు శక్తిని ఆదాచేయడంలో సహాయపడుతుంది.

ఇన్స్టాలేషన్ సర్వీసుల తర్వాత:

ఇన్స్టాలేషన్ సర్వీసుల తర్వాత:

ఇన్స్టాలేషన్ తర్వాత వారంటీ వంటి యాడ్-ఆన్ లక్షణాలు ఖచ్చితంగా మీకొనుగోలుకు ప్రయోజనంగా ఉంటుంది. మీ ఉత్పత్తిసేవల అవసరాన్ని తీర్చడానికి సామర్థ్యాలు, మంచి నెట్వర్క్ కలిగున్న ఉత్తమ బ్రాండ్ ఎంచుకోండి.

ఇతర ముఖ్యలక్షణాలు:

ఇతర ముఖ్యలక్షణాలు:

చాలా ACయూనిట్లు డీహ్యుమిడిఫికేషన్ ఫీచర్తో వస్తుంటాయి, ఇది గాలిలో తేమని తగ్గిoచి, శీతలీకరణను అద్భుతంగా నియంత్రిస్తూ మరింత సౌకర్యాన్ని పెంచుతుంది. మోడల్, ధ్వనిస్థాయిలను తనిఖీ చేయడం ముఖ్యం, ఇది 19-60 డెసిబెల్స్ వరకు ఉంటుంది. ఎసిలో స్లీప్ మోడ్ ఫంక్షన్ ఉపయోగపడుతుంది, ఇది రాత్రివేళల్లో ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. పవర్ బ్రేక్ తర్వాత చివరి సెట్టింగ్ పునరుద్ధరించడానికి మీయూనిట్ ఆటో-పునఃప్రారంభ సౌకర్యం కలిగుoడాలి.

మల్టీపర్పస్:

మల్టీపర్పస్:

ఈరోజుల్లో ACశీతలీకరణకోసం మాత్రమే ఉపయోగించబడడంలేదు, కాలానుగుణ ఉత్పత్తిగా వేసవి, శీతాకాలాలలో కూడా ఉపయోగించబడేలా వస్తున్నాయి. ఈ హాట్&కోల్డ్ AC, హీటర్లకన్నా35%ఎక్కువశక్తిని ఆదాచేస్తాయి. ఇప్పుడు వస్తున్న ఎసిలు తేమనుకూడా నియంత్రిoచగలవు. వర్షాకాలంలో తేమను నియంత్రిoచేలా AC ఉండాలి.

Best Mobiles in India

English summary
what to look for while buying an AC, and how to get the best out of it. more news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X