WhatsApp Payments: వాట్సాప్ పే ద్వారా పేమెంట్స్ చేయడం ఎలా?

|

ప్రపంచం మొత్తం మీద త్వరిత మెసేజ్ కోసం ఉపయోగించే వాట్సాప్ ఎట్టకేలకు తన పేమెంట్స్ ఫీచర్ ను ఇండియాలో విడుదల చేసింది. వాట్సాప్ పే నెమ్మదిగా దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి వస్తోంది. కాబట్టి ఈ ఫీచర్ మీ కోసం ఇంకా చూపించకపోతే చింతించకండి ఎందుకంటే ఇది త్వరలోనే చూపబడుతుంది.

వాట్సాప్ పేమెంట్స్ - NPCI భాగస్వామ్యం

వాట్సాప్ పేమెంట్స్ - NPCI భాగస్వామ్యం

వాట్సాప్ పేమెంట్స్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) భాగస్వామ్యంతో రూపొందించబడ్డాయి. ఇది యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) ఆధారంగా రూపొందించబడింది. ఆండ్రాయిడ్ మరియు iOS వినియోగదారులు వాట్సాప్ యొక్క తాజా వెర్షన్‌లో దీనిని పొందవచ్చు. మీ వాట్సాప్ నంబర్ మీ బ్యాంక్ అకౌంటుకు లింక్ చేయబడి ఉంటేనే ఈ ఫీచర్ మీకు అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ ద్వారా పేమెంట్స్ ఎలా చేయాలో వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: ప్రపంచం లో టాప్10 అతి పెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీ లు ఇవే! టాప్ 3 లో Apple లేనే లేదు...?Also Read: ప్రపంచం లో టాప్10 అతి పెద్ద స్మార్ట్ ఫోన్ కంపెనీ లు ఇవే! టాప్ 3 లో Apple లేనే లేదు...?

వాట్సాప్ పేమెంట్స్ సెటప్ చేసే విధానం

వాట్సాప్ పేమెంట్స్ సెటప్ చేసే విధానం

వాట్సాప్ పే మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ను పీర్ చేయడానికి ఇప్పుడు అనుమతిస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ పేమెంట్స్ లను సెటప్ చేయడానికి కింద ఉన్న పద్దతులను పాటించండి.


స్టెప్ 1> వాట్సాప్ ఓపెన్ చేయండి> సెట్టింగ్‌లకు వెళ్లి> పేమెంట్ ఎంపికను నొక్కండి.

స్టెప్ 2> పేమెంట్ పద్ధతిని జోడించు ఎంపిక మీద నొక్కండి. తరువాత మీ యొక్క బ్యాంకును ఎంచుకోండి.

స్టెప్ 3> మీరు మీ బ్యాంకును ఎంచుకున్న తర్వాత మీ యొక్క ఫోన్ నంబర్‌ను ధృవీకరించాలి. SMS ద్వారా ధృవీకరించు ఎంపికను నొక్కండి.

స్టెప్ 4> ధృవీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి ఉండండి. పూర్తయిన తర్వాత మీ బ్యాంక్ వివరాలు పేమెంట్ పద్ధతుల క్రింద చేర్చబడతాయి.

 

వాట్సాప్ పే ద్వారా పేమెంట్స్ చేసే విధానం

వాట్సాప్ పే ద్వారా పేమెంట్స్ చేసే విధానం

వాట్సాప్ పే ద్వారా పేమెంట్స్ రిజిస్టర్ చేయని వ్యక్తులతో పాటు వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ లను కలిగిన వారికి కూడా డబ్బును పంపించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ కలిగిన వారికి డబ్బును పంపడానికి ఈ దశలను అనుసరించండి.


స్టెప్1> వాట్సాప్ చాట్ ఓపెన్ చేసి అటాచ్మెంట్ చిహ్నాన్ని నొక్కండి.

స్టెప్ 2 > పేమెంట్ ఎంపిక మీద నొక్కండి> పంపవలసిన మొత్తాన్ని టైప్ చేయండి> ఎంటర్ నొక్కండి.

స్టెప్ 3 >పేమెంట్ ను పూర్తి చేయడానికి మీ యొక్క UPI పిన్ను నమోదు చేయండి.

 

ఫోన్‌పే లేదా గూగుల్ పే యాప్ లకు వాట్సాప్ పే ద్వారా డబ్బును పంపే విధానం?

ఫోన్‌పే లేదా గూగుల్ పే యాప్ లకు వాట్సాప్ పే ద్వారా డబ్బును పంపే విధానం?

స్టెప్ 1 >వాట్సాప్ ఓపెన్ చేయండి> సెట్టింగ్‌లకు వెళ్ళండి> పేమెంట్ ఎంపిక మీద నొక్కండి.


స్టెప్ 2 > క్రొత్త పేమెంట్ ఎంపిక మీద నొక్కండి> సెండ్ టూ UPI id మీద నొక్కండి> UPI ఐడిని నమోదు చేయండి> ధృవీకరించు నొక్కండి.

స్టెప్ 3 > UPI ఐడి ధృవీకరించబడిన తరువాత మీరు పంపవలసిన మొత్తాన్ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి.

పేమెంట్ ను పూర్తి చేయడానికి మీ యొక్క UPI పిన్ను నమోదు చేయండి.

 

Best Mobiles in India

English summary
How to Send and Receive Money Through WhatsApp Pay

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X