Gmailలో రహస్యంగా ఏదైనా మెసేజ్ ని పంపడం ఎలా?

|

ఇమెయిల్ ఉపయోగం అధికంగా ఉన్నప్పుడు దానిలోని ఏదైనా కంటెంట్‌లను సురక్షితంగా ఉంచడానికి గూగుల్ TLS ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగిస్తుంది. ఈ ఎన్‌క్రిప్షన్‌ని ఉపయోగించినప్పుడు వినియోగదారులు పంపినవారి నుండి రిసీవర్‌కు చేరినప్పుడు వారి సంభాషణలను హ్యాకర్లు స్నూప్ చేయకుండా నిరోధిస్తుంది. అయితే ఇమెయిల్‌లోని రహస్య వివరాలు లీక్ కాకుండా నిరోధించడానికి కొన్నిసార్లు ఎన్‌క్రిప్షన్ సరిపోదు. రహస్య వివరాలను కలిగి ఉన్న ఇమెయిల్‌ను స్వీకరించే వ్యక్తి అనుకోకుండా మెయిల్‌ను ఉద్దేశించని వ్యక్తికి ఫార్వార్డ్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయాల్లో Gmail అటువంటి లీక్‌లను నిరోధించడం కోసం కాన్ఫిడెన్షియల్ మోడ్ అనే ఫీచర్‌ని కలిగి ఉంది.

కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో Gmail

కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో Gmail వినియోగదారులు మెసేజ్ల కోసం గడువు తేదీని సెట్ చేయవచ్చు లేదా ఎప్పుడైనా యాక్సెస్‌ని ఉపసంహరించుకోవచ్చు. కాన్ఫిడెన్షియల్ మెసేజ్ గ్రహీతలు కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో పంపిన ఇమెయిల్‌లో మెసేజ్ ని మరొకరికి ఫార్వార్డ్ చేయలేరు, కాపీ చేయలేరు, ప్రింట్ చేయలేరు మరియు డౌన్‌లోడ్ కూడా చేయలేరు. అయితే వారు ఇమెయిల్‌లో ఫోటోలు మరియు ఇతర వివరాలను స్క్రీన్‌షాట్‌ రూపంలో క్యాప్చర్ చేయవచ్చు. అయితే కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో ఇమెయిల్‌ను ఎలా పంపాలి అని ఆలోచిస్తుంటే కనుక కింద సూచించిన మార్గాలను అనుసరించండి.

PCలోని Gmailలో కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో ఉన్న ఇమెయిల్‌ను పంపే విధానం

PCలోని Gmailలో కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో ఉన్న ఇమెయిల్‌ను పంపే విధానం

స్టెప్ 1: మీ వెబ్ బ్రౌజర్‌లో Gmailని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: కంపోజ్ బటన్‌ను క్లిక్ చేయండి.

స్టెప్ 3: విండో దిగువ భాగంలో కుడివైపున కాన్ఫిడెన్షియల్ మోడ్‌ని ఆన్ చేయి ఎంపికను క్లిక్ చేయండి.

స్టెప్ 4: తరువాత గడువు తేదీని ఎంచుకొని పాస్‌కోడ్‌ను సెట్ చేయండి.


ముఖ్యంగా మీరు "నో SMS పాస్‌కోడ్" ఎంచుకుంటే కనుక Gmail యాప్‌ని ఉపయోగించే గ్రహీతలు దానిని నేరుగా ఓపెన్ చేయగలరు. Gmail ఉపయోగించని స్వీకర్తలకు పాస్‌కోడ్ ఇమెయిల్ పంపబడుతుంది. అయితే మీరు "SMS పాస్‌కోడ్" ఎంచుకుంటే కనుక గ్రహీతలు టెక్స్ట్ మెసేజ్ ద్వారా పాస్‌కోడ్‌ను పొందుతారు. మీరు గ్రహీత ఫోన్ నంబర్‌ను నమోదు చేశారని నిర్ధారించుకోండి.

స్టెప్ 5: సేవ్ ఎంపిక మీద క్లిక్ చేయండి.

 

ఆండ్రాయిడ్ యాప్‌లో కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో ఇమెయిల్‌ను పంపే విధానం

ఆండ్రాయిడ్ యాప్‌లో కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో ఇమెయిల్‌ను పంపే విధానం

స్టెప్ 1: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో Gmail యాప్‌ను ఓపెన్ చేయండి.

స్టెప్ 2: కంపోజ్ బటన్‌ను నొక్కండి.

స్టెప్ 3: యాప్ యొక్క కుడివైపు ఎగువ మూలలో మోర్ ఎంపికపై నొక్కండి. ఆపై కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను ఎంచుకోండి.

స్టెప్ 4: ఇప్పుడు గడువు తేదీ, పాస్‌కోడ్ మరియు ఇతర నియంత్రణలను సెట్ చేయండి.

స్టెప్ 5: తరువాత 'డన్' ఎంపిక మీద నొక్కండి.

 

iOS యాప్‌లో కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో ఇమెయిల్‌ను పంపే విధానం

iOS యాప్‌లో కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో ఇమెయిల్‌ను పంపే విధానం

స్టెప్ 1: మీ iPhoneలో Gmail యాప్‌ని ఓపెన్ చేయండి.

స్టెప్ 2: కంపోజ్ ఎంపికను నొక్కండి.

స్టెప్ 3: యాప్ యొక్క కుడి ఎగువ మూలలో ఉన్న మోర్ ఎంపికపై నొక్కండి. ఆపై కాన్ఫిడెన్షియల్ మోడ్‌ను నొక్కండి.

స్టెప్ 4: గడువు తేదీ, పాస్‌కోడ్ మరియు ఇతర నియంత్రణలను సెట్ చేసి, ఆపై డన్ ఎంపిక మీద నొక్కండి.

 

Best Mobiles in India

English summary
How to Send Confidential Message on Gmail Step-by-Step Process

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X