అదిరిపోయే WhatsApp స్టిక్క‌ర్ల‌తో Diwali విషెస్ చెప్పండి!

|

భార‌త దేశ ప్ర‌జ‌ల‌కు Diwali అంటే ఓ ప్ర‌త్యేక‌మైన పండ‌గ‌. ఈ పండ‌గ‌ను దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎంతో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకుంటారు. అయితే గత రెండు సంవత్సరాలుగా, కరోనా కాలం కారణంగా, Diwali హ‌డావుడి కాస్త తగ్గింది. అయితే, ఈ ఏడాది Diwali శోభ ప్రజల్లో కొంత ముందుగానే కనిపిస్తోంది. క‌రోనా కాలంలో మిస్ అయిందంతా ఈ ఏడాది జ‌రుపుకోవాల‌నే ఉత్సుక‌త‌తో చాలా మంది ఉన్నారు. ఓ వైపు ఇప్పుటికే ప్రజలు తమ ఇళ్లలో దీపాలను ప్రతిష్టించేందుకు ప్రజలు దీపాలను కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో చాలా ఇళ్లు ఇప్పటికే దీపాలతో కళకళలాడుతున్నాయి.

 
అదిరిపోయే WhatsApp స్టిక్క‌ర్ల‌తో Diwali విషెస్ చెప్పండి!

ఈ క్ర‌మంలో, Diwali శుభ సందర్భంగా మీ ప్రియమైన వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి మీరు కూడా ప్ర‌త్యేక‌త చాటుకోండి. WhatsApp వేదిక‌గా.. విభిన్న‌మైన స్టిక్కర్‌ల సాయంతో Diwali శుభాకాంక్ష‌లు చెప్పుకోండి. మీకు స్టిక్క‌ర్లు ఎలా పంపాలో తెలియ‌క‌పోతే.. ఈ ఆర్టిక‌ల్ పూర్తిగా చ‌ద‌వండి.. ఇందులో వివ‌రంగా తెలియ‌జేస్తున్నాం.

Diwali ప్ర‌త్యేక‌త ఏమిటి!
దీపావళి భారతదేశం అంతటా జరుపుకునే ఒక పండుగ. ఇది చీకటిపై కాంతి, చెడుపై మంచి, నిరాశపై ఆశ యొక్క విజయాన్ని సూచించే పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీనిని దీవాలి అని దీపావళి అని కూడా పిలుస్తారు.

కొన్ని కారణాల వల్ల మీరు ఈ Diwali రోజున మీ స్నేహితులను మరియు కుటుంబ సభ్యులను కలవలేక పోయినట్లయితే, మీరు WhatsApp ద్వారా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. గణేష్ చతుర్థి సందర్భంగా వాట్సాప్ విష్ స్టిక్కర్లను ఎలా షేర్ చేయాలో తెలుసుకుందాం.

అదిరిపోయే WhatsApp స్టిక్క‌ర్ల‌తో Diwali విషెస్ చెప్పండి!

వాట్సాప్‌లో శుభాకాంక్ష‌లు తెలిపేందుకు అందుబాటులో ప్ర‌త్యేక స్టిక్క‌ర్ ప్యాక్‌లు!
WhatsApp ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్‌లలో ఒకటి, దీనిని ఉపయోగించడం కూడా చాలా సులభం. ఈ రోజుల్లో మీరు వాట్సాప్ వేదిక‌గా GIF, డూడుల్, స్టిక్కర్ మరియు యానిమేటెడ్ స్టిక్కర్‌తో సహా అనేక ఫీచర్‌లను పొందుతున్నారు. ఈ వేదిక‌గా మీరు ఎవరితో అయినా ఏదైనా పంచుకోవచ్చు. మీరు వాట్సాప్ ద్వారా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో చాట్ చేయడమే కాకుండా, ప్రత్యేక రోజున వారికి శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ స్టిక్కర్‌లను కూడా ఉపయోగించవచ్చు.

అదిరిపోయే WhatsApp స్టిక్క‌ర్ల‌తో Diwali విషెస్ చెప్పండి!

స్టిక్క‌ర్ల‌ను ఎలా పొందాలి.. ఎలా పంపాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌!
* ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ని ఓపెన్ చేయాలి.
* సెర్చ్ బార్‌కి వెళ్లి 'Diwali 2022 వాట్సాప్ స్టిక్కర్‌' అని టైప్ చేయండి. తద్వారా మీరు అందుకు సంబంధించిన థ‌ర్డ్ పార్టీల‌ యొక్క వాట్సాప్ స్టిక్కర్‌లకు సంబంధించిన ప్యాక్ లు కొన్ని మీ ముందు క‌నిపిస్తాయి.
* ఆ జాబితాలో మీరు ఉపయోగించాలనుకుంటున్న స్టిక్కర్ ప్యాక్ యాప్‌లను ఎంచుకోవాలి. మీరు యాప్‌ని ఎంచుకున్న తర్వాత, దాన్ని మీ Android స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయడానికి ఇన్‌స్టాల్ బటన్‌పై క్లిక్ చేయండి.
* ఇందులో స్టిక్క‌ర్లు మాత్రమే కాకుండా యానిమేటెడ్ స్టిక్కర్ ప్యాక్‌లు కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఉపయోగించాలనుకుంటున్న స్టిక్కర్ ప్యాక్‌ని ఎంచుకుని, ప్రతి స్టిక్కర్ ప్యాక్‌కి కుడి వైపున ఉన్న 'ప్లస్' చిహ్నంపై నొక్కుతూ ఉండండి. ఈ ప్ర‌క్రియ‌ను అనుస‌రిస్తూ.. మీ వాట్సాప్‌కు స్టిక్క‌ర్ ప్యాక్ ను యాడ్ చేసుకోవాలి.
* మీరు ఈ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత, మీరు ఈ స్టిక్కర్ ప్యాక్‌లన్నింటినీ పొందుతారు. ఇప్పుడు మీరు వాట్సాప్‌లోని స్టిక్క‌ర్ సెక్ష‌న్ ఓపెన్ చేసిన వెంట‌నే Diwali కి సంబంధించిన స్టిక్క‌ర్‌లు మీ ముందు వ‌స్తాయి. వాటిని ఉప‌యోగించి ఎవ‌రికైనా మీరు శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌వ‌చ్చు.
* మ‌రో విష‌యం ఏంటంటే.. ఐఫోన్ యూజ‌ర్ల‌కు ఇందుకు సంబంధించి థ‌ర్డ్ పార్టీ స్టిక్క‌ర్లు డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి యాపిల్ స్టోర్‌లో అవ‌కాశం లేదు.

Best Mobiles in India

English summary
How to send Diwali wishes with best stickers through whatsapp.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X