గ్రూప్‌తో సంబంధం లేకుండా మల్టిపుల్ యూజర్లకు మెసేజ్‌ సెండ్ చేయటం ఎలా..?

|

ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌ను మరింత సులభతరం చేస్తూ మార్కెట్లోకి దూసుకొచ్చిన వాట్సాప్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. వాట్సాప్ అందిస్తోన్న బెస్ట్ ఫీచర్లలో గ్రూప్ చాటింగ్ ఒకటి. దాదాపు ప్రతిఒక్క వాట్సాప్ యూజర్ ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నారు. వాట్సాప్ గ్రూప్ చాట్స్ వల్ల ఉపయోగాలతో పాటు నిరుత్సహాపరిచే పరిచే విషయాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ గ్రూప్ చాట్‌లలో మన చాటింగ్ తాలూకా ముఖ్యమైన సంభాషణలను వెతికిపట్టుకోవటం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇలాంటి సమస్యను తరచూ మీరు ఫేస్ చేయవల్సి వస్తున్నట్లయితే ఇక మీ పై మెసేజ్‌లను గ్రూప్ చాట్స్ ద్వారా పంపకుండా ఇప్పుడు సూచించబోతోన్న కొత్త పద్ధతిలో పంపే ప్రయత్నం చేయండి.

 
గ్రూప్‌తో సంబంధం లేకుండా మల్టిపుల్ యూజర్లకు మెసేజ్‌ సెండ్ చేయటం ఎలా..?

స్టన్నింగ్ ఫీచర్లతో షియోమి Redmi Y2, రూ.9999కే 3జిబి ర్యామ్ ఫోన్స్టన్నింగ్ ఫీచర్లతో షియోమి Redmi Y2, రూ.9999కే 3జిబి ర్యామ్ ఫోన్

గ్రూప్ అనేదే అవసరం లేకుండా...
వాట్సాప్‌లోని బ్రాడ్‌కాస్ట్ అనే ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా గ్రూప్ అనేదే అవసరం లేకుండా ఒకేసారి మల్టిపుల్ యూజర్లకు మెసేజ్‌లను షేర్ చేసుకునే వీలుంటుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆండ్రాయిడ్ యూజర్లు వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్ ఫీచర్‌ను వినియోగించుకోవాలంటే..?
ఆండ్రాయిడ్ యూజర్లు ముందుగా తమ వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి యాప్ మెయిన్ స్ర్కీన్ పై కనిపించే Chats tab పై క్లిక్ చేయాలి. చాట్స్ ట్యాబ్ ఓపెన్ అయిన తరువాత టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే మూడు వెర్టికల్ డాట్స్ పై టాప్ చేయాలి. ఇప్పుడు మీకు కొత్త బ్రాడ్‌కాస్ట్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకునే అవకాశం లభిస్తుంది.

బ్రాడ్‌కాస్ట్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్న తరువాత అందులో యాడ్ చేయాలనుకుంటోన్న వారి పేర్లను సెలక్ట్ చేసుకుని కుడివైపు కార్నర్‌లో కనిపించే గ్రీన్ టిక్ మార్క్ పై టాప్ చేసినట్లయితే లిస్ట్ రెడీ అయిపోతుంది. ఈ లిస్టులో 256 మందిని మీరు యూడ్ చేసుకునే వీలుంటుంది. ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత నుంచి గ్రూప్ అనేదే అవసరం లేకుండా ఒకేసారి మల్టిపుల్ యూజర్లకు మెసేజ్‌లను షేర్ చేసుకునే వీలుంటుంది.

Airtel TV మరో ఆరు నెలల పాటు ఉచితం, బెస్ట్ ప్లాన్లు ఇవేAirtel TV మరో ఆరు నెలల పాటు ఉచితం, బెస్ట్ ప్లాన్లు ఇవే

ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్ ఫీచర్ ను వినియోగించుకోవాలంటే..?
ఐఓఎస్ యూజర్లు ముందుగా తమ ఐఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి యాప్ హోమ్ స్ర్కీన్ పై కనిపించే Chats tab పై క్లిక్ చేయాలి. చాట్స్ ట్యాబ్ ఓపెన్ అయిన తరువాత రైట్ హ్యాండ్ కార్నర్‌లో కనిపించే Broadcast లిస్ట్స్ ఆప్షన్ పై టాప్ చేసి కాంటాక్ట్స్ లిస్టును యాడ్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ పూర్తయిన తరువాత నుంచి గ్రూప్ అనేదే అవసరం లేకుండా ఒకేసారి మల్టిపుల్ యూజర్లకు మెసేజ్‌లను షేర్ చేసుకునే వీలుంటుంది.

Best Mobiles in India

English summary
whatsApp has become one of the easiest way of communication. But at the same time it is also a pain as you have to become part of various groups and its takes a lot of time to keep track of the conversation or even to revert to a message.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X