WhatsApp పేమెంట్స్ ద్వారా బ్యాంక్ అకౌంటుకు డబ్బులను పంపడం ఎలా??
ప్రముఖ ఇన్స్టెంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యొక్క వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పేమెంట్ ఫీచర్‌ను ఎట్టకేలకు ఈ ఏడాది అధికారికంగా విడుదల చేసింది. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ 2021లో ప్రారంభించిన అత్యుత్తమ ఫీచర్లలో ఇది ఒకటి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. పేమెంట్ ఫీచర్‌లతో వాట్సాప్ స్పష్టంగా Google Pay, PhonePe, Paytm వంటి ఇతర పేమెంట్ సేవలను పొందాలని లక్ష్యంగా పెట్టుకుంది. మీకు ఇప్పటికీ వాట్సాప్ పేమెంట్లను ఉపయోగించే అవకాశం లేకుంటే కనుక మీరు వాట్సాప్ పేమెంట్లను ఉపయోగించడం ఎలా ప్రారంభించాలో, బ్యాంక్ అకౌంటులకు తక్షణమే డబ్బు పంపడం మరియు స్వీకరించడం ఎలాగో వంటి వివరాలకు సంబందించిన పూర్తి గైడ్ గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

WhatsApp పేమెంట్లను ఎలా సెటప్ చేయాలి
స్టెప్ 1: మీ Android లేదా iOS మొబైల్ ఫోన్‌లో WhatsApp యాప్‌ని ఓపెన్ చేయండి.
స్టెప్ 2: సెట్టింగ్‌ల మెనుకి వెళ్లండి.
స్టెప్ 3: క్రిందికి స్క్రోల్ చేసి పేమెంట్ ఎంపికపై నొక్కండి.
స్టెప్ 4: జాబితా నుండి బ్యాంకును ఎంచుకోవడం ద్వారా బ్యాంక్ అకౌంటు వివరాలను జోడించండి.
స్టెప్ 5: బ్యాంక్ అకౌంట్ వివరాలు విజయవంతంగా జోడించబడ్డాయి అని నిర్దారించుకోండి.

WhatsApp ఉపయోగించి డబ్బు పంపడం ఎలా
స్టెప్ 1: మీ బ్యాంక్ అకౌంటును జోడించిన తర్వాత మీరు మీ వాట్సాప్ ని ఉపయోగించి డబ్బు పంపవచ్చు లేదా స్వీకరించవచ్చు.
స్టెప్ 2: డబ్బు పంపడానికి ఏదైనా కాంటాక్టును ఓపెన్ చేయండి.
స్టెప్ 3: తరువాత పేమెంట్ ఎంపికకు వెళ్లండి.
స్టెప్ 4: మీ బ్యాంక్ అకౌంటును ఎంచుకోండి.
స్టెప్ 5: UPI పిన్‌తో పాటు పంపవలసిన డబ్బు మొత్తాన్ని నమోదు చేయండి
మీ లావాదేవీ ఇప్పుడు విజయవంతంగా పూర్తయింది.

WhatsApp ఉపయోగించి డబ్బును స్వీకరించే విధానం
ఇందుకోసం మీరు ముందుగా పైన తెలిపిన విధంగా మీ WhatsApp పేమెంట్లు సెటప్ చేయబడి మరియు బ్యాంక్ అకౌంట్ జోడించబడిందని నిర్ధారించుకోవాలి. అలా చేయడానికి క్రింది దశలను అనుసరించండి:
స్టెప్ 1- WhatsApp యాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2 - సెట్టింగ్‌ల మెనుకి వెళ్లండి.
స్టెప్ 3 - పేమెంట్ ఎంపికకు వెళ్లండి.
స్టెప్ 4 - బ్యాంక్ పేరును ఎంచుకోండి.
స్టెప్ 5 - మీ బ్యాంక్ అకౌంటును జోడించండి.

నక్షత్రం గుర్తు ఉన్న సందేశాలను ఎలా యాక్సెస్ చేయాలి
స్టెప్ 1: మీ వాట్సాప్ హోమ్ పేజీ యొక్క కుడి ఎగువ మూలలో చూపిన మూడు చుక్కలపై క్లిక్ చేయండి
స్టెప్ 2: 'నక్షత్రం గుర్తు ఉన్న మెసేజ్లు' ఎంపికకు వెళ్లండి.
స్టెప్ 3: మీరు తేదీతో పాటు మెసేజ్ పైన పంపినవారు మరియు స్వీకరించేవారి పేరును చూస్తారు.
స్టెప్ 4: మెసేజ్ ను చాట్‌లో వీక్షించడానికి దానిపై నొక్కండి.
స్టెప్ 5: ఇది మిమ్మల్ని మెసేజ్ నక్షత్రం ఉంచిన అసలు స్థానానికి నావిగేట్ చేస్తుంది.
స్టెప్ 6: మీరు వ్యక్తి లేదా గ్రూప్ పేరుపై క్లిక్ చేయడం ద్వారా కూడా తనిఖీ చేయవచ్చు.
స్టెప్ 7: 'నక్షత్రం గుర్తు ఉన్న మెసేజ్లు' ఎంపికకు క్రిందికి స్లైడ్ చేయండి.
స్టెప్ 8: మీరు నక్షత్రం గుర్తు ఉన్న అన్ని మెసేజ్ల జాబితాను చూస్తారు.
మీరు మెసేజ్ నుండి నక్షత్ర గుర్తును తీసివేయాలనుకుంటే కనుక నక్షత్రం గుర్తు ఉన్న మెసేజ్ ఎంపికకు వెళ్లి ఆ మెసేజ్ మీద ఎక్కువసేపు నొక్కండి. స్క్రీన్ పై భాగంలో మీరు మెసేజ్‌ని అన్‌స్టార్ చేయగల ఎంపిక మీద నొక్కడం ద్వారా నక్షత్రాన్ని తొలగించవచ్చు.


Click it and Unblock the Notifications








