టెలిగ్రామ్‌లో మెసేజ్ లను షెడ్యూల్ చేయడం ఎలా?

|

ప్రపంచవ్యాప్తంగా 2021 జనవరిలో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన మెసేజింగ్ యాప్ లో టెలిగ్రామ్ మొదటి స్థానంలో ఉండి జనాదరణను అధికంగా పెంచుకున్నది. భారతదేశంలో కూడా అధిక డౌన్‌లోడ్‌లను సాధించి అధిక జనాదరణ పొందిన వాట్సాప్ ను సైతం వెనక్కి నెట్టింది. టెలిగ్రామ్ ఇప్పుడు మొత్తంగా 63 మిలియన్ల ఇన్‌స్టాల్‌లతో మరియు భారతదేశంలో 24 శాతం వాటాను కలిగి ఉంది. ప్రజలు ఈ యాప్ ను ఆదరించడం ప్రారంబించారు. టెలిగ్రామ్‌లో వినియోగదారులకు కావలసిన అనేక రకాల ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా కొత్త కొత్త అప్ డేట్ లను ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందిస్తున్నది.

How to Send Schedule Messages on Telegram: Step by Step Guide

స్నేహితులు, కుటుంబసభ్యులు మరియు సహోద్యోగులతో ముచ్చడించడానికి ఉపయోగించే సోషల్ మీడియా యాప్ ఏది అంటే ఇది వరకు అందరూ తెలిపే మొదటి పేరు వాట్సాప్. అయితే ఇటీవల కొత్తగా సర్వీస్ నిబంధనలను మరియు గోప్యతా విధానాన్ని తీసుకురావడంతో పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది. అందులో భాగంగా ప్రముఖ క్లౌడ్-బేస్డ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ కు అధిక మంది వినియోగదారులు వాట్సాప్ నుండి మారుతున్నారు. ఒక నిర్దిష్ట సమయంలో ఏదైనా ఒక నిర్దిష్ట మెసేజ్ ను షెడ్యూల్ చేయడానికి కూడా వినియోగదారులను అనుమతిస్తుంది. వాట్సాప్ మాదిరిగానే టెలిగ్రామ్ కూడా షెడ్యూల్ కార్యాచరణను అందిస్తుంది. కావున టెలిగ్రామ్‌లో ఏదైనా ఒక మెసేజ్ ను షెడ్యూల్ చేయాలనుకుంటే కనుక క్రింది ఉన్న ఈ దశలను అనుసరించండి.

How to Send Schedule Messages on Telegram: Step by Step Guide

1.. మీ స్మార్ట్‌ఫోన్‌లో టెలిగ్రామ్ యాప్ ను ఓపెన్ చేయండి.

2... ఇప్పుడు మీరు మెసేజ్ ను షెడ్యూల్ చేయదలిచిన చాట్‌ను ఓపెన్ చేయండి.

3... ఈ తర్వాత మీరు షెడ్యూల్ చేయదలిచిన మెసేజ్ ను టైప్ చేయండి.

4... ఇప్పుడు పంపిన మెసేజ్ ను ఎక్కువసేపు నొక్కండి.

5... మెసేజ్ ను షెడ్యూల్ చేసే ఎంపికను మీరు ఇప్పుడు గమనించవచ్చు.

6... షెడ్యూల్ మెసేజ్ ఎంపికపై నొక్కండి. తరువాత షెడ్యూల్ చేయడానికి తేదీ మరియు సమయాన్ని ఎంచుకోమని యాప్ మిమ్మల్ని అడుగుతుంది.

7... దీని తరువాత మెసేజ్ షెడ్యూల్ చేయబడుతుంది. అలాగే ఇది మీరు షెడ్యూల్ చేసిన సమయానికి ఖచ్చితంగా వెళ్తుంది.

Best Mobiles in India

English summary
How to Send Schedule Messages on Telegram: Step by Step Guide

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X