WhatsAppలో 16 ఎంబి కంటే పెద్ద సైజు వీడియోలను షేర్ చేయటం ఎలా..?

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడుతోన్నఇన్‌స్టెంట్ మెసేజింగ్ సర్వీసుల్లో వాట్సాప్ ఒకటి. వందల కోట్ల యూజర్లతో అన్ని రకాల మొబైల్ ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తోన్న ఈ యాప్‌కు కొన్ని నిబంధనలంటూ ఉన్నాయి.

WhatsAppలో 16 ఎంబి కంటే పెద్ద సైజు వీడియోలను షేర్ చేయటం ఎలా..?

Read More : బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌ల పై Amazon ఆఫర్లు ఇవే!

యూజర్ ఫ్రెండ్లీ ఇన్‌స్టెంట్ మెసేజింగ్‌ను తమ యూజర్లకు చేరువ చేసే క్రమంలో ఎప్పటికప్పుడు తన యాప్‌లో కొత్త మార్పులను వాట్సాప్ తీసుకువస్తూనే ఉంది. రీఫ్రెష్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్, కాలింగ్ ఆప్షన్స్, అదనపు emojis, ఫాంట్ స్టైల్స్ ఇలా అనేక కొత్త అప్‌డేట్‌లను వాట్సాప్ లాంచ్ చేస్తూ వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

ఆండ్రాయిడ్ యూజర్లు ఏం చేయాలంటే..?

ముందుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీడియో కన్వర్టర్ యాప్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

 

#2

ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత యాప్ ఆటోమెటిక్‌గా ఓపెన్ అయి, మీ ఫోన్ మెమరీలోని అన్ని వీడియో ఫైల్స్ స్కాన్ చేసేస్తుంది. ఒకవేళ అలా జరగకపోతే మాన్యువల్ కూడా పైల్స్‌ను స్కాన్ చేసుకోవచ్చు.

#3

ఈ యాప్ ద్వారా వాట్సాప్‌లో మీరు షేర్ చేయదలచుకున్న వీడియోను సెలక్ట్ చేసుకుని యాప్‌లోని optimize options పై క్లిక్ చేసినట్లయితే అనేక ఆప్సన్స్ మీకు కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన వీడియో ఫార్మాట్‌ను ఎంపిక చేసుకుని మీ వీడియోను ఆప్టిమైజ్ చేసుకోండి.

#4

మీరు విండోస్ ఫోన్‌ను వాడుతున్నట్లయితే, విండోస్ స్టోర్ నుంచి Whatsapp Video Optimizer యాప్‌ను, మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి.

#5

ఇన్‌స్టాలేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత వాట్సాప్‌లో మీరు షేర్ చేయదలచుకున్న వీడియోను సెలక్ట్ చేసుకుని కంప్రెస్ చేసుకోవచ్చు. ఈ యాప్ ఒకేసారి మల్టిపుల్ వీడియోలను సైతం కంప్రెస్ చేయగలదు.

#6

యాపిల్ ఐఫోన్ యూజర్లు, ఐట్యూన్స్ ప్లే స్టోర్ నుంచి Whatsapp Video Optimizer యాప్‌ను పొందటం ద్వారా వీడియోలను కంప్రెస్ చేసుకోవచ్చు.

అదనపు టిప్స్..

సాధారణంగా వై-ఫై లేదా డేటా నెట్‌వర్క్ ఎర్రర్స్ కారణంగా వాట్సాప్ అకౌంట్ నిర్వహణలో సమస్యలు తలెత్తుంటాయి. మీ ఫోన్‌లోని వాట్సాప్ అకౌంట్ ద్వారా మెసెజ్‌లను సైతం సెండ్ చేయలేకపోతున్నట్లయితే ఇలా చేయండి.. - మీ ఫోన్‌లో లేటెస్ట్ వాట్సాప్ యాప్ ఇన్‌స్టాల్ చేసి చూడండి. - మీ ఇంటర్నెట్ కనెక్షన్ సరిగ్గా పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోండి. - యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి రీఇన్‌స్టాల్ చేసి చూడండి.

 

 

అదనపు టిప్స్..

వాట్సాప్ మీ అన్ని మెసేజ్‌లను మీఫోన్ ఎక్స్‌టర్నల్ మెమెరీ (ఎస్డీ కార్డ్‌లో) స్టోర్ చేస్తుంది. చాలా మందికి ఈ విషయం తెలియదు. డిలీట్ కాబడిన వాట్సాప్ మెసేజ్‌లను ఇక్కడ రికవర్ చేసుకోవచ్చు. ముందుగా మీ ఫోన్ ఎస్డీ కార్డ్‌లోకి వెళ్లండి. ఆ తరువాత WhatsApp > Databasesలోకి వెళ్లినట్లయితే రెండ ఫైళ్లు మీకు కనిపిస్తాయి. అవి msgstore-yyyy..dd..db.crypt, msgtore.db.crypt. వీటిలో మొదటి ఫైల్ మీరు పంపిన, మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్‌లకు సంబంధించి 7 రోజుల డేటాను మీ స్టోర్ చేస్తుంది. మరో ఫైల్ ప్రస్తుత రోజుకు సంబంధించిన డేటాను స్టోర్ చేస్తుంది. టెక్స్ట్ ఎడిటర్ ద్వారా ఈ ఫైళ్లలోని డేటాను రీడ్ చేయవచ్చు.

అదనపు టిప్స్..

వాట్సాప్ మీ ఫోన్ కాంటాక్ట్స్‌ను గుర్తించలేక పోవటానికి చాలా కారణలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ఖచ్చితమైన ఫోన్ నెంబర్ లను మీరు పొందుపరచకపోవటం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to send video more than 16MB on WhatsApp. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot