నంబర్ సేవ్ చేయకుండా వాట్సప్ మెసేజ్ పంపడం ఎలా ?
ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి వాటికి ఇప్పుడు చాలా డిమాండ్ ఏర్పడింది.
ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది చాలా పాపులర్ అయిపోయింది. ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్సప్ లాంటి వాటికి ఇప్పుడు చాలా డిమాండ్ ఏర్పడింది. చాటింగ్‌కు చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా వాట్సప్‌కే క్రేజ్ ఎక్కువగా ఉంది. ఎక్కువ. టెక్ట్స్ మెసేజ్‌లు, ఫొటోలను వాట్సప్ ద్వారా సులభంగా పంపుకునే అవకాశం ఉండటంతో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోంది. ఇందులో అనేక రకాల ఫీచర్లు ఉన్నప్పటికీ మనం పంపాలనుకున్న వ్యక్తి మొబైల్ నెంబర్ మన ఫోన్‌బుక్‌లో సేవ్ చేసి లేకపోతే వాట్సాప్‌లో మెసేజ్ పంపడం సాధ్యం కాదు. ఈ ఫీచర్ ఇప్పటిదాకా అందుబాటులో లేదు. అయితే ఇప్పుడు ఆ బెంగ కూడా తీరింది.

రెండు మెసేజ్‌ల కోసం..
అంతగా పరిచయం లేని వ్యక్తులకు ఒకటో రెండో, మెసేజ్‌లు పంపాల్సి రావచ్చు. తర్వాత మళ్లీ ఆ వ్యక్తులతో మనకు ఉండకపోవచ్చు. ఆ రెండు మెసేజ్‌ల కోసం ఆ వ్యక్తి మొబైల్ నెంబర్‌ను సేవ్ చేసుకోవడం చాలా సమస్యగా అనిపిస్తూ ఉంటుంది.

మనతో పరిచయం లేని వ్యక్తులు..
దీని వల్ల మనతో పరిచయం లేని వ్యక్తులు వాట్సప్‌లోని మన ప్రొఫైల్ ఫొటో చూసే అవకాశం ఉంది. ఇతర వివరాలను తెలుసుకోవచ్చు. అలాగని థర్ట్ పార్టీ యాప్‌లను ఉపయోగించడం సెక్యూరిటీ పరంగా మంచిది కాదు.

మొబైల్ ఫోన్ బుక్‌లో..
అయితే ఇప్పుడు మన మొబైల్ ఫోన్ బుక్‌లో నెంబర్‌ను సేవ్ చేయకుండానే వాట్సప్ ద్వారా మెసేజ్‌లను సులభంగా పంపేయచ్చు.

బ్రౌజర్‌ను..
దీనికోసం....మన ఫోన్‌లో వాడుతున్న బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. ఇందులో అడ్రస్ బార్‌లో...https://api.whats App.com/send?phone= number అని టైప్ చేయాలి.

నంబర్ అన్న దగ్గర..
నంబర్ అన్న దగ్గర మనము ఎవరికైతే మెసేజ్ పంపాలనుకుంటున్నామో వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి.

కంట్రీ కోడ్‌ను..
ఆ ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్‌ను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎంటర్ బటన్‌ను ప్రెస్ చేయాలి. వాట్సప్ విండో ఓపెన్ అవుతుంది.

సెండ్ మెసేజ్..
మీరు ఆ నెంబర్‌కు మెసేజ్ పంపాలనుకుంటున్నారా? అని వస్తుంది. ఆ తర్వాత మనము సెండ్ మెసేజ్ అని నొక్కాలి.

వాట్సప్ చాట్ విండో ఓపెన్..
వాట్సప్ చాట్ విండో ఓపెన్ అవుతుంది. తర్వాత మనము ఛాటింగ్ మొదలు పెట్టచ్చు.


Click it and Unblock the Notifications








