మీ పెన్‌డ్రైవ్‌కు పాస్‌వర్డ్ ప్రొటెక్షన్‌ కావాలా..?

పెన్‌డ్రైవ్‌లను ప్రొటెక్ట్ చేసేందకు విండోస్ అధికారికంగా అందిస్తోన్న మాన్యువల్ పద్ధతే BitLock Encryption. ఈ ప్రొటెక్షన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా పెన్‌డ్రైవ్‌ను యూఎస్బీకి కనెక్ట్ చేసే ప్రతిసారి బిట్‌లాక్ కోడ్‌ను ఎంటర్ చేసి డ్రైవ్‌లోని డేటాను యాక్సెస్ చేసుకోవల్సి ఉంటుంది. పెన్‌డ్రైవ్‌కు బిట్‌లాక్ ఎన్‌క్రిప్షన్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియను ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పెన్‌డ్రైవ్‌కు బిట్‌లాక్ ఎన్‌క్రిప్షన్‌ ఏర్పాటు చేసుకోండాలా..?

స్టెప్ 1

మీ పెన్‌డ్రైవ్‌‌ను ముందుగా కంప్యూటర్‌కు కనెక్ట్ చేయండి.

స్టెప్ 2

పెన్‌డ్రైవ్‌ కనెక్ట్ అయిన వెంటనే మైకంప్యూటర్స్‌లోకి వెళ్లి యూఎస్బీ డ్రైవ్ పై మౌస్‌తో రైట్ క్లిక్ ఇవ్వండి.

 

పెన్‌డ్రైవ్‌కు బిట్‌లాక్ ఎన్‌క్రిప్షన్‌ ఏర్పాటు చేసుకోండాలా..?

స్టెప్ 3

ఇప్పుడు కనిపించే ఆప్షన్స్ మెనూలో Turn on BitLockrను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 4

ఇప్పుడు BitLock Encryption డ్రైవ్‌కు సంబంధించిన ప్రత్యేకమైన మెనూ ఓపెన్ అవుతుంది. ఆ మెనూ బాక్సులో "use a password to unlock the drive" ఆప్షన్‌ను టిక్ చేయండి.

 

పెన్‌డ్రైవ్‌కు బిట్‌లాక్ ఎన్‌క్రిప్షన్‌ ఏర్పాటు చేసుకోండాలా..?

స్టెప్ 5

ఆ మెనూలో కనిపించే ఖాళీల్లో మీకు నచ్చిన పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసి next బటన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 6

తరువాత కనిపించే మెనూలో save the recovery key to file అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ పాస్‍వర్డ్‌ను కంప్యూటర్‌లో ఎక్కడైనా సేవ్ చేసుకొని మరచి పోయినపుడు పొందవచ్చు.

 

పెన్‌డ్రైవ్‌కు బిట్‌లాక్ ఎన్‌క్రిప్షన్‌ ఏర్పాటు చేసుకోండాలా..?

స్టెప్ 7

next బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ పెన్‌డ్రైవ్‌లోని పైల్స్ అన్నీ encrypt చేయబడుతాయి.

స్టెప్ 8

ఎన్‌క్రిప్సన్ పూర్తయ్యాక close బటన్ పై క్లిక్ చేయండి. పెన్‍డ్రైవ్‌ను తీసి మరలా పీసీకి కనెక్ట్ చెయ్యండి. ఇక పై మీరు, మీ పెన్‌డ్రైవ్‌ను ఎప్పుడు ఏ పీసీకి కనెక్టు చేసినా Password ఎంటర్ చేస్తేనే డ్రైవ్ ఓపెన్ అవుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to set a password on Pen drive without any App. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot