ఇన్‌స్టాగ్రామ్‌లో రోజువారీ టైమ్ పరిమితిని సెట్ చేయడం ఎలా?

|

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఇన్‌స్టాగ్రామ్‌ ఒకటి. ప్రతి ఒక్కరికి అత్యంత వ్యసనపరమైన యాప్‌లలో ఇది కూడా ఒకటి. గత ఏడాది డిసెంబర్‌లో ఇది 2 బిలియన్ నెలవారీ క్రియాశీల వినియోగదారుల పరిమితిని కూడా అధిగమించింది. ఈ యాప్‌ని ఉపయోగించడం ప్రజలు ఎంతగా ఆనందిస్తున్నారనేదానికి ఇదే నిదర్శనం. ఇన్‌స్టాగ్రామ్ వృద్ధి చెందుతూన్న సమయంలోనే ఫేస్‌బుక్ తన యొక్క వినియోగదారులను కోల్పోతుందనే వాస్తవం ప్లాట్‌ఫారమ్ ఇంకా బలంగా ఉందని చూపిస్తుంది. మీరు ఈ యాప్‌ని ఒక సారి ఓపెన్ చేసిన తర్వాత ఈ ప్లాట్‌ఫారమ్ నుండి బయటకు రావడం అనేది కొద్దిగా కష్టం అని చెప్పవచ్చు. అయితే ఈ కష్టమైన పనిని సులభం చేయడానికి మీరు యాప్‌లో గడిపే సమయ పరిమితిని సెట్ చేయడానికి ఒక మార్గం ఉంది.

 
ఇన్‌స్టాగ్రామ్‌లో రోజువారీ టైమ్ పరిమితిని సెట్ చేయడం ఎలా?

మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ 2018లో దాని ప్లాట్‌ఫారమ్‌లో కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా వినియోగదారులు యాప్‌లో రోజువారీగా ఎంత సమయం గడపాలో నిర్ణయించడానికి సమయ పరిమితిని సెట్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ దాని రోజువారీ శ్రేయస్సు సాధనాల్లో భాగంగా పరిచయం చేయబడింది. వినియోగదారులు 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు, ఒక గంట, రెండు గంటలు మరియు ఆఫ్ డే వంటి ఆరు ఎంపికలలో సమయాన్ని సెట్ చేయడాన్ని ఎంచుకోవచ్చు. దీనితో పాటు వినియోగదారులు యాప్‌ను ఉపయోగిస్తున్నప్పుడు విరామం తీసుకోవడానికి రిమైండర్‌లను కూడా సెట్ చేయవచ్చు. వినియోగదారులు తమ యాప్ యొక్క నిరంతర వినియోగానికి విరామం ఇవ్వడానికి 30 నిమిషాలు, 20 నిమిషాలు లేదా 10 నిమిషాలను ఎంపికలుగా సెట్ చేయవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో రోజువారీ సమయ పరిమితిని ఎలా సెట్ చేయవచ్చో తెలుసుకోవడానికి కింద ఉన్న దశల వారీ గైడ్ ను అనుసరించండి.

ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లలో రోజువారీ సమయ పరిమితిని సెట్ చేసే విధానం

ఇన్‌స్టాగ్రామ్‌లో రోజువారీ టైమ్ పరిమితిని సెట్ చేయడం ఎలా?

స్టెప్ 1: ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఓపెన్ చేసి డిస్‌ప్లే యొక్క కుడివైపు దిగువ మూలన ఉన్న మీ ప్రొఫైల్ ఫోటో మీద నొక్కండి.

స్టెప్ 2: తర్వాత హాంబర్గర్ మెను ఎంపిక మీద నొక్కండి.

స్టెప్ 3: మీ యాక్టివిటీని ట్యాప్ చేసి ఆపై టైమ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

స్టెప్ 4: కింది స్క్రీన్‌లో రోజువారీ సమయ పరిమితిని సెట్ చేయి ఎంపికను ఎంచుకోండి.

స్టెప్ 5: ఇప్పుడు మీరు యాప్ నుండి బయటకు రావాలనుకుంటున్న సమయ పరిమితిని ఎంచుకోండి.

స్టెప్ 6: పూర్తయిన తరువాత 'డన్' ఎంపిక మీద నొక్కండి మరియు మీరు అంతా సిద్ధంగా ఉన్నారు.

Instagram యాప్‌లలో విరామ సమయాన్ని సెట్ చేసే విధానం

ఇన్‌స్టాగ్రామ్‌లో రోజువారీ టైమ్ పరిమితిని సెట్ చేయడం ఎలా?

స్టెప్ 1: డిస్‌ప్లే యొక్క కుడివైపు దిగువ మూలలో ఉన్న మీ ప్రొఫైల్ ఫోటో మీద నొక్కండి.

స్టెప్ 2: హాంబర్గర్ మెనుని ఎంచుకోండి.

స్టెప్ 3: తర్వాత మీ యాక్టివిటీని ట్యాప్ చేసి ఆపై టైమ్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

స్టెప్ 4: కింది స్క్రీన్‌లో బ్రేక్‌ తీసుకోవడానికి సెట్ రిమైండర్‌ ఎంపికలను ఎంచుకోండి.

స్టెప్ 5: ఇప్పుడు మీరు యాప్ నుండి విడిపోవాలనుకుంటున్న సమయాన్ని ఎంచుకోండి.

స్టెప్ 6: తరువాత 'డన్' ఎంపిక మీద నొక్కండి.

Best Mobiles in India

English summary
How To Set Daily Time Limit On Instagram?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X