మీ స్మా‌ర్ట్‌ఫోన్‌లో parental controlsను సెట్ చేసుకోవటం ఎలా..?

|

ప్రజల రోజువారీ జీవితాల్లో నిత్యావసర సాధనంగా అవతరించిన స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ రూపురేఖలనే మార్చేసింది. ఈ స్మార్ట్ కమ్యూనికేషన్ డివైస్‌ను చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ సునాయశంగా హ్యాండిల్ చేయగలుగుతున్నారు. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్లు స్మార్ట్‌ఫోన్‌తో ఎన్నైతే ప్రయోజనాలు ఉన్నాయో, అదే స్థాయిలో దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి, పిల్లల చేతికి ఫోన్ విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్‌లను ఇచ్చేముందు "Parental Control" ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవటం ద్వారా కంటెంట్ యాక్సెస్ విషయంలో ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. దీంతో వారు చెడు ఇంటర్నెట్ కంటెంట్‌కు పూర్తిగా దూరంగా ఉండగలుగుతారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో పేరెంటెల్ కంట్రోల్ ఫీచర్‌లను ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?షియోమి యూజర్లకు లక్ష రూపాయల ఉచిత లోన్,ఎలా పొందాలో తెలుసుకోండి ?

ప్రత్యేకమైన యూజర్ అకౌంట్‌లను క్రియేట్ చేయవల్సి ఉంటుంది..

ప్రత్యేకమైన యూజర్ అకౌంట్‌లను క్రియేట్ చేయవల్సి ఉంటుంది..

స్మార్ట్‌ఫోన్‌లలో పేరెంటల్ కంట్రోల్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసే ముందు మీ పిల్లల పేర్లు మీద ప్రత్యేకమైన యూజర్ అకౌంట్‌లను క్రియేట్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేసేందుకు ముందుగా ఫోన్ సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లి "User and Accounts" ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అది ఓపెన్ అయిన తరువాత User ఆప్షన్ పై క్లిక్ చేసి "Add User" పై టాప్ ఇవ్వాలి. ఇప్పుడు "Set Up Now" ఆప్షన్‌ను సెలక్ట్ చేసకుని కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేయవల్సి ఉంటుంది.

పాస్‌వర్డ్ లేదా ప్యాట్రన్‌ను సెట్ చేసుకోవల్సి ఉంటుంది

పాస్‌వర్డ్ లేదా ప్యాట్రన్‌ను సెట్ చేసుకోవల్సి ఉంటుంది

అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మిమ్మల్ని మీరు ధృవీకరించుకునేందుకు పాస్‌వర్డ్ లేదా ప్యాట్రన్‌ను సెట్ చేసుకోవల్సి ఉంది. ఆ తరువాత ఆన్-స్ర్కీన్ ప్రాంప్ట్‌లను ఫాలో అవుతూ మీ పిల్లల పేర్ల మీద గూగుల్ అకౌంట్‌లను క్రియేట్ చేయవల్సి ఉంటుంది. అకౌంట్స్ క్రియేట్ అయిన తరువాత "More Options" పై టాప్ చేసి ఇతర వివరాలను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ క్రమంలో వారికి ఏ విధమైన కంటెంట్‌ను అందుబాటులో ఉండాలో, అందుబాటులో ఉంచకూడదో అన్న దానిని మీరు డిసైడ్ చేసుకునే వీలుంటుంది.

కంటెంట్‌ను ఫిల్టర్ చేయాలంటే..
 

కంటెంట్‌ను ఫిల్టర్ చేయాలంటే..

ముందుగా యాక్సిస్‌ను రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటోన్న యూజర్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ అయిన తరువాత ప్లే స్టోర్‌లోకి వెళ్లి సెట్టింగ్స్ పై టాప్ చేసి పెరెంటెల్ కంట్రోల్ స్విచ్‌ను టర్నాఫ్ చేసుకుని కొత్త పిన్‌ను సెటప్ చేసుకోవటం ద్వారా కంటెంట్‌ను కావల్సిన విధంగా ఫిల్టర్ చేసుకునే వీలుంటుంది.

 కొనుగోళ్లను నివారించాలంటే..?

కొనుగోళ్లను నివారించాలంటే..?

ముందుగా యాక్సిస్‌ను రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటోన్న యూజర్ అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవాలి. అకౌంట్ ఓపెన్ అయిన తరువాత ప్లే స్టోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి "Require authentication for purchases" అనే ఆప్షన్‌ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ అయ్యే మెనూలో "For all Purchases" అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీరు చేసే అన్ని కొనుగోళ్లకు అథంటికేషన్ అనేది అవసరమవుతుంది. అథెంటికేషన్‌ను ఎనేబుల్ చేసుకోవటం వల్ల కొనుగోలు చేసే ప్రతి సందర్భంలోనూ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది.

అనధికారిక యాప్‌లను డిసేబుల్ చేయాలంటే...

అనధికారిక యాప్‌లను డిసేబుల్ చేయాలంటే...

మీ పిల్లలు అనధికారిక యాప్‌ల జోలికి వెళ్లకుండా ఉండాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లోని సెక్యూరిటీ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని "Unknown Sources" ఆప్షన్‌ను ఛేంజ్ చేయటం ద్వారా థర్డ్ పార్టీ యాప్స్‌ను పూర్తిగా డిసేబుల్ చేసుకునే వీలుంటుంది.

 

 

Best Mobiles in India

English summary
Smartphones have redefined the way we lead our daily lives. Such has been the impact of smartphones that they have become an integral part of our daily lives, and we depend on them for many of our daily tasks

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X