Windows 11 ఇన్‌స్టాలేషన్ కోసం PC ని సిద్ధంగా సెటప్ చేయడం ఎలా?

|

మైక్రోసాఫ్ట్ సంస్థ తన నెక్స్ట్-జెన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS) విండోస్ 11 ను నేడు అంటే అక్టోబర్ 5 న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ కంపెనీ కొన్ని నెలల ముందు నుండి OS యొక్క బీటా వెర్షన్‌ని పరీక్షిస్తోంది. దీని యొక్క ఫైనల్ బిల్డ్ ఇప్పటికే Windows Insider వినియోగదారులకి అందుబాటులో ఉంది. ఈ కొత్త OS రిఫ్రెష్ లుక్, సహజమైన నావిగేషన్ వంటి మరిన్నిటిని అందిస్తుంది. ఇది టచ్‌స్క్రీన్ మరియు నాన్-టచ్‌స్క్రీన్ పరికరాలపై సమర్థవంతంగా పనిచేసేలా రూపొందించబడింది. కొత్త OS విడుదలైన మొదటి రోజునే ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌ను పొందాలని ఉత్సాహంగా ఉంటే కనుక మీ PC ని అప్‌గ్రేడ్ చేయడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Windows 11 అప్‌గ్రేడ్ కోసం మీ PC ని సిద్ధంగా ఉంచడానికి మార్గాలు

Windows 11 అప్‌గ్రేడ్ కోసం మీ PC ని సిద్ధంగా ఉంచడానికి మార్గాలు

మీరు మీ PC లో Windows 11 ని ఇన్‌స్టాల్ చేయడానికి ముందుగా మీ PC ఇన్‌స్టాలేషన్ కోసం సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవడం ఉత్తమం. మీరు ఎలాంటి బగ్‌లు ఎదుర్కోకుండా డేటాను కోల్పోకుండా ఉంటారు. ఇన్‌స్టాలేషన్ దశలను కొనసాగించడానికి ముందు విండోస్ 11 ని ఇన్‌స్టాల్ చేయడానికి కనీస అవసరాలు మీ యొక్క పరికరంలో ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి.

Airtel Vs Vi: 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు??Airtel Vs Vi: 1.5GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లలో బెస్ట్ ఎవరు??

విండోస్ 11 ఇన్‌స్టాలేషన్ కనీస అవసరాలు

విండోస్ 11 ఇన్‌స్టాలేషన్ కనీస అవసరాలు

** అనుకూలమైన 64-బిట్ ప్రాసెసర్‌పై 1 గిగాహెర్ట్జ్ (GHz) లేదా 2 లేదా అంతకంటే ఎక్కువ కోర్లతో వేగంగా

** 4GB RAM

** 64GB ఇంటర్నల్ స్టోరేజ్

** UEFI సెక్యూర్ బూట్

** TPM వెర్షన్ 2.0

** డైరెక్ట్‌ఎక్స్ 12 లేదా WDDM 2.0 డ్రైవర్‌కు అనుకూలంగా ఉండే గ్రాఫిక్స్ కార్డ్

** 9 "కంటే ఎక్కువ హై డెఫినిషన్ (720p) డిస్‌ప్లే, 8 బిట్‌ కలర్ ఛానెల్‌లు.

 

మీ PC ని బ్యాకప్ చేయడం
 

మీ PC ని బ్యాకప్ చేయడం

విండోస్ యొక్క తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయడానికి మీరు మీ PC ని సెట్ చేయడానికి ముందు మీ యొక్క మొత్తం డేటా సురక్షితంగా ఉంచడానికి మీరు ముందుగా మీ PC ని బ్యాకప్ చేయవలసి ఉంటుంది. మీరు ఏదైనా పాడైన ఫైళ్లు, క్రాష్ అవుతున్న అప్లికేషన్‌లు మరియు మరిన్ని ఎదుర్కొంటే ఈ బ్యాకప్ ఉపయోగపడుతుంది. ఈ విషయాలు గందరగోళంగా మారితే కనుక మీ PC యొక్క చివరి స్థిరమైన సంస్కరణకు తిరిగి వెళ్లడానికి మీకు ఎల్లప్పుడూ బ్యాకప్ ఉంటుంది.

Windows 10 ఇన్‌స్టాలేషన్ కోసం రికవరీ డ్రైవ్‌ను సెటప్ చేయడం

Windows 10 ఇన్‌స్టాలేషన్ కోసం రికవరీ డ్రైవ్‌ను సెటప్ చేయడం

రికవరీ డ్రైవ్‌ను సృష్టించడం అనేది ఒక నిఫ్టీ ఫీచర్. ఎందుకంటే మీరు ఇన్‌స్టాలేషన్ సమయంలో ఏవైనా సమస్యలు ఉంటే సిస్టమ్ రికవరీ టూల్స్‌ని యాక్సెస్ చేయడానికి ఉపయోగించవచ్చు. దానితో మీరు Windows 10 లేదా Windows యొక్క పాత వెర్షన్‌ను కూడా మళ్లీ ఇన్‌స్టాల్ చేయవచ్చు. ఇది ఏవైనా పాడైన లేదా తప్పిపోయిన ఫైల్‌లను తిరిగి పొందడంలో మీకు సహాయపడదు. కానీ కనీసం మీ సిస్టమ్‌ను స్థిరమైన పని స్థితికి తీసుకురావడానికి మీకు సహాయపడుతుంది. మీ PC విండోస్ యొక్క తాజా వెర్షన్‌తో అనుకూలంగా ఉందని ఇప్పుడు మీకు తెలుసు. మీ వద్ద బ్యాకప్ మరియు రికవరీ డ్రైవ్ అందుబాటులో ఉన్నాయి మరియు వాటిని మీరు తిరిగి తీసుకోవచ్చు అని అనుకున్న తరువాత Windows 11 ని మీ PC లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

విండోస్ 10 నుండి విండోస్ 11 కి అప్‌గ్రేడ్ చేసే విధానం

విండోస్ 10 నుండి విండోస్ 11 కి అప్‌గ్రేడ్ చేసే విధానం

- మైక్రోసాఫ్ట్ PC హెల్త్ తనిఖీ యాప్ ద్వారా మీ PC అధికారికంగా మద్దతు ఇస్తుందో లేదో ముందుగా తనిఖీ చేయండి.

-మీరు ఇన్‌స్టాలేషన్‌ను ప్రారంభించడానికి ముందు మీ అన్ని డాక్యుమెంట్‌లు మరియు డేటాను సిస్టమ్ నుండి బ్యాకప్ చేసుకోవాలి.

- ఇది పూర్తయిన తర్వాత మీ Windows 10 PC లో సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి. ఇందులో అప్‌డేట్ & సెక్యూరిటీ> విండోస్ అప్‌డేట్‌ విభాగానికి వెళ్లండి.

- కొత్త విండోస్ అప్‌డేట్‌ల కోసం చూడండి.

-మీరు ఉచిత విండోస్ 11 అప్‌గ్రేడ్‌ను కనుగొంటే కనుక డౌన్‌లోడ్ మరియు ఇన్‌స్టాల్ ఎంపికపై నొక్కండి.

-ఆన్‌-స్క్రీన్ అప్‌గ్రేడ్ ప్రాంప్ట్‌లను అనుసరించండి మరియు 'విండోస్ 11 సెట్టింగ్‌లను కాన్ఫిగర్ చేయండి'

 

Most Read Articles
Best Mobiles in India

English summary
How to Set Up Your PC Ready For Windows 11 Installation?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X