ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ ఫోన్‌లో వేక్-అప్ కాల్‌ను సెట్ చేయడం ఎలానో తెలుసుకోండి...

|

ప్రయాణం అనేది మానవుని రోజువారీ జీవితంలో ఒక భాగమయింది. మనుషులు ప్రతి రోజు ఎక్కడికో ఒకచోటుకి ప్రయాణం చేస్తూనే ఉంటారు. అయితే మీ యొక్క అవసరాల దృష్ట్యా అధిక దూరం ప్రయాణించాలనుకుంటే కనుక అది కూడా తక్కువ బడ్జెట్ లో ప్రతి ఒక్కరు కూడా భారతీయ రైల్వే ప్రయాణాన్ని ఎంచుకుంటారు. మీరు రైలులో ప్రయాణం చేయడానికి ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు, నేరుగా రైల్వే యొక్క ఆహారాన్ని ఆర్డర్ చేయడంతో పాటుగా అనేక ఇతర పనులు చేయవచ్చు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే భారతీయ రైల్వే సంస్థ తన ప్రయాణీకులకు ఉపయోగకరమైన మరొక ఫీచర్‌ను కూడా ఇప్పుడు విడుదల చేసింది. మీరు అధిక దూరం ప్రయాణం చేస్తున్నప్పుడు గమ్యస్థానం చేరుకున్నప్పుడు ఈ ఫీచర్ మిమ్మల్ని మేల్కొల్పుతుంది. ఒంటరిగా ప్రయాణించే వినియోగదారులకు ఇది చాలా వరకు సహాయకరిగా ఉంటుంది. మీరు మీ యొక్క ఫోన్ లో రైల్వే యొక్క గమ్యస్థాన హెచ్చరికను ఎలా సెట్ చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Setup Destination Alert or Wake Up Call Alert

రైల్వే వేక్-అప్ కాల్ అలెర్ట్ ను సెట్ చేసే విధానం

రైలు ప్రయాణంలో గమ్యస్థాన హెచ్చరికను సెట్ చేయడానికి మీకు ఎటువంటి ఇంటర్నెట్ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించని వారు మరియు వృద్ధులు రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో వారు ఇంటర్నెట్‌ను ఉపయోగించనందున వారికి ఇది చాలా మంచి ఎంపికగా ఉంటుంది. ఈ వేక్-అప్ కాల్‌ని సెటప్ చేయడానికి మీకు కావలసిందల్లా నెట్‌వర్క్ కనెక్టివిటీతో కూడిన ఫోన్ మాత్రమే.

How to Setup Destination Alert or Wake Up Call Alert

1. మీ యొక్క ఫోన్‌లో డయలర్‌ని ఓపెన్ చేయండి.

2. 139కి డయల్ చేసి కస్టమర్ కేర్ అసిస్టెంట్ మాట్లాడే వరకు వేచి ఉండండి.

3. తరువాత ఒక నిర్దిష్ట నంబర్ పై క్లిక్ చేయడం ద్వారా మీకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు హిందీకి 1 మరియు ఇంగ్లీష్ కోసం 2 నొక్కవలసి ఉంటుంది.

4. తరువాత ఇంగ్లీష్ ఎంపిక కోసం 2 నొక్కండి.

5. వేక్-అప్ కాల్ అలెర్ట్ ను సెటప్ చేయడానికి 7ని నొక్కండి.

6. ఇప్పుడు మీరు వేక్-అప్ కాల్‌ని సెట్ చేయాలనుకుంటున్నారా (2ని నొక్కండి) ఎంచుకోవచ్చు. (గమ్యస్థాన హెచ్చరిక మీకు మెసేజ్ ని పంపుతుంది. అయితే వేక్-అప్ కాల్ మీ గమ్యస్థానం యొక్క రాక గురించి మీకు కాల్ రూపంలో తెలియజేస్తుంది).

7. మీరు సంబంధిత నంబర్‌లను నొక్కడం ద్వారా ఏదైనా ఎంపికలను సెట్ చేసిన తర్వాత మీరు మీ 10-అంకెల PNR నంబర్‌ను నమోదు చేసి నిర్ధారణ కోసం 1ని నొక్కాలి.

How to Setup Destination Alert or Wake Up Call Alert

భారతీయ రైల్వేలలో మీ ప్రయాణంలో వేక్-అప్ కాల్ అలర్ట్‌ను ఇంత సులభంగా సెట్ చేయవచ్చు. ఇదే కాకుండా 139 హెల్ప్‌లైన్ నంబర్‌త మీరు చాలా పనులు పూర్తి చేస్తారు. ఉదాహరణకు మీరు సెక్యూరిటీ & మెడికల్ సహాయాన్ని కూడా పొందవచ్చు. వీటితో పాటుగా సాధారణ లేదా లంచం యొక్క ఫిర్యాదులను కూడా నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా నేరుగా కస్టమర్ ప్రతినిధితో మాట్లాడవచ్చు లేదా మీ టిక్కెట్ గురించి విచారించవచ్చు. మీరు మీ టికెట్/సీటు స్టేటస్ ని కూడా రద్దు చేయవచ్చు లేదా తనిఖీ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
How to Setup Destination Alert or Wake Up Call Alert

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X