Google Chromeని డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్‌గా సృష్టించడం ఎలా?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్‌లలో గూగుల్ క్రోమ్ కూడా ఒకటి. మీరు చేసే రోజువారీ పనులను మరింత సులభంగా నిర్వహించడానికి గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్‌లో ప్రస్తుతం అనేక పొడిగింపులను కలిగి ఉంది. Safari, Firefox వంటి వెబ్ బ్రౌజర్‌లతో పోటీపడే క్రోమ్ బ్రౌజర్‌ని మీరు డిఫాల్ట్ బ్రౌజర్‌గా చేస్తే కనుక మీరు తరచుగా క్లిక్ చేసే ప్రతి లింక్ కూడా కేవలం ఆ వెబ్ బ్రౌజర్‌లో మాత్రమే ఓపెన్ చేయబడుతుంది. విండోస్ 10, విండోస్ 11 మరియు Macలో రన్ అయ్యే మీ యొక్క కంప్యూటర్ మరియు లాప్ టాప్ లలో మీరు గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్‌గా సులభంగా మార్చుకోవచ్చు. అది ఎలా చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Windows 11 లో గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ బ్రౌజర్‌గా మార్చే విధానం
** ఎడమవైపు దిగువ మూలలో గల 'స్టార్ట్' మెను ఎంపిక మీద వెళ్ళండి.
** సెట్టింగ్‌లు>యాప్‌లు>డిఫాల్ట్ యాప్‌లు ఎంపికలను అనుసరించండి.
** తరువాత "Google Chrome" విభాగాన్ని ఎంచుకోండి. లేదా మీకు ఇది కనిపించకుంటే కనుక దాని కోసం సెర్చ్ చేయండి.
** "గూగుల్ క్రోమ్ ని మీ డిఫాల్ట్ బ్రౌజర్‌గా మార్చుకోండి" ఎంపిక ముందు ఉన్న సెట్ డిఫాల్ట్ ఎంపికపై క్లిక్ చేయండి.
** ఫైల్ రకాలను సమీక్షించి "సెట్ డిఫాల్ట్" బటన్‌పై క్లిక్ చేయండి.

Windows 10 లో గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ బ్రౌజర్‌గా మార్చే విధానం
** 'స్టార్ట్' మెనుని ఓపెన్ చేసి తరువాత 'సెట్టింగ్స్' విభాగానికి వెళ్లండి.
** డిఫాల్ట్ యాప్ విభాగాలను ఓపెన్ చేయండి.
** దిగువ భాగంలో "వెబ్ బ్రౌజర్" వర్గం క్రింద (మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌గా గుర్తించబడింది).
** "యాప్‌ని ఎంచుకోండి" విండో క్రింద ఉన్న "గూగుల్ క్రోమ్"పై క్లిక్ చేయండి.

Macలో గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ బ్రౌజర్‌గా మార్చే విధానం
** Google Chromeని ఓపెన్ చేయండి.
** కుడివైపు ఎగువ మూలలో "మోర్" ఎంపిక మీద క్లిక్ చేయండి.
** తరువాత "సెట్టింగ్స్" ఎంపికపై నొక్కండి.
** "డిఫాల్ట్ బ్రౌజర్" విభాగానికి వెళ్లి 'మేక్ డిఫాల్ట్' ఎంపికపై క్లిక్ చేయండి.
** ఒకవేళ మీకు ఈ బటన్ కనిపించకపోతే కనుక క్రోమ్ ఇప్పటికే మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్ అని అర్థం.

ఆండ్రాయిడ్ డివైస్ లో గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ బ్రౌజర్‌గా మార్చే విధానం
** ఆండ్రాయిడ్ ఫోన్‌లో సెట్టింగ్‌ల విభాగంకు వెళ్లండి.
** యాప్స్ & నోటిఫికేషన్స్ ఎంపిక మీద నొక్కండి.
** తరువాత "అడ్వాన్స్డ్" ఎంపిక మీద నొక్కండి.
** "డిఫాల్ట్ యాప్స్" ఎంపికను ఎంచుకోండి.
** "బ్రౌజర్ యాప్స్> క్రోమ్ ఎంపిక మీద టాప్ చేయండి.

iPhone, iPad లో గూగుల్ క్రోమ్ ని డిఫాల్ట్ బ్రౌజర్‌గా మార్చే విధానం
** ఐఫోన్ లేదా ఐప్యాడ్ లో ముందుగా క్రోమ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
** మోర్ >సెట్టింగ్స్ ఎంపికల మీద నొక్కండి.
** డిఫాల్ట్ బ్రౌజర్ ఎంపిక మీద నొక్కండి.
** ఓపెన్ క్రోమ్ సెట్టింగ్‌స్ > డిఫాల్ట్ బ్రౌజర్ యాప్ ఎంపికలను అనుసరించండి.
** తరువాత క్రోమ్ ని మీ డిఫాల్ట్ బ్రౌజర్ యాప్‌గా సెట్ చేయండి.


Click it and Unblock the Notifications








