టెలిగ్రామ్‌లో అదనపు రెండవ పాస్‌వర్డ్‌ను ప్రారంభించడం ఎలా??

|

ప్రస్తుత సమయంలో సోషల్ మీడియా యాప్ లను వినియోగించడం ఎక్కువగా ఉంది. వాట్సాప్ యొక్క కొత్త గోప్యతా విధానంతో అసంతృప్తిగా ఉన్న యూజర్లు ఇప్పుడు ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లకు మారుతున్నారు. దీని కారణంగా సిగ్నల్ మరియు టెలిగ్రామ్ వంటి రెండు యాప్ల యొక్క డౌన్‌లోడ్‌ల సంఖ్యలు విపరీతంగా పెరిగాయి. ఆన్‌లైన్ నివేదికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా అధికంగా డౌన్‌లోడ్‌లు జరిగిన సోషల్ మీడియా యాప్ లలో సిగ్నల్ మొదటి స్థానంలో ఉంటే టెలిగ్రామ్ రెండవ స్థానంలో ఉంది.

How to Setup Two-Step Verification on Telegram

వాట్సాప్ యొక్క ప్రైవసీ విధానంతో విసిగిపోయి ఉంటే మరియు తక్షణమే మీరు మరొక క్లౌడ్-బేస్డ్ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌కు మారాలని యోచిస్తున్నట్లయితే మీరు రెండు-దశల ధృవీకరణ ప్రక్రియకు అనుమతిని ఇస్తుంది. ఇది మెసేజ్ యాప్ ను మరింత సురక్షితంగా చేస్తుంది. ఈ సెటప్ చాలా సులభం మరియు త్వరగా కూడా చేయవచ్చు.

టెలిగ్రామ్‌లో అదనపు రెండవ పాస్‌వర్డ్‌ను ప్రారంభించడం ఎలా??

How to Setup Two-Step Verification on Telegram

*** మీ స్మార్ట్‌ఫోన్‌లో టెలిగ్రామ్ యాప్ ను ఓపెన్ చేయండి.

*** తరువాత ఎడమవైపుకు స్వైప్ చేయడం ద్వారా లేదా హాంబర్గర్ మెను చిహ్నంపై నొక్కడం ద్వారా మెనుని ఓపెన్ చేయండి.

*** తరువాత సెట్టింగుల ఎంపికను ఎంచుకోండి.

*** ఈ సెట్టింగుల మెనులోని గోప్యత మరియు భద్రత ఎంపికను ఎంచుకోండి.

*** తరువాత రెండు-దశల ధృవీకరణ ఎంపిక మీద నొక్కండి.

*** ఇప్పుడు ఈ టెలిగ్రామ్‌ యాప్ అదనపు పాస్‌వర్డ్‌ను సెటప్ చేయమని అడుగుతుంది.

*** కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తరువాత మీరు పాస్‌వర్డ్‌ యొక్క సూచన మరియు రికవరీ ఇమెయిల్ను జోడించాలి.

*** ఇప్పుడు మీరు రెండు-దశల ధృవీకరణను పూర్తి చేయడానికి టెలిగ్రామ్ పంపిన కోడ్‌ను నమోదు చేయాలి.

ఈ విధంగా మీరు టెలిగ్రామ్‌లో రెండు-దశల ధృవీకరణను ప్రారంభించవచ్చు. మీరు కొత్తగా సెట్ చేసిన పాస్‌వర్డ్ మీరు SMS లో పొందే కోడ్‌తో పాటు కొత్త పరికరంలో లాగిన్ అయినప్పుడు అవసరం అవుతుంది.

Best Mobiles in India

English summary
How to Setup Two-Step Verification on Telegram

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X