మొబైల్ నెంబర్ లేకుండా Whatsapp వాడొచ్చు, ఎలా అంటే..?

క్రియేటివ్‍గా ఆలోచిస్తే మొబైల్ నెంబర్‌తో పనిలేకుండానే వాట్సాప్ అకౌంట్‌ను సెటప్ చేసుకోవచ్చు.

|

స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తోన్న దాదాపు ప్రతి ఒక్కరూ వాట్సాప్ అకౌంట్‌లను కలిగి ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ ఇన్‌స్టెంట్ మెసేజింగ్ యాప్ ద్వారా చాటింగ్ ఇంకా ఫైల్ షేరింగ్ మాత్రమే సాధ్యమయ్యేది. ఇప్పుడు వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కూడా సాధ్యమవుతున్నాయి. కొంచం క్రియేటివ్‍గా ఆలోచిస్తే మొబైల్ నెంబర్‌తో పనిలేకుండానే వాట్సాప్ అకౌంట్‌ను సెటప్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

స్టెప్ 1

స్టెప్ 1

ముందుగా వాట్సాప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని మీ స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్‌లో ఇన్స్‌టాల్ చేసుకోండి.

స్టెప్ 2

స్టెప్ 2

యాప్ విజయవంతంగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన వెంటనే ఓపెన్ చేసి సెటప్ ప్రాసెస్‌ను మొదలుపెట్టండి. అకౌంట్ సెటప్ ప్రాసెస్‌లో భాగంగా మొబైల్ వెరిఫికేషన్‌ను మీరు పూర్తి చేయవల్సి ఉంటుంది.  

స్టెప్ 3

స్టెప్ 3

తదుపరి చర్యలో భాగంగా  గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి TextNow యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

స్టెప్ 4
 

స్టెప్ 4

TextNow యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిన తరువాత, యాప్ మీకో ప్రత్యేకమైన నెంబర్‌ను కేటాయిస్తుంది. ఆ నెంబర్ ను ఓ పేపర్ పై రాసుకోండి.

స్టెప్ 5

స్టెప్ 5

ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌ను వెరిఫికేషన్ బాక్సులో ఎంటర్ చేయండి.

స్టెప్ 6

స్టెప్ 6

వెరిఫికేషన్ బై ఎస్ఎంఎస్ ఆప్షన్ కోసం 2 నిమిషాల పాట ఎదురు చూడండి. ఎస్ఎంఎస్ రానట్లయితే వెరిఫికేషన్ బై కాల్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 7

స్టెప్ 7

ఇప్పుడు మరోసారి TextNow యాప్‌లోకి వెళ్లండి. వాట్సాప్ వెరిఫికేషన్ కాల్ మీకు అందుతుంది. ఆ కాల్‌లో చెప్పే వెరిఫికేషన్ నెంబర్‌ను నోట్ చేసుకోండి.

స్టెప్ 8

స్టెప్ 8

ఇప్పుడు వాట్సాప్ అకౌంట్‌ను ఓపెన్ చేసి సంబంధిత కాలమ్‌లో వెరిఫికేషన్ నెంబర్‌ను ఎంటర్ చేసినట్లయితే, మీ వాట్సాప్ అకౌంట్  సెటప్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి అవుతుంది. 

వాట్సప్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా...

వాట్సప్ బిజినెస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా...

ఇన్‌స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ చిన్న వ్యాపార సంస్థల సౌకర్యం కోసం వాట్సప్‌ బిజినెస్‌' పేరుతో ఉచిత ఆండ్రాయిడ్‌ యాప్‌ విడుదల చేసింది. కంపెనీలు తమ కస్టమర్లతో కనెక్ట్‌ అయ్యేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుందని సంస్థ తెలిపింది. 130 కోట్ల వాట్సప్‌ యూజర్లు వ్యాపార సంస్థలతో చాట్‌ చేయడం ఇకపై మరింత సులువు అవుతుందని కంపెనీ పేర్కొంది. ప్రజల కోసం రూపొందించిన వాట్సప్‌ను వ్యాపార అవసరాలకూ ఉపయోపడేలా మెరుగుపరచాలనుకుంటున్నట్టు తెలిపింది. దీన్ని ఎలా మీ ఫోన్లో అప్ డేట్ చేసుకోవాలో తెలుసుకుందాం.

వాట్సప్ సమస్య నిజమేనంటున్న Xiaomi, ఎర్రర్‌ సమస్యను ఇలా ఫిక్స్ చేసుకోమంటోంది !

 

మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో కెళ్లి..

మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో కెళ్లి..

మీరు మీ మొబైల్ నుంచి గూగుల్ ప్లే స్టోర్లో కెళ్లి ఈ యాప్ ని వాట్సప్ మాదిరిగానే డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. కాగా ఈ యాప్ మీరు మరో నంబరుతో వాడుకోవచ్చు.

తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి ..

తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి ..

ఈ యాప్‌లో తమ వ్యాపారాలను నమోదుచేసుకున్నవారికి వెరిఫికేషన్ పూర్తైన తర్వాత వెరిఫైడ్ అంటూ గ్రీన్ కలర్ టిక్ వస్తుంది. కస్టమర్లతో మంచి సంబంధాలను నెరపడానికి.. వారు అడిగిన వాటికి త్వరగా రిప్లై ఇ్వవడానికి.. వారికి గ్రీటింగ్ మెసేజ్‌లు పంపడానికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే కస్టమర్ల అనుమతితోనే వ్యాపారులు మెసేజ్‌లు పంపగలరు.

వ్యాపార వేళలను వినియోగదారులకు..

వ్యాపార వేళలను వినియోగదారులకు..

వ్యాపార వేళలను వినియోగదారులకు మెసేజ్ ద్వారా తెలుపుతుంది. కాగా బిజినెస్ యాప్ రానున్న రోజుల్లో భారీ వ్యాపార ప్రణాళికలకు ఉపయోగపడగలదని అంటున్నారు. ఎయిర్ లైన్స్, ఈ కామర్స్ సైట్స్, బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను పెంచుకోవచ్చని అంటున్నారు.

 

 

 

ల్యాండ్‌లైన్ యాడ్

ల్యాండ్‌లైన్ యాడ్

వాట్సప్ బిజినెస్‌లో ల్యాండ్‌లైన్ నంబర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాట్సప్‌లో ఈ ఫీచర్ లేదు. ఎక్కువ మంది వ్యాపారస్తులు ల్యాండ్‌లైన్ నంబర్ యూజ్ చేస్తుండటంతో ఈ ఫీచర్‌ని అందుబాటులోకి తెచ్చింది.

ఆటో రిప్లైస్

ఆటో రిప్లైస్

మీరు వాట్సప్ బిజినెస్‌లో ఆటో రిప్లై ఫీచర్ సెట్ చేసుకోవచ్చు. బిజీగా ఉండి అవతలి వారికి సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో రిప్లై సెట్ చేసుకోవచ్చు.

 

 

 

బిజినెస్ టైప్

బిజినెస్ టైప్

మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన కాంటాక్ట్ లను యాడ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ ఇందులో లేకుంటే అదర్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు.

మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో..

మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో..

వాట్సప్ బిజినెస్‌లో మీకు వచ్చిన అలాగే మీరు పంపిన మొత్తం మెసేజ్‌లను స్టాటిస్టిక్స్ రూపంలో తెలుసుకోవచ్చు.మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో దానికి సంబంధించిన కాంటాక్ట్ లను యాడ్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ ఇందులో లేకుంటే అదర్స్ మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు.

గ్రీన్ టిక్

గ్రీన్ టిక్

ఇంతకుముందు వాట్సప్ లో మీరు పంపిన మెసేజ్‌లు అవతలి వారు చదివారడానికి గుర్తుగా బ్లూ ట్రిక్స్ వచ్చేవి. కాని వాట్సప్ బిజినెస్‌లో మీ ఇది గ్రీన్ కలర్‌లో ఉంటుంది.

లోగో

లోగో

బిజినెస్ వాట్సప్ లోగో ఉంటుందో తెలుసా..బి ఆకారంలో ఉంటుంది. అలాగే ఇందులో మైనస్ కూడా ఉంది. ఈ బిజినెస్ వాట్సప్‌లో రెండు వాట్సప్‌లను ఒకేసారి వాడలేరు. కాని వాట్సప్‌లో ఆ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్లో రెండు నంబర్లు వాడాల్సిందే.

Best Mobiles in India

English summary
How to Setup Your Whatsapp Account Without Mobile Number. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X