CoWin టీకా బ్యాడ్జ్‌ని సోషల్ మీడియాలో షేర్ చేయడం ఎలా??

|

కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. కరోనా బారీన పడకుండా తమను తాము కాపాడుకోవడానికి వ్యాక్సిన్లను వేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. CoWin ఇండియా యొక్క టీకా పోర్టల్ ద్వారా వ్యాక్సిన్లను జారీ చేస్తున్నది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు తమ యొక్క విషయాలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం అలవాటు అయింది. ఇప్పుడు CoWin పోర్టల్‌లో 'పాక్షికంగా వ్యాక్సినేట్ చేయబడిన' లేదా 'పూర్తిగా టీకాలు వేయబడిన' వ్యక్తుల కోసం బ్యాడ్జ్‌లను ప్రదర్శించడం ప్రారంభించింది. వినియోగదారులు తమ CoWIN ప్రొఫైల్‌కి లాగిన్ చేసినప్పుడు వారి పేర్ల పక్కన ఈ బ్యాడ్జ్‌లను కనుగొనవచ్చు. అదనంగా CoWIN ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌గా మారుతున్నందున ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అవుతుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. నేషనల్ హెల్త్ అథారిటీ CEO డాక్టర్ ఆర్ఎస్ శర్మ కూడా కొత్త టీకా బ్యాడ్జ్ సిస్టమ్ గురించి ట్వీట్ చేశారు. టీకాలు వేయని వ్యక్తులను వీలైనంత త్వరగా టీకాలు వేయమని ప్రోత్సహించడం ఈ చర్య యొక్క లక్ష్యం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీ యొక్క టీకా బ్యాడ్జ్‌ను షేర్ చేయడానికి మీరు ఈ కింద ఉన్న దశలను అనుసరించండి.

How to Share CoWin Vaccine Badge on Social Media?

Facebook, Twitter, WhatsAppలో CoWin టీకాల బ్యాడ్జ్‌ని షేర్ చేసే విధానం

** CoWIN వెబ్‌సైట్‌కి వెళ్లి క్రిందికి స్క్రోల్ చేయండి మరియు "మీ సామాజిక సర్కిల్‌లో టీకా స్టేటస్ ని షేర్ చేయండి"పై నొక్కండి.

** మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పూర్తి పేరు నమోదు చేయడం ద్వారా మీ ప్రొఫైల్‌కు లాగిన్ చేయండి.

** మీ ఫోన్‌కి పంపిన OTPని నమోదు చేయండి.

** OTP నమోదు పూర్తి చేసిన తర్వాత మీరు మీ టీకా స్టేటస్ ని చూస్తారు. "షేర్" ఎంపికపై నొక్కండి.

** మీ ప్రాధాన్యత బ్యాడ్జ్‌ని ఎంచుకుని దాన్ని WhatsApp, LinkedIn, Facebook మరియు Twitterలో షేర్ చేయండి.

** ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో దేనిలోనైనా కావలసిన శీర్షికతో మీ టీకా స్టేటస్ బ్యాడ్జ్‌ను భాగస్వామ్యం చేయగలరు.

How to Share CoWin Vaccine Badge on Social Media?

ఇటీవల గూగుల్ ఫర్ ఇండియా 2021 ఈవెంట్‌లో గూగుల్ అసిస్టెంట్‌ను భారతదేశంలో స్థానికీకరించడానికి గూగుల్ తన ప్రణాళికలను ప్రకటించింది. వాయిస్ అసిస్టెంట్ ద్వారా భారతదేశంలో ఎండ్-టు-ఎండ్ టీకా బుకింగ్‌ను అనుమతించనున్నట్లు టెక్ దిగ్గజం తెలిపింది. వాయిస్ కమాండ్‌తో స్థానిక భాషలో వాక్సినేషన్ స్లాట్‌లను వాయిస్ అసిస్టెంట్ ఎలా బుక్ చేయవచ్చో వివరిస్తూ అసిస్టెంట్ ఎలా పని చేస్తుందో గూగుల్ అధికారి వివరించారు.

Best Mobiles in India

English summary
How to Share CoWin Vaccine Badge on Social Media?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X