వాట్సాప్‌లో నకిలీ లైవ్ లొకేషన్‌ను మరొకరికి షేర్ చేయడం ఎలా?

|

ఫేస్ బుక్ యాజమాన్యంలోని వాట్సాప్‌ను ప్రస్తుతం త్వరిత మెసేజ్ లను పంపడానికి అధిక మంది యూజర్లు ఉపయోగిస్తున్నారు. వాట్సాప్‌ యాప్ వాయిస్ / వీడియో కాలింగ్, ఫార్వార్డింగ్ లేబుల్ వంటి మరెన్నో గొప్ప ఫీచర్లను అందిస్తున్నది. ఈ మెసేజింగ్ యాప్ సరళమైన UI మరియు ప్రకటన రహితతను కలిగి ఉంది. ఇవే కాకుండా ప్రతి ఒక్కరు ఇష్టపడే లక్షణాలలో ఒకటి లైవ్ లొకేషన్ షేర్ చేసే ఎంపిక.

వాట్సాప్‌ ఫీచర్స్

వాట్సాప్‌ ఫీచర్స్

వాట్సాప్‌ సంస్థ ఈ ఫీచర్ ను ఆండ్రాయిడ్ మరియు ios రెండింటికీ చాలా కాలం క్రితం జోడించింది. ఈ ఫీచర్ సాయంతో మీ యొక్క ప్రస్తుత స్థానాన్ని మరొకరితో పంచుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు వాట్సాప్‌లో లైవ్ లొకేషన్ షేరింగ్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. కాని తెలిసిన వారికి లొకేషన్ షేర్ చేయడం మంచిదే కానీ అనుమానితులకు నకిలీ లైవ్ లొకేషన్‌ను మెసేజింగ్ యాప్‌లో షేర్ చేయడం ఉత్తమం. ఈ నకిలీ లైవ్ లొకేషన్‌ను ఎలా షేర్ చేసుకోవాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్‌లో సరైన లైవ్ లొకేషన్‌ను పంచుకోవడం ఎలా?

వాట్సాప్‌లో సరైన లైవ్ లొకేషన్‌ను పంచుకోవడం ఎలా?

వాట్సాప్‌లో సరైన లైవ్ లొకేషన్‌ను మరొకరికి షేర్ చేయడానికి మీ చాట్‌లలోని టెక్స్ట్ బార్ పక్కన ఉన్న అటాచ్ బటన్‌పై నొక్కండి. తరువాత కింద "లొకేషన్", ‘లైవ్ లొకేషన్‌ను షేర్ చేయడం' వంటి క్రొత్త ఎంపిక ఉంటుంది. దీన్ని ఎంచుకోవడం వల్ల మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు మిమ్మల్ని మ్యాప్‌లో ట్రాక్ చేయడానికి అనుమతిస్తుంది. మ్యాప్‌లో మీ స్థానాన్ని ఎంతకాలం ట్రాక్ చేయవచ్చో వ్యవధిని సెట్ చేయడాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు.

వాట్సాప్‌ లైవ్ లొకేషన్‌

వాట్సాప్‌ లైవ్ లొకేషన్‌

వాట్సాప్‌లో లైవ్ లొకేషన్‌ను సింగిల్ మరియు గ్రూప్ చాట్‌లలో కూడా షేర్ చేయడానికి అనుమతిని ఇస్తుంది. గ్రూప్ చాట్‌లో ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తులు తమ స్థానాన్ని పంపగలరు. మీ లైవ్ లొకేషన్‌ను పంపిన తర్వాత మీరు "స్టాప్ షేరింగ్" నొక్కండి. ఇది మీ మ్యాప్ కార్డు క్రింద లభిస్తుంది.

వాట్సాప్‌లో నకిలీ లైవ్ లొకేషన్‌ను పంచుకోవడం ఎలా?

వాట్సాప్‌లో నకిలీ లైవ్ లొకేషన్‌ను పంచుకోవడం ఎలా?

స్టెప్ 1: గూగుల్ ప్లే స్టోర్ నుండి GPS ఎమ్యులేటర్ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి. తరువాత మీ ఫోన్‌లో డెవలపర్ ఎంపికను ప్రారంభించండి. ఇందులో సెట్టింగ్స్ > డెవలపర్ ఎంపికలకు వెళ్లి క్రిందికి స్క్రోల్ చేసి "మాక్ లొకేషన్ యాప్ ను ఎంచుకోండి" ఎంపికను ఎంచుకోండి.


స్టెప్ 2: యాప్ ను ఓపెన్ చేసి సెర్చ్ పట్టీలో మీ నకిలీ స్థానాన్ని టైప్ చేసి దిగువన ఉన్న గ్రీన్ బటన్‌ను నొక్కడం ద్వారా GPS ఎమ్యులేటర్‌ను ఆన్ చేయవచ్చు.


స్టెప్3: వాట్సాప్‌లో చాట్ ఓపెన్ చేసి ఆపై లొకేషన్> లైవ్ లొకేషన్‌ను షేర్ చేయండి, ఇక్కడ మీరు నకిలీ లైవ్ లొకేషన్‌ను షేర్ చేసినట్లు గమనించవచ్చు.

 

Best Mobiles in India

English summary
How to Share Fake Live Location on WhatsApp

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X