QR కోడ్ ద్వారా వెబ్‌పేజీని షేర్ చేయడం ఎలా?
స్మార్ట్ఫోన్ కెమెరా లేదా గూగుల్ లెన్స్ వంటి డివైస్ ల ద్వారా డీకోడ్ చేయగల QR కోడ్‌గా మార్చడం ద్వారా వెబ్‌సైట్‌ను లేదా ఏదైనా ప్రత్యేక వెబ్‌పేజీని షేర్ చేయడానికి వినియోగదారులను అనుమతించే క్రొత్త ఫీచర్‌ను పొందడానికి గూగుల్ క్రోమ్ మరోసారి కొత్త పద్దతిని అనుసరిస్తున్నది.

గూగుల్ క్రోమ్ యొక్క ఈ ఫీచర్ తుది సంస్కరణ ఇంకా అనుబాటులోకి రాలేదు. సాధారణంగా క్రోమ్ కానరీ అని పిలువబడే బ్రౌజర్ యొక్క టెస్టింగ్ వెర్షన్ ఈ ఫీచర్ ను కలిగి ఉంది. అయినప్పటికీ ఇది డిఫాల్ట్‌గా ఆపివేయబడుతుంది. వినియోగదారులు సాధారణంగా 'ఫ్లాగ్స్' విభాగంలోకి వెళ్లడం ద్వారా దీన్ని ప్రారంభించాల్సి ఉంటుంది.

ఈ ఫీచర్ తుది సంస్కరణ రాకముందే దీని మీద ఉత్సాహంగా ఉన్న వారు దీనిని ప్రారంభించడానికి కింద ఈ దశలను అనుసరించండి.
1. మీరు ఇప్పటికే మీ డివైస్ లో Chrome కానరీని ఇన్‌స్టాల్ చేసి ఉంటె కనుక దాన్ని ఓపెన్ చేయండి.
2. అప్పుడు బ్రౌజర్ యొక్క అడ్రస్ బార్ లో 'chrome: // flags / # sharing-qr-code-generator' అని టైప్ చేయండి
3. ఇది ఆటొమ్యాటిక్ గా మిమ్మల్ని నేరుగా ఫ్లాగ్స్ పేజీకి మళ్ళిస్తుంది.

4. ఇప్పుడు కొంత సమయం ఆదా చేయడానికి మీ PC లో ctrl + f నొక్కండి మరియు QR కోడ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
5. QR కోడ్ ద్వారా భాగస్వామ్య పేజీని ప్రారంభించండి' ఎంపిక ముందు ఉన్న బాక్స్ నుండి ఎనేబుల్ ఎంపికను ఎంచుకోండి.
6. అప్పుడు స్క్రీన్ కింద నుండి Relaunch Now బటన్ పై క్లిక్ చేయండి.
7. ఈ ఫీచర్ ను ఉపయోగించడానికి ఏదైనా వెబ్‌పేజీని ఓపెన్ చేసి మూడు-చుక్కలపై క్లిక్ చేసి ఆపై 'ఈ పేజీ కోసం QR కోడ్‌ను రూపొందించండి' ఎంపికపై క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








