Home
How to

Facebookలో వాట్సాప్ స్టేటస్‌ని షేర్ చేయడం ఎలా?

మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యొక్క వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ నంబర్ వన్ ఆన్‌లైన్ టెక్స్టింగ్ అప్లికేషన్ తన యొక్క వినియోగదారులకు అందించిన మెరుగైన ఫీచర్లలో వాట్సాప్ స్టేటస్ ని Facebookలో షేర్ చేసే మరొక ఫీచర్ కూడా ఉంది. Facebookను కూడా అధికంగా వినియోగించే వారిలో మీరు కూడా ఉంటే కనుక మీకు ఈ ఫీచర్ గురించి ఇదివరకే తెలియకుంటే దాని గురించి విపులంగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

How to Share WhatsApp Status on Facebook: Here are The Step by Step Process

Facebookలో వాట్సాప్ స్టేటస్ ని షేర్ చేసే విధానం

How to Share WhatsApp Status on Facebook: Here are The Step by Step Process

** ముందుగా వాట్సాప్ స్టేటస్ ని చేయండి.

** మీరు ఇప్పటికే స్టేటస్‌ని షేర్ చేయకుంటే కనుక ఏదైనా ఒక స్టేటస్‌ని క్రియేట్ చేయండి.

** మీరు కొత్త స్టేటస్‌ని లేదా పాత స్టేటస్‌ని షేర్ చేయాలనుకున్నప్పుడు మీకు ఇక్కడ రెండు భాగస్వామ్య ఎంపికలు కనిపిస్తాయి.

** మీరు కొత్త స్టేటస్ అప్‌డేట్‌ను షేర్ చేయబోతున్నట్లయితే కనుక మీరు మై స్టేటస్‌కి వెళ్లి, షేర్ టు ఫేస్‌బుక్ స్టోరీని ట్యాప్ చేయాలి.

** Facebook యాప్‌ని ఇక్కడ తెరవమని లేదా అనుమతించమని కూడా మిమ్మల్ని అడగవచ్చు. దానిపై క్లిక్ చేసి ఫేస్‌బుక్ యాప్‌లోకి వెళ్లండి.

** వాట్సాప్ స్టేటస్‌ని షేర్ చేసే ఎంపికలో రెండవది మీరు ఎవరితో స్టేటస్‌ని షేర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోని తర్వాత షేర్ నౌపై నొక్కండి.

ఐఫోన్‌లో వాట్సాప్ స్టేటస్‌ని షేర్ చేసే విధానం

How to Share WhatsApp Status on Facebook: Here are The Step by Step Process

** ఐఫోన్‌లోని వాట్సాప్ యొక్క స్టేటస్ అప్‌డేట్‌లను షేర్ చేయడానికి ' షేర్ మై స్టేటస్‌' లేదా 'మోర్' ఎంపికకు వెళ్లండి.

** ఆపై మోర్‌ని ట్యాప్ చేసి షేర్ టు ఫేస్‌బుక్‌ ఎంపిక మీద ట్యాప్ చేయండి.

** తర్వాత షేర్ నౌపై నొక్కండి.

** ఐఫోన్‌లో మై స్టేటస్ లేదా Androidలో మై స్టేటస్ పక్కన ఉన్న 'మోర్' ఎంపికల మీద నొక్కండి. ఆపై మీరు షేర్ చేయాలనుకుంటున్న స్టేటస్ పక్కన ఉన్న అదనపు ఎంపికను (లేదా) నొక్కండి. ఆపై Facebookకి షేర్ చేయి ఎంపిక మీద నొక్కండి.

** ప్రాంప్ట్ చేయబడితే ఫేస్‌బుక్‌ యాప్‌ను ఓపెన్ చేయడానికి అనుమతించు ఎంపిక మీద నొక్కండి. ఫేస్‌బుక్‌ యాప్‌లో మీరు ఎవరితో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి. ఆపై ఇప్పుడు 'షేర్ నౌ' ఎంపిక మీద నొక్కండి.

** స్టేటస్‌ని షేర్ చేసిన తర్వాత వాట్సాప్ మళ్లీ ఓపెన్ అవుతుంది.

** ఒకటి కంటే ఎక్కువ స్టేటస్‌లు ఉంటే మీరు ఫేస్‌బుక్‌ స్టోరీలో ఏ స్టేటస్‌ని షేర్ చేయాలనుకుంటున్నారో ఎంచుకోవచ్చు.

** మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కోసం ఫేస్‌బుక్‌ లేదా ఫేస్‌బుక్‌ లైట్ లేదా iOS కోసం ఫేస్‌బుక్‌ యాప్‌ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని గమనించాలి.

Best Mobiles in India

English summary
How to Share WhatsApp Status on Facebook: Here are The Step by Step Process
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X