ఐఫోన్ నుండి Wi-Fi పాస్‌వర్డ్‌ను సులువుగా ఎలా షేర్ చేయవచ్చు

|

స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్న వారు అధికంగా డేటాను వాడుతూఉంటారు. ఒక వేళ మీరు వాడుతున్న మొబైల్ డేటా పరిమితి అయిపోతే కనుక మీ యొక్క స్నేహితుడి డేటాను వినియోగించే అవకాశం ఉంది. మరొకరి డేటాను వాడటానికి అతని హాట్‌స్పాట్ ఆన్ చేసి వినియోగించవచ్చు. హాట్‌స్పాట్ ఆన్ చేసిన తరువాత వై-ఫై యొక్క పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది అందరికి తెలిసిన విషయం.

వై-ఫై పాస్‌వర్డ్‌
 

వై-ఫై యొక్క పాస్‌వర్డ్‌ను సృష్టించే విషయంలో అది వివిధ రకాల అక్షరాలు, నెంబర్ లు మరియు కొన్ని చిహ్నాల కలయికతో మాత్రమే అనుమతిని ఇస్తుంది. ఇలాంటి కలయిక గల పాస్‌వర్డ్‌ను మరొకరితో నోటి మాటతో పంచుకోవడం చాలా కష్టం. దీనిని షేర్ చేయడానికి మూడవ పార్టీ యాప్ ను చాలా మంది వినియోగిస్తారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో!!! ఆకాశాన్ని అంటే ధర!!!ఆపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రో!!! ఆకాశాన్ని అంటే ధర!!!

వై-ఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేయడం

వై-ఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేయడం అంత సులభం కాదు. దీనికి పరిష్కారం కోసం ఆపిల్ తమ అన్ని రకాల డివైస్ లలోని iOS ఒక చక్కని ఫీచర్ తో వస్తుంది. ఇది వినియోగదారులకు వారి Wi-Fi పాస్‌వర్డ్‌ను స్నేహితుడికి లేదా కుటుంబ సభ్యులకు వాస్తవంగా బయటకు చెప్పకుండా లేదా ఇతర ఫోన్‌లో టైప్ చేయకుండా షేర్ చేయడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ రెండు డివైస్ ల బ్లూటూత్, వై-ఫై మరియు ఆపిల్ ఐడిలను వాటి మధ్య వై-ఫై పాస్‌వర్డ్‌ను సురక్షితంగా పంచుకోవడానికి ఉపయోగిస్తుంది. వాటిని ఎలా వినియోగించాలో మరియు దానికి తీసుకోవలసిన జాగ్రత్తలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వై-ఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి కావలసిన అవసరాలు

వై-ఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి కావలసిన అవసరాలు

* రెండు డివైస్ లలో వై-ఫై మరియు బ్లూటూత్ ఆన్ చేయాలి.

* రెండవ వ్యక్తి యొక్క హాట్‌స్పాట్ మొదట ఆపివేయాలి.

* ఈ ఫీచర్ IOS, iPadOS లేదా macOS యొక్క తాజా వెర్షన్‌ డివైస్ లలో మాత్రమే లభిస్తాయని నిర్ధారించుకోండి.

* రెండు డివైస్ లు బ్లూటూత్ మరియు వై-ఫై పరిధిలో ఖచ్చితంగా ఉండాలి.

* అలాగే రెండు పరికరాల్లో కాంటాక్ట్స్ యాప్ లో ఇమెయిల్ విభాగం కింద ఆపిల్ ఐడి సేవ్ చేయాలి.

వై-ఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి అనుసరించవలసిన పద్ధతులు
 

వై-ఫై పాస్‌వర్డ్‌ను షేర్ చేయడానికి అనుసరించవలసిన పద్ధతులు

1. మొదటి పరికరాన్ని అన్‌లాక్ చేసి అది Wi-Fi నెట్‌వర్క్‌ను అందిస్తుంది అని నిర్ధారించుకోండి.

2. ఇప్పుడు రెండవ పరికరాన్ని అన్‌లాక్ చేసి Wi-Fi యొక్క సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి.

3. మీరు పాస్‌వర్డ్‌ను షేర్ చేయదలిచిన నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.

4. ఇప్పుడు మొదటి పరికరాన్ని బ్లూటూత్ యొక్క పరిధిలో తీసుకురండి.

5. మొదటి పరికరం రెండవ పరికరంతో పాస్‌వర్డ్‌ను షేర్ చేయమని అడుగుతూ ఒక పాపప్ నోటిఫికేషన్‌ను అందుకుంటుంది.

6. షేర్ పాస్‌వర్డ్‌ను నొక్కండి. ఆ తరువాత 'డన్' ఆప్షన్ మీద నొక్కండి.

పైన తెలిపిన పద్ధతులు పాటించినచో మీరు Wi-Fi పాస్‌వర్డ్‌ను మరొక ఫోన్ లో టైప్ చేయకుండానే మీరు ఆటోమ్యాటిక్ గా Wi-Fi నెట్‌వర్క్‌ను పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to share Wi-Fi Password From iphone to Others Without Typing

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X