Pin Windows ఫీచర్‌‌‍తో మీ ఫోన్ డేటా సేఫ్!

వ్యక్తిగత డేటాతో నిండి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇతరుల చేతుల్లో పెట్టేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. కొన్ని కొన్ని సందర్భాల్లో మన చేతిలోని స్మార్ట్‌‍ఫోన్‌లను ఇతరులకు ఇవ్వవల్సి వస్తుంది.

|

వ్యక్తిగత డేటాతో నిండి ఉండే స్మార్ట్‌ఫోన్‌లను ఇతరుల చేతుల్లో పెట్టేందుకు ఎవ్వరూ ఇష్టపడరు. కొన్ని కొన్ని సందర్భాల్లో మన చేతిలోని స్మార్ట్‌‍ఫోన్‌లను ఇతరులకు ఇవ్వవల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మన వ్యక్తిగత డేటాను తెలుసుకునే వీలుంటుంది. ఇటువంటి ఇబ్బందులను తరచూ ఫేస్ చేస్తన్ను వారు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని "Pin Windows" అనే ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా అవతలి వ్యక్తి అవసరం మేరకు యాప్ లేదా విండో మాత్రమే ఓపెన్ అయి మిగిలిన ఫోన్ డేటా మొత్తం లాక్ అయ్యేలా సెట్టింగ్స్‌ను కస్టమైజ్ చేసుకునే వీలుంటుంది. పిన్ విండోస్ ఫీచర్‌ను ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సప్‌ని మరిపించేలా గూగుల్ మెసేజ్ యాప్,ఛాటింగ్‌లో కొత్త అనుభూతివాట్సప్‌ని మరిపించేలా గూగుల్ మెసేజ్ యాప్,ఛాటింగ్‌లో కొత్త అనుభూతి

Pin Windows

ఆండ్రాయిడ్ లాలీపాప్ లేదా ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్ం పై..పిన్ విండోస్ ఫీచర్ మీ ఫోన్‌లో వర్క్ అవ్వాలంటే మీ ఫోన్ ఖచ్చితంగా ఆండ్రాయిడ్ లాలీపాప్ లేదా ఆపై వెర్షన్ ఆపరేటింగ్ సిస్ం పై రన్ అవ్వాలి. ప్రొసీజర్ విషయానికి వచ్చేసరికి.. ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి 'Security & Lock screen' విభాగంలోకి వెళ్లండి. సెక్యూరిటీ అండ్ లాక్ స్ర్కీన్ విభాగంలోకి వెళ్లిన తరువాత 'Screen Pinning' ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోండి.

ఇకపై అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 6ఎస్,ఇండియాలో తయారీ !ఇకపై అత్యంత తక్కువ ధరకే ఐఫోన్ 6ఎస్,ఇండియాలో తయారీ !

అన్‌పిన్ చేసే ముందు పాస్‌వర్డ్ లేదా ప్యాట్రన్‌...
ఇదే సమయంలో 'Ask for unlock pattern before unpinning' అనే ఆప్షన్‌ను కూడా మీరు టర్న్ ఆన్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసకోవటం ద్వారా యాప్‌ను అన్‌పిన్ చేసే ముందు పాస్‌వర్డ్ లేదా ప్యాట్రన్‌ను మీరు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. ఇప్పుడు pin చేయాలనుకుంటోన్న యాప్‌ను ఓపెన్ చేసిన పిన్ ఐకాన్ పై ప్రెస్ చేసినట్లయితే యాప్ ఆటోమెటిక్‌గా పిన్ కాబడుతుంది.

మొదటి పిన్ చేసిన యాప్‌ను unpin చేసి..
ఇప్పుడు మరో యాప్‌ను మీరు పిన్ చేయాలనుకుంటున్నట్లయితే మొదటి పిన్ చేసిన యాప్‌ను unpin చేయవల్సి ఉంటుంది. సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లలో 'Pin windows' విండోస్ ఆప్షన్ అనేది 'Lock Screen and security'> 'Other security settings'> 'Pin windows' వద్ద లొకేట్ అయి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Well, there’s a small feature built right inside your Android operating system called as “Pin Windows”, this feature allows you to pin specific windows on your screen while keeping your smartphone locked.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X