క్రోమ్ బ్రౌజర్ వేగంగా రన్ అవ్వాలంటే..? సింపుల్ ట్రిక్స్

|

ఇంటర్నెట్‌‌లో బ్రౌజ్ చేసే ప్రతి ఒక్కరికి గూగుల్ క్రోమ్ అనేది సుపరిచితమైన వెబ్ బ్రౌజర్. నెటిజనులకు ఉపయోగపడే బోలెడన్ని సదుపాయాలు ఈ బ్రౌజర్‌లో గూగుల్ అందుబాటులో ఉంచుతోంది. అయితే ఫీచర్ల సంఖ్య పెరుగుతోన్న కొద్ది ఈ బ్రౌజర్‌లో వేగం మందగిస్తోన్నట్లు యూజర్ల నుంచి ఫిర్యాదులు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి పరిస్థితులను మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే ఇన్‌స్టెంట్ రిజల్ట్స్‌ను అందించే ఈ క్విక్ టిప్స్‌ను పాటించి చూడండి.

 

ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు

ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు

అనవసరమైన ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. ప్లగిన్స్ కూడా ఇంచుమించుగా ఎక్స్‌టెన్షన్స్ మాదిరగానే ఉంటాయి. ఇవి మీ బ్రౌజర్‌ పనితీరును అదనంగా పెంచటంలో తోడ్పడతాయి. అయితే అవసరం లేని ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.

ప్లగిన్స్‌ను డిసేబుల్ చేయాలంటే ముందుగా క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://plugins"అని టైప్ చేయండి. ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన ప్లగిన్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న plugins పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

 

 ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు...

ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు...

ఎక్స్‌టెన్షన్‌లను డిసేబుల్ చేయాలంటే ముందుగా క్రోమ్ లొకేషన్ బార్‌లో chrome://extensionsఅని టైప్ చేయండి. ఇప్పుడు మీరు క్రోమ్ Options > More tools > Extensionsలోకి వెళతారు. ఇక్కడ మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న ఎక్స్‌టెన్షన్‌ల పై అన్ టిక్ చేసినట్లయితే ఎక్స్‌టెన్షన్స్ డిసేబుల్ కాబడతాయి.

లేటెస్ట్ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు
 

లేటెస్ట్ అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు

వాస్తవానికి క్రోమ్ బ్రౌజర్ అనేది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటుంది. ఒకవేళ అలా జరగని పక్షంలో బ్రౌజర్ ను క్లోజ్ చేసి కంప్యూటర్ ను రీస్టార్ట్ చేసినట్లయితే బ్రౌజర్ అప్ డేట్ కాబడుతుంది. మీ క్రోమ్ బ్రౌజర్ లేటెస్ట్ వర్షన్ పై రన్ అవుతుందో లేదో తెలుసుకోవాలంటే టాప్ రైట్‌లో కనిపించే మూడు డాట్స్ పై క్లిక్ చేసి హెల్ప్ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ బ్రౌజర్ ఏ వర్షన్ పై రన్ అవుతుందనేది తెలిసిపోతుంది. ఒకవేళ మీ బ్రౌజర్ పాత వర్షన్ పై రన్ అవుతున్నట్లయితే కొత్త వర్షన్‌కు అప్‌డేట్ చేసుకునే వీలుంటుంది. ఫోన్ లేదా టాబ్లెట్‌లో క్రోబ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసుకోవాలంటే సంబంధిత యాప్ స్టోర్‌లోకి వెళ్లి అప్‌డేట్ చేసుకోవల్సి ఉంటుంది.

 వెబ్ యాప్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు

వెబ్ యాప్స్‌ను డిసేబుల్ చేయటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు

పనికిరాని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఒక వెబ్ బ్రౌజర్ మాత్రమే కాదు, వెబ్ యాప్స్‌కు అప్లికేషన్ ఫ్లాట్‌ఫామ్ కూడా. లోకల్‌గా ఇన్‌స్టాల్ చేసిన HTML5, CSS, JavaScript యాప్స్‌తో కూడా ఈ బ్రౌజర్‌ను రన్ చేసుకోవచ్చు. మీ బ్రౌజర్‌లో అవసరం లేని వెబ్ యాప్స్‌ను తొలగించటం ద్వారా బ్రౌజర్ వేగాన్ని పెంచుకోవచ్చు.వెబ్ యాప్స్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే ముందుగా క్రోమ్ లొకేషన్ బార్‌లో "chrome://apps"అని టైప్ చేయండి. ఇప్పుడు మీ బ్రౌజర్‌తో అనుసంధానమైన వెబ్ యాప్స్ మీకు కనిపిస్తాయి. వీటిలో మీరు డిసేబుల్ చేయాలనుకంటున్న యాప్ పై రైట్ క్లిక్ చేసి Remove from Chrome ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి. యాప్స్ రిమూవ్ కాబడతాయి.

బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా

బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవటం ద్వారా

క్రోమ్ బ్రౌజర్‌లోని బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవటం ద్వారా వేగాన్ని మరింతగా పెంచుకోవచ్చు. సెట్టింగ్స్ లోకి వెళ్లటం ద్వారా బ్రౌజింగ్ హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో క్రోమ్ బ్రౌజర్‌ను రీ-ఇన్ స్టాల్ చేయటం ద్వారా వేగం పుంజుకుంటుంది. కాబట్టి అలా కూడా ట్రై చేసి చూడండి.

Best Mobiles in India

English summary
Chrome is a great web browser, but it can slow your PC or laptop to a crawl. Here are some ways you can speed things up again.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X