3జీలో 4జీ స్పీడ్‌ను పొందటం ఏలా..?

  X

  మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన 3జీ, 4జీ కమ్యూనికేషన్ టెక్నాలజీలు మొబైల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను మరింత వేగవంతం చేసినప్పటికి ఏదో ఒక సందర్భంలో స్లో డేటా ఇంటర్నెట్ సమస్య స్మార్ట్‌ఫోన్ యూజర్లను వేధిస్తూనే ఉంది.

  3జీలో 4జీ స్పీడ్‌ను పొందటం ఏలా..?

  Read More : WhatsAppలో 16 ఎంబి కంటే పెద్ద సైజు వీడియోలను షేర్ చేయటం ఎలా..?

  ఈ సమస్యకు పరిష్కార మార్గంగా XDA forum member ఒకరు ఆచరణలోకి తీసుకువచ్చిన ఓ సొల్యూషన్ నిజంగా అద్భుతమనిపిస్తోంది. ఫోన్ 3జీ కనెక్షన్ స్పీడ్‌ను మరింతగా పెంచుకునేందుకు ఈయన సూచించిన ట్రిక్ ఏంటో తెలుసా..?

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  #1

  పాఠకులకు ముఖ్య గమనిక: ఈ పక్రియలో ఏదైనా తప్పు జరిగితే దానికి తెలుగు గిజ్‌బాట్ బాధ్యత వహించదు. మీరు సొంతంగా రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. డెవలపర్స్ పర్యవేక్షణలో వారి సూచనల మేరకు ఈ ట్రిక్‌ను మీమీ ఫోన్‌లలో అప్లై చేసుకోవాలని మనవి.

  #2

  మీ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్ స్పీడ్‌ను ఆప్టిమైజ్ చేసుకోవాలని అనుకుంటున్నట్లయితే మీ ఫోన్‌లోని ఇంటర్నెట్ కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఫైల్‌ను ఎడిట్ చేయవల్సి ఉంటుంది. కాన్ఫిగరేషన్ ఫైల్ లోని 'Van Jacobson TCP/IP header Compression'ను ఎడిట్ చేయటం ద్వారా 3జీ స్పీడ్‌ను పెంచుకోవచ్చు.

  #3

  ఈ పద్ధతిని అనుసరించి కాన్ఫిగరేషన్ ఫైల్‌ను మాడిఫై చేసుకున్న చాలా మంది యూజర్లు తమ 3జీ కనెక్షన్ స్పీడ్‌ను రెట్టింపు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడో సమస్య కూడా ఉంది. మీ నెట్‌వర్క్ క్యారియర్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తేనే ఈ మాడిఫికేషన్ ప్రక్రియను మీరు విజయవంతంగా పూర్తి చేయగలరు.

  #4

  కాన్ఫిగరేషన్ ఫైల్ మాడిఫికేషన్ ద్వారా 3జీ ఇంటర్నెట్ స్పీడ్‌ను పెంచుకోవాలంటే ముందుగా మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను రూట్ చేయవల్సి ఉంటుంది. రూట్ చేయబడిన ఫోన్‌కు కంపెనీ ఇచ్చే ఏ విధమైన వారంటీలు వర్తించవు. అంతే కాదు రూట్ చేసే సమయంలో డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. కాబట్టి, ఫోన్‌ను రూట్ చేసే ముందు ఫోన్‌లోని డేటా మొత్తం బ్యాకప్ చేసుకోండి.

  #5

  Options.7z archive ఫైల్‌ను ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి.

  #6

  రూట్ ఫైల్స్‌ను యాక్సెస్ చేసుకుని, ఫైల్ పర్మిషన్స్‌ను మార్చగలిగే పైల్ మేనేజర్ యాప్స్ (ES File Explorer లేదా Root Explorer)ను మీ ఫోన్‌లో ఇన్స్‌స్టాల్ చేసి ఉంచండి.

  #7

  డౌన్‌లోడ్ చేసుకున్న Options.7z archive ఫైల్‌ను అన్‌జిప్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ పేరుతో ఓ ఫైల్ మీకు కనిపిస్తుంది. ఆప్షన్స్ ఫైల్‌ను మీ డివైస్ ఎస్డీ‌కార్డ్ రూట్‌లోకి కాపీ చేసుకోండి.

  #8

  ఫోన్‌లో ముందుగానే ఇన్స్‌స్టాల్ చేసి ఉంచిన ES File Manager యాప్‌ను ఓపెన్ చేసి రూట్ పర్మిషన్‌ను అనుమతించండి. ఇలా చేయటానికి Menu >> Root Explorer >> On >> Confirm.

  #9

  ఇప్పుడు ES File Manager యాప్ ను ఓపెన్ చేసి ఇంతకు ముందు భద్రపరిచిన ‘ఆప్షన్స్' ఫైల్ ను కాపీ చేసుకుని "/ system / etc / ppp" ఫోల్డర్‌లో పేస్ట్ చేయండి.

  #10

  ఇప్పుడు మీరు ఆప్షన్స్ ఫైల్ యొక్క పర్మిషన్‌ను ఛేంజ్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే Option file: tap and hold the file: More >> Properties >> Edit (Permission) >> activate the three permission under Readable (owner, group and other), deactivate the three under Writing and activate the three under Execute. And press OK.

  #11

  ఫోన్‌ను రీబూట్ చేయండి. ఇప్పుడు మీ ఫోన్‌ రెట్టింపు 3జీ ఇంటర్నెట్ వేగంతో పనిచేస్తుంది.

  గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

  English summary
  How to Speed Up Your 3G Connection For Free. Read More in Telugu Gizbot..
  Opinion Poll

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more