Home
How to

యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనీ సంపాదించడం ఎలా ?

By Gizbot Bureau

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డబ్బులు సంపాదించేందుకు బోలెడన్ని ఆన్లైన్ మార్గాలు అందుబాటులోకి వచ్చేసాయి. వాటిలో యూట్యూబ్ ఒకటి. మీకు ఎక్కువ మంది ఆన్‌లైన్ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే యూట్యూబ్ వీడియోల ద్వారా మీ సంపాదనను వేగవంతంగా పెంచుకోవచ్చు. రోజు రోజుకు ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ వాడకం పెరిగిపోతోంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం నెలకు 1.9 billion మంది య్యూట్యూబ్ ఛానల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఈ కంటెంట్ ఫ్లాట్ ఫాం మీద వీక్షకులు గంటకు 1 బిల్లియన్ అవర్స్ వీక్షిస్తున్నారు. ఇది కేవలం అంచనా లెక్కలు మాత్రమే ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. సో మీరు కూడా యూట్యూబ్ ద్వారా కూడా డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే, ఈ గైడ్‌ఫాలో అవ్వండి...

యూట్యూబ్ ఛానల్‌ సెటప్

యూట్యూబ్ ఛానల్‌ సెటప్

ముందుగా మీ యూట్యూబ్ ఛానల్‌ను సెటప్ చేసుకోండి. ప్రతి యూట్యూబ్ అకౌంట్‌కు ఒక చానల్ అటాచ్ అయి ఉంటుంది. యూట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ లాంటిదే. మీరు యూట్యూబ్ అకౌంట్ ను క్రియేట్ చేయటం ద్వారా అన్ని గూగుల్ ప్రొడొక్ట్స్ లోకి మీకు యాక్సిస్ లభిస్తుంది.

ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు 

ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు 

మీ యూట్యూబ్ అకౌంట్‌ను క్రియేట్ చేసిన తరువాత మీ ఛానల్‌ను సులువుగా గుర్తించేందుకు ‘కీవర్డ్స్' (keywords)ను జత చేయండి. మీరిచ్చే keywords కంటెంట్‌కు సూట్ అయ్యేవిగా ఉండాలి. మీ యూట్యూబ్ ఛానల్‌కు సంబంధించిన యూజర్ నేమ్ చాలా సింపుల్‌గా అదే సమయంలో సలువుగా గుర్తుంచుకునే విధంగా ఉండేలా చూసుకోండి. మీ యూట్యూబ్ అకౌంట్‌లో హైక్వాలిటీ కంటెంట్‌ను అప్‌లోడ్ చేయటం ప్రారంభించండి.

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయాలి

కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయాలి

మీరిచ్చే కంటెంట్ కొత్దదిగాను అదే సమయంలో ఆకర్షణీయంగా ఉండాలి. వీడియోల చిత్రీకరణలో భాగంగా క్వాలిటీ కెమెరాలను వాడండి. కంటెంట్‌కు హైక్వాలిటీ ఎడిటింగ్ ఇంటా టెక్నిక్‌లను జోడించి మీ ఆడియన్స్‌ను ఆకట్టుకోండి. కంటెంట్‌ను రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేయటం వల్ల మీ ఆడియన్స్ సంఖ్య పెరుగుతూ వస్తుంది. కంటెంట్ అప్‌లోడ్‌లో భాగంగా ఓ షెడ్యుల్‌ను ఫాలో అవ్వండి.వీడియోకు తగట్టుగా కీవర్డ్స్‌ను ట్యాగ్ చేయండి. ఇదే సమయంలో ఆ వీడియోకు సంబంధించి ఆకట్టుకునే వివరణను వీడియో క్రింద పోస్ట్ చేయండి.

యూట్యూబ్ వీడియోల ద్వారా

యూట్యూబ్ వీడియోల ద్వారా

మీ యూట్యూబ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆడియన్స్‌లో మరింత ఆసక్తిని రేకెత్తించండి.మీ యూట్యూబ్ వీడియోల ద్వారా డబ్బు సంపాదించే క్రమంలో monetizationను ఏనేబుల్ చేయవల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీ వీడియాలలో యూట్యూబ్ వాణిజ్య ప్రకటనలను ప్లేస్ చేస్తుంది. ఇలా చేయాలంటే మీ వీడియోలలో ఏ విధమైన copyrighted కంటెంట్ ఉండకూడదు.

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి..

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి..

యాడ్ సెన్స్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మీ యూట్యూబ్ చానల్ అకౌంట్ పేరుతో ఓ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోండి. అకౌంట్‌ను క్రియేట్ చేసే సమయంలో మీ వయసు 18 సంవత్సరాలకు మించి ఉండాలి. అలానే వాడుకులో ఉన్న మెయిల్ అడ్రస్‌‌తో కూడిన పేపాల్ లేదా బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. యాడియన్స్ మీ వీడియోల పై ఏర్పాటు చేసిన యాడ్‌లసు క్లిక్ చేయటం ద్వారా లేదా చూడటం ద్వారా కొంత మొత్తం డబ్బు మీ అకౌంట్‌లో యాడ్ అవుతుంటుంది.

యూట్యూబ్‌లో మాత్రమే కాదు

యూట్యూబ్‌లో మాత్రమే కాదు

మీ ఛానెల్ మోనూలోని గూగుల్ ఆనాలిటిక్స్‌లోకి వెళ్లి మీ కంటెంట్ పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఫలితాలను మరింతగా మెరుగుపరుచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రణాళికలను సెట్ చేసుకోండి. మీ వీడియోలను కేవలం యూట్యూబ్‌లో మాత్రమే కాదు, బ్లాగ్ లేదా వెబ్ సైట్ ను క్రియేట్ చేసుకుని అక్కడ కూడా మీ వీడియోలను పోస్ట్ చేస్తూ మార్కెటింగ్ చేసుకోండి. నేటి ఆధునిక జనజీవన స్రవంతిలో కొంచం కొత్తగా ఆలోచిస్తే చాలు స్వల్ప వ్యవధిలోనే ‘టాక్ ఆఫ్ ద టౌన్'గా మారిపోవచ్చు. ఆన్‌లైన్ ప్రపంచం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త ఆలోచనలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆన్‌లైన్ ఉపాధిమార్గంగా విస్తరిస్తోంది.

Best Mobiles in India

English summary
How To Start A YouTube Channel And Earn Money In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X