Whatsapp Photo Scam వాట్సాప్ ఫోటో స్కామ్ ఏంటీ.. దీని నుంచి ఎలా తప్పించుకోవాలి..!
Whatsapp Photo Scam : భారత్ గత కొన్ని సంవత్సరాలుగా ఆన్‌లైన్ స్కామ్‌లు గణనీయంగా పెరిగాయి. నేరగాళ్ల బారినపడి అనేక మంది ప్రజలు లక్షల రూపాయలను కోల్పోతున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా... ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నా.. ఎక్కడో చోట సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అయితే సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అనేక మందిని మోసం చేస్తున్నారు.
లక్షల రూపాయలను కోల్పోతున్నారు :
ఇటీవల వాట్సాప్ ద్వారా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ ఫోటో స్కామ్ ద్వారా అనేక మంది లక్షల రూపాయలను కోల్పోతున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. కేవలం చాలా తక్కువ సమయంలోనే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.

కొత్త నంబర్‌లతో ఫోటోలు షేర్ చేస్తూ.. :
వాట్సాప్‌లో కొత్త నంబర్‌తో మీకు కొన్ని ఫోటోలు పంపుతారు. మీమ్స్, గ్రీటింగ్స్ రూపంలో పంపుతారు. అయితే ఆ ఫోటోల్లో మీకు తెలియని మాల్‌వేర్ ఉంటుంది. ఈ మోసాలపై సరైన అవగాహన లేని ప్రజలు వాటిని డౌన్‌లోడ్ చేస్తున్నారు.
పోటోలతోపాటు ప్రమాదకమైన మాల్‌వేర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ అవుతోంది. దీని ద్వారా హ్యాకర్లు మీ వ్యక్తిగత వివరాలతోపాటు బ్యాంకు ఖాతాల పాస్‌వర్డ్స్‌ను తెలుసుకుంటున్నారు. ఈ వివరాల ఆధారంగా మీ బ్యాంకు ఖాతాల్లోని నగదును వారి ఖాతాల్లోకి బదిలీ చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనల బారినపడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆండ్రాయిడ్, iOS వాట్సాప్ యూజర్లు :
ముఖ్యమైన పండుగలు, ప్రత్యేక ఈవెంట్స్, సేల్స్ సమయాల్లో నేరగాళ్లు.. వాట్సాప్ ద్వారా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. ఆండ్రాయిడ్, iOS వాట్సాప్ యూజర్లు కూడా వాట్సాప్ ఇమేజ్ స్కామ్ ద్వారా మోసపోయేందుకు అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలా ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం. ఇలాంటి నేరగాళ్ల బారిన పడకుండా వాట్సాప్ సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వాట్సాప్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. వాట్సాప్ విడుదల చేస్తున్న సెక్యూరిటీ ఫీచర్‌లు.. చాట్‌తోపాటు మెరుగైన భద్రతను అందిస్తుంది.
* వాట్సాప్‌లో ప్రస్తుతం అందిస్తున్న సెక్యూరిటీ ఫీచర్‌లతోపాటు వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు ఆటో డౌన్‌లోడ్ కాకుండా చూసుకోవాలి. దీంతోపాటు కొత్త నంబర్‌ల నుంచి వచ్చే ఫోటోలతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏదైనా అనుమానం కలిగితే వెంటనే ఆయా కాంటాక్ట్స్‌ను బ్లాక్ చేయడంతోపాటు ఫిర్యాదు చేయాలి.
* వాట్సాప్‌లో ఇటీవలే అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఫీచర్‌లను తీసుకొచ్చింది. దీని ద్వారా మరింత భద్రతను పొందవచ్చు. గత నెలలో ఈ ఫీచర్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం కొందరికి అందుబాటులోకి రాగా.. త్వరలో అందరికీ ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి అనుకూలంగా ఉంటుంది.
వాట్సాప్ అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ను యాక్టివేట్ చేసుకుంటే.. మీ చాట్‌ను వారు ఎక్స్‌పోర్ట్ చేయలేరు. మరియు మీరు పంపిన ఫోటోలు, వీడియోలను సేవ్ చేయలేరు. అయితే స్క్రీన్ షాట్‌లు తీసుకొనేందుకు అవకాశం ఉంటుందని తెలుస్తోంది.
ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలని భావిస్తుంటే.. వారి చాట్ లోకి వెళ్లాలి. అక్కడ అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఆప్షన్‌ను గుర్తించాలి. దాన్ని ఎనేబుల్ చేయాలి. ఫలితంగా మీ చాట్‌కు మరింత ప్రైవసీని జోడించినట్లు అవుతుంది. వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








