మీ స్మార్ట్‌ఫోన్‌ను స్పాం కాల్స్ బారినుండి కాపాడడం ఎలా?

|

మొబైల్ స్పామ్ కాల్స్ కొన్ని సంవత్సరాలుగా వినియోగదారులకు చిరాకుగా ఉన్నాయి, కానీ గత కొన్ని నెలల్లో, వీటి ద్వారా కొన్ని ఆర్ధిక ఉపద్రవాలు కూడా పొంచి ఉన్నట్లు అనుమానాలు రేగుతున్నాయి. అనేకమంది వినియోగదారులు రోజుకి కనీసం 4,5 స్పాంకాల్స్ ను ఎదుర్కుంటూ ఉన్నారు. వీటిని రోబోకాల్స్ గా కూడా పరిగణిస్తున్నారు, దీనికి కారణం ఈ కాల్స్ నమ్మదగిన లోకల్ నంబర్లతో స్పూఫ్ చేయబడి ఉండడమే. వినియోగదారులకు టాక్స్ భయాన్ని సృష్టించి కొన్ని స్పాంకాల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. నిజానికి ఈ పరిణామం ఆహ్వానించదగినది కాదు. ఈ స్కాం కాల్స్ వలలో కొద్ది మంది పడినా కూడా ఈ స్కామర్స్ నెల ఖర్చులకు సరిపోతుంది. కావున ఈ మోసాలకు పూనుకుంటున్నారు స్కామర్స్. ఫెడరల్ ట్రేడ్ కమీషన్ గత ఏడాదిలో ప్రతి నెలలో సుమారుగా 375,000 ఫిర్యాదులను అందుకుంది. ఈఏజెన్సీ ప్రకారం, స్కామర్స్ రోజురోజుకీ పెరిగిపోతున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి సొమ్ముచేసుకుoటున్నారు. దీనివలన దేశ ఆర్ధిక ప్రగతికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.

 

విధిని జయించిన వీరుడు ఏలియన్స్ మీద చెప్పిన ఆసక్తికర విషయాలువిధిని జయించిన వీరుడు ఏలియన్స్ మీద చెప్పిన ఆసక్తికర విషయాలు

ఈ స్పాం భాదితులు అయితే..

ఈ స్పాం భాదితులు అయితే..

ఒకవేళ మీరుకూడా ఈ స్పాం భాదితులు అయితే, రోజుకి ఇలా 4,5 స్పాం కాల్స్ బారిన పడుతూ ఉన్నట్లయితే ఇక్కడ పొందుపరచిన కొన్ని ఆప్షన్లను ఫాలో అవడంద్వారా ఆ కాల్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.మొదట వెరిజాన్అనే ఇంగ్లాండ్ మొబైల్ కారియర్ సంస్థ మాటల్లో కొన్ని మొబైల్ కారియర్స్ ఈ కాల్స్ ను ఎలా విభజించాయో తెలుసుకోవలసి ఉంటుంది.

 

రోబో కాలర్స్, స్పామర్స్, మోసపూరితమైన(fraud)కాల్స్

రోబో కాలర్స్, స్పామర్స్, మోసపూరితమైన(fraud)కాల్స్

రోబో కాలర్స్: ఇవి పూర్తిగాఆటోమేటెడ్. ముందుగానే రికార్డు చేయబడిన వాయిస్ ఉపయోగించి., ఈ కాల్స్ వస్తుంటాయి.
స్పామర్స్: పెద్ద సంఖ్యలో వినియోగదారులకు విచక్షణారహితంగా కాల్స్ చేసే అవాంఛిత కాలర్లు వీళ్ళు. కొన్ని సార్లు వీళ్ళు తమని కలవడానికి కూడా ప్రేరేపిస్తారు. తద్వారా ఎక్కువ మోసం చెయ్యవచ్చు అని.
మోసపూరితమైన(fraud)కాల్స్: లేని సంస్థను సృష్టించి, నమ్మబలికే కాలర్స్ వీళ్ళు.

 బ్లాక్ కాల్స్:
 

బ్లాక్ కాల్స్:

వచ్చిన ప్రతి స్పాం కాల్ ను బ్లాక్ చెయ్యడం ఒక పద్దతి. ఇది స్మార్ట్ ఫోన్ మీద ఆధారపడి ఉంటుంది. iOS స్మార్ట్ఫోన్ వాడే వారు రిసీవ్ కాల్స్ సెక్షన్ లో ఎంచుకున్న నంబర్ పైన బ్లూ కలర్ ఐకాన్ నొక్కడం ద్వారా ఆ నంబర్ ను బ్లాక్ చెయ్యొచ్చు. ఆండ్రాయిడ్ మొబైల్స్ లో కొన్ని మొబైల్స్ లో మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంది, చాలా మందికి ఈ ఆప్షన్ కనపడదు, వీరు వేరే ఇతర సాఫ్ట్వేర్ల పై ఆధారపడవలసి వస్తుంది. కాని పూర్తిగా నిరోధించడం అనేది ఈ పద్దతితో ఒక రకంగా జరగని పనే అవుతుంది.

మొబైల్ ప్రొవైడర్ల స్పాం బిజినెస్:

మొబైల్ ప్రొవైడర్ల స్పాం బిజినెస్:

కొన్ని మొబైల్ సంస్థలు ఈ స్పాం కాల్స్ ని కూడా బిజినెస్ చేసుకునే పనిలోపడ్డాయి. ఈపద్దతి మన దేశంలో లేకపోవడం మాత్రం మంచి పరిణామమే అని చెప్పవచ్చు. AT&T, sprint,వెరిజాన్ T-మొబైల్ వంటి వేరే దేశపు సంస్థలు ఈ స్పాం కాల్స్ ను నిరోధించడానికి నెలకు కొంతమొత్తం లో చార్జ్ చేస్తూ ఉంటాయి కూడా. వీటిలో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని సంస్థలు కేవలం పోస్ట్ పెయిడ్ యూసర్స్ వరకే ఈ ఆప్షన్ ఇస్తే, కొన్ని సంస్థలు కేవలం 5 నంబర్లను మాత్రమే బ్లాక్ చేసే వీలు కల్పిస్తున్నాయి. దీనికారణంగా వినియోగదారులు మొదటి పద్దతి పైనే ఎక్కువ ఆధారపడుతున్నారు.

 

 

వేరే అప్లికేషన్స్ ఉపయోగించి మీ ప్రైవసీని కాపాడుకోండి:

వేరే అప్లికేషన్స్ ఉపయోగించి మీ ప్రైవసీని కాపాడుకోండి:

అదృష్టవశాత్తు ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్లలో ఉన్న కొన్ని అప్లికేషన్స్, ఈ స్పాం కాల్స్ ను సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతున్నాయి . కొన్ని antivirus సంస్థలు సైతం ఈ స్పాం కాల్స్ విషయంలో ప్రత్యెక ఫీచర్లను పొందుపరస్తున్నాయి. వీటిలో ROBO Killer, true caller , Hiya లాంటి అప్లికేషన్లు ప్రముఖమైనవి. దీనిలో true caller అనేకమంది వినియోగదారుల అభిమానాన్ని పొందింది. ఈ అప్లికేషన్ కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడే ముందుగానే గుర్తు చేసి ఆ కాల్స్ ని నిరోధించగలదు. ఇది ఫ్రీగానే లభిస్తుంది.

ప్రత్యేకమైన మొబైల్స్ కొనడం ద్వారా:

ప్రత్యేకమైన మొబైల్స్ కొనడం ద్వారా:

గూగుల్, సంసుంగ్ వంటి కంపెనీలు వినియోగదారుల భద్రతకు పెద్ద పీట వేశాయి. ఇలాంటి కంపెనీలనుంది వచ్చే ఫోన్స్ లో స్పాం కాల్స్ నిరోధించే ఫీచర్ని పొందుపరచి ఉండడం సహజం. కావున మొబైల్ ఎంపిక విషయంలో తెలివిని ప్రదర్శించాల్సి వస్తుంది.

DND రిజిస్టర్ చేసుకోండి:

DND రిజిస్టర్ చేసుకోండి:

మనదేశంలో అన్నిరకాల మొబైల్ ప్రొవైడర్స్ ఈ ఆప్షన్ ని అందుబాటులో ఉంచారు. మన నంబర్ ని DND(do not disturb) లో రిజిస్టర్ చేసుకోవడం ద్వారా ఈ స్పాం కాల్స్ నుండి 90 శాతం వరకు తప్పించుకోగలరు. దీనికి ఆయా నెట్వర్క్ అప్లికేషన్ల నుండి కాని START DND or START 0 అని 1909 కి మెసేజ్ పంపడం ద్వారా కాని DND లో నంబర్ రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదా 1909 కి కాల్ చేయడం ద్వారా అయినా రిజిస్టర్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
How to stop annoying robocalls on your iPhone or Android phone More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X