ఫేస్‌బుక్ మీ డేటాను లీక్ చేస్తోందా..? కట్టడి చేయండిలా

Posted By: BOMMU SIVANJANEYULU

వినియోగదారుల వ్యక్తిగత డేటాను ఫేస్‌బుక్ దుర్వినియోగ పరుస్తుందంటూ ఆరోపణలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ఈ సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకుంటోన్న అనేక మంది యూజర్లు ఆత్మరక్షణలో పడ్డట్లు తెలుస్తోంది. వాణిజ్య ప్రకటనల ద్వారా ఆదాయాన్ని అర్జించే క్రమంలో యూజర్ల డేటాను థర్డ్ పార్టీ యాప్స్‌కు ఫేస్‌బుక్ విక్రయిస్తోందన్న వార్తలు ఇంటర్నెట్‌లో విస్తృతంగా హల్‌చల్ చేస్తున్నాయి.ఈ నేపథ్యంలో చాలా మంది యూజర్లు తమ ఫేస్‌బుక్ ఖాతాలను తొలిగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలా చేయకుండా పలు సెట్టింగ్స్‌ను మాడిఫై చేసుకున్నట్లయితే ఫేస్‌బుక్‌ను మరింత కంట్రోల్డ్‌గా వినియోగించుకునే వీలుంటుంది. అంతేకాకుండా, థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫేస్‌బుక్ డేటాను ఎంత వరకు వినియోగించుకోవాలా కూడా లిమిట్‌ను సెట్ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణా ప్రభుత్వంపై తప్పుడు పోస్టులు, Facebook గ్రూపు అడ్మిన్ అరెస్ట్

ఫేస్‌బుక్ మీ డేటాను లీక్ చేస్తోందా..? కట్టడి చేయండిలా

డిసేబుల్ ప్లాట్‌ఫామ్ పై క్లిక్ చేసినట్లయితే...
ముందుగా మీ డెస్క్‌టాప్ లేదా మొబైల్ నుంచి ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లి యాప్స్, వెబ్‌సైట్స్, ప్లగిన్స్ క్రింద ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి డిసేబుల్ ప్లాట్‌ఫామ్ పై క్లిక్ చేసినట్లయితే థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫేస్‌బుక్ డేటాను తీసుకోవటం మానేస్తాయి.

ఆండ్రాయిడ్ యూజర్లు..
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను వినియోగించుకుంటున్నట్లయితే యాప్ టాప్ రైట్‌లో కనిపించే మూడు హారిజంటల్ లైన్స్ పై క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ విభాగంలోకి వెళ్లి అకౌంట్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. అకౌంట్ సెట్టింగ్స్ ఓపెన్ అయిన తరువాత యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని ప్లాట్‌ఫామ్ ఆప్షన్ పై టాప్ ఇవ్వండి. ఇప్పుడు ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్లాట్‌ఫామ్‌ను డిసేబుల్ చేసినట్లయితే థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫేస్‌బుక్ డేటాను తీసుకోవటం మానేస్తాయి.

ఫేస్‌బుక్ మీ డేటాను లీక్ చేస్తోందా..? కట్టడి చేయండిలా

ఐఫోన్ యూజర్లు ఇలా చేయండి..
మీరు యాపిల్ ఐఫోన్‌లో ఫేస్‌బుక్ యాప్‌ను వినియోగించుకుంటున్నట్లయితే యాప్ టాప్ రైట్‌లో కనిపించే మూడు హారిజంటల్ లైన్స్ పై క్లిక్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వాటిలో సెట్టింగ్స్ యాప్‌ను సెలక్ట్ చేసుకుని అకౌంట్ సెట్టింగ్స్‌లోకి వెళ్లిండి. అకౌంట్ సెట్టింగ్స్ విభాగంలో యాప్స్‌ను సెలక్ట్ చేసుకుని ప్లాట్‌ఫామ్ ఆప్షన్ పై టాప్ ఇవ్వండి. ఇప్పుడు ఎటిట్ ఆప్షన్ పై క్లిక్ చేసి ప్లాట్‌ఫామ్‌ను డిసేబుల్ చేసినట్లయితే థర్డ్ పార్టీ యాప్స్ మీ ఫేస్‌బుక్ డేటాను తీసుకోవటం మానేస్తాయి.

అడ్వర్టైజర్స్‌కు షేర్ అయ్యే సమాచారానికి లిమిట్ పెట్టాలనుకుంటున్నట్లయితే..
మీ అకౌంట్ నుంచి ఫేస్‌బుక్ అడ్వర్టైజర్స్‌కు షేర్ అయ్యే సమాచారానికి ఓ లిమిట్‌ను సెట్ చేయాలనుకుంటున్నట్లయితే ఈ క్రింద ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి.. ముందుగా ఫేస్‌బుక్ యాడ్ సెట్టింగ్స్ పేజీలోకి వెళ్లి యాడ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేయండి. యాడ్ సెట్టింగ్స్ పై క్లిక్ చేసిన తరువాత Ads based on my use of websites and apps ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.

English summary
After the Cambridge Analytica exposé, Facebook’s use of your personal data to make money is in the spotlight.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot