ఫేస్‌బుక్‌లో యాడ్స్‌ని కంట్రోల్ చేయడమెలా..?

Written By:

మీకు తెలుసా మీరు ఫేస్‌బుక్‌లో చేసే బ్రౌజింగ్ హిస్టరీతో అడ్వర్టైజ్‌మెంట్లకు యాడ్ రూపంలో ఆదాయం వస్తుందని.. నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం..మీరు సెర్చ్ చేసిన వెబ్‌సైట్ డాటా నుంచి యాడ్స్ రూపంలో ఫేస్‌బుక్‌కి ఆదాయం కూడా వస్తూ ఉంటుంది. మీరు మీ ఫేస్‌బుక్ సెట్టింగ్స్‌లో కెళ్లి Advets మీద మీరు క్లిక్ చేస్తే మీకు దీని గురించిన సమాచారం దొరుకుతుంది. మీరు ఇటువంటి యాడ్స్‌ని కంట్రోల్ చేసుకోవాలంటే మీకు కొన్ని సూచనలు ఇస్తున్నాం చూడండి.

Read more: కీ బోర్డ్‌లో లైను గురించి తెలుసా:విండో బటన్‌తో ఏం చేయొచ్చు!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫేస్‌బుక్‌లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు

1

మీరు ఫేస్‌బుక్‌లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు ఇలా ఓ ఆప్సన్ వస్తుంది. అందులో ఉన్న ఆప్సన్ మీద మీరు క్లిక్ చేసి ఓ సారి దాన్ని చదివితే యాడ్ గురించి మీకు అర్థమవుతుంది.

యాడ్ బ్లాకర్ ప్లస్ అనే ఆప్సన్ ద్వారా

2

మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీకి సంబంధించిన యాడ్ గురించిన సమాచారం తెలుసుకోవాలంటే యాడ్ బ్లాకర్ ప్లస్ అనే ఆప్సన్ ద్వారా తెలుసుకోవచ్చు.ఇందులో మీకు యాడ్ గురించిన కంపెనీల సమస్త సమాచారం ఉంటుంది.

ఫేస్‌బుక్ ఐఎన్సీని సెలక్ట్

3

అక్కడ మీరు Companies Customizing Ads for Your Browser ను సెలక్ట్ చేసుకుంటే మీకు ఈవిధంగా ఆప్సన్ కనిపిస్తుంది. అందులో ఫేస్‌బుక్ ఐఎన్సీని సెలక్ట్ చేసుకోవాలి.

సెర్చింగ్ హిస్టరీకి యాడ్స్ వద్దనుకుంటే

4

మీరు మీ సెర్చింగ్ హిస్టరీకి యాడ్స్ వద్దనుకుంటే మీరు అందులో సూచనల ద్వారా తొలగించుకోవచ్చు..

Advets దాని మీద క్లిక్ చేస్తే

5

ఇక మీరు ఫేస్‌బుక్‌లో సెట్టింగ్స్ లో కెళ్లి అక్కడ Advets దాని మీద క్లిక్ చేస్తే మీకు మూడు ఆప్సన్స్ వస్తాయి.

మొదటి దాని మీద క్లిక్ చేసి

6

అందులో మొదటి దాని మీద క్లిక్ చేసి మీరు ఆప్ అని పెట్టుకుంటే మీ హిస్టరీకి సంబంధించి మీకు ఎటువంటి యాడ్స్ కనిపించవు.

ఐఓఎస్ యూజర్స్ అయితే

7

మొబైల్‌లో గూగుల్ వినియోగించే వారికి కూడా ఈ ఆప్సన్ అందుబాటులో ఉంది. ఐఓఎస్ యూజర్స్ అయితే సెట్టింగ్ లో కెళ్లి General>Restrictions>Advertising ని సెలక్ట్ చేసుకుని యాడ్ ట్రాకింగ్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లయితే

8

అలాగే ఆండ్రాయిడ్ యూజర్లయితే సెట్టింగ్స్ లో కెళ్లి Google Settings>Ads>Opt Out of Interest-Based Ads ద్వారా యాడ్ ట్రాకింగ్ ని కంట్రోల్ చేయవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to Stop Facebook From Using Your Browsing History for targeted ads
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting