మీ ఫోన్‌లో మెసెంజర్‌ ఫోటోలు సేవ్ అవుతున్నాయా, ఇలా ఆఫ్ చేసేయండి ( సింపుల్ టిక్స్ )

Written By:

అత్యధిక మంది యూజర్లను కలిగి ఉన్న యాప్స్‌లలో ఫేస్‌బుక్ మెసెంజర్ ఒకటి. ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకునే వారి సంఖ్య 700 మిలియన్లు కంటే ఎక్కువగానే ఉంది. ఫేస్‌బుక్ అందిస్తోన్న ఈ అత్యుత్తమ మెసెంజర్ యాప్‌లో చాటింగ్ మాత్రమే కాదు బోలెడన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఒక్కోసారి మెసెంజర్ విసుగు తెప్పిస్తూ ఉంటుంది. మన ఫోన్ స్పేస్ తినేస్తూ ఉంటుంది. ఇన్‌బాక్స్‌లో నుంచి వచ్చే ఫోటోలతో ఫోన్ నిండిపోతుంది. అయితే దీనికి పుల్‌స్టాప్ పెట్టేయవచ్చు. అది ఎలాగో చూద్దాం.

ఆండ్రాయిడ్ ఫోన్లలో తెలుగు టైప్ చేయడం ఎలా ? ( సింపుల్ ట్రిక్స్ )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్రిక్ 1

ముందుగా మీరు మీ మెసేంజర్ ఓపెన్ చేయాలి. అందులో మీ ప్రొఫైల్ పిక్చర్ దగ్గర క్లిక్ చేస్తే మీకు కొన్ని రకాల ఆప్సన్స్ కనిపిస్తాయి. ఆ ఆప్సన్ ద్వారా మీరు మెసేంజర్ లో వచ్చే ఫోటోలకు చెక్ పెట్టేయవచ్చు.

ట్రిక్ 2

మీ ప్రొపైల్ పిక్చర్ ట్యాప్ చేయగానే మీకు కనిపించే ఆప్సన్లలో ఫోటో మీడియా అనే ఆప్సన్ సెలక్ట్ చేసుకోండి. దాన్ని ట్యాప్ చేయగానే మీకు నాలుగు రకాల ఆప్సన్లు కనిపిస్తాయి. Save photos, save on capture, open links , emoji కనిపిస్తాయి.

ట్రిక్ 3

వీటిని ఆఫ్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్లో ఈ ఫోటోలను సేవ్ కాకుండా చేసుకోవచ్చు. వీటిల్లో ఎమోజీ అనే బటన్ ట్యాప్ చేయడం ద్వారా మీకు నచ్చిన ఎమోజీని రిప్లయి ఇచ్చేలా సెట్ చేసుకోవచ్చు.

ట్రిక్ 4

అలాగే అక్కడ మీకు మరో ఆప్సన్ Chat heads కనిపిస్తుంది. దీన్ని ఆఫ్ చేయడం ద్వారా మీరు ఛాటింగ్ ఆఫ్ చేసినట్లుగా కనిపిస్తుంది. ఆన్ లైన్ లో ఉన్నా కాని లేనట్లుగా మీ స్నేహితులకి చూపిస్తుంది.

ట్రిక్ 5

మీరు తరచూ ఒకే గ్రూప్‌తో చాట్ చేస్తుంటారా..? అయితే, మీరు ఆ గ్రూప్‌ను పిన్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా మెసెజ్ వచ్చిన ప్రతిసారి ఆ మెసెజ్‌ను వెతుక్కోవల్సిన అవసరం ఉండదు. మీ కళ్ల ముందే కనిపిస్తుంది. మెసెంజర్ యాప్‌లో మీకు నచ్చిన గ్రూప్ చాట్‌ను పిన్ చేయదలిచినట్లయితే యాప్ బాటమ్‌లో కనిపించే గ్రూప్ బటన్ పై టాప్ చేయండి. ఇప్పుడు మీకు యాప్ ఎడమ వైపు టాప్
కార్నర్‌లో Pin button కనిపిస్తుంది.

ట్రిక్ 6

మెసెంజర్ యాప్‌లో ఏదైనా conversationను మ్యూట్ చేయదలిచినట్లయితే ఆ మెసెజ్ హెడర్ పై టాప్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కనిపిస్తాయి, వాటిలో మీరు conversation ఎంత సేపటి వరకు మ్యూట్ చేయాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకోవచ్చు.

ట్రిక్ 7

ప్రత్యేకమైన యానిమేటెడ్ స్టఫ్‌ను అందించే Giphy, GIF keyboard వంటి యాప్స్ మెసెంజర్‌‍లో అందుబాటులో ఉన్నాయి. వీటిని యాక్సెస్ చేసుకోవటం ద్వారా ప్రత్యేకమైన జిఫ్ ఫైల్స్ ను షేర్ మీరు చేయవచ్చు.ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ ద్వారా మీ లోకేషన్‌ను షేర్ చేసుకోవచ్చు.

ట్రిక్ 8

మెసెంజర్ యాప్ చాటింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కాని అది పొరపాటు, ఈ యాప్ ద్వారా ఇంటర్నెట్ సహాయంతో ఉచిత వాయిస్ ఇంకా వీడియో కాల్స్‌ను చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యూజర్లకి చాలా బాగా ఉపయోగపడుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to stop pictures from messenger saving to your phone More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot