ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో మీ లొకేషన్ ని గూగుల్ ట్రాకింగ్‌ చేయకుండా ఆపడం ఎలా?

|

స్మార్ట్‌ఫోన్ వినియోగం ప్రస్తుత రోజులలో సర్వసాధారణం అయింది. స్మార్ట్‌ఫోన్ యొక్క అనేక ఉపయోగాలలో లొకేషన్ షేరింగ్ కూడా ఒకటి. అయితే గోప్యత విషయంలో ఈ లొకేషన్ ట్రాకింగ్ అనేది ఒక పెద్ద ఆందోళనను కలిగిస్తుంది. గూగుల్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేయడం మరియు హిస్టరీని సేవ్ చేయడం వంటివి చేస్తున్నది. చాలా మంది వినియోగదారులు టెక్ దిగ్గజం యొక్క ఈ చర్యని పట్టించుకోనప్పటికీ యూజర్ల యొక్క ప్రైవేట్ సమాచారంను మరొకరు తెలుసుకోవడం అనేది ఎవరికి కూడా మింగుడు పడని విషయం. మీరు కూడా ఇలాంటి సమూహంలో భాగమైతే కనుక మీ లొకేషన్ ని ట్రాక్ చేయకుండా గూగుల్ లేదా యాదృచ్ఛిక యాప్‌లను ఆపడానికి అనుసరించవలసిన విధానాలను గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో మీ లొకేషన్ ని ట్రాకింగ్‌ చేయకుండా ఆపడం ఎలా?

ఆండ్రాయిడ్‌లో లొకేషన్ ట్రాకింగ్‌ని డిసేబుల్ చేసే విధానం

మీరు ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్ ను వినియోగిస్తుంటే కనుక గూగుల్ కోసం లొకేషన్ ట్రాకింగ్‌ను ఆఫ్ చేయడానికి కింద ఉన్న దశలను అనుసరించండి.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో మీ లొకేషన్ ని ట్రాకింగ్‌ చేయకుండా ఆపడం ఎలా?

** మీ యొక్క ఆండ్రాయిడ్‌ ఫోన్ లో హోమ్ స్క్రీన్‌కి వెళ్లి క్రిందికి స్వైప్ చేయడంతో క్విక్ సెట్టింగ్‌ల మెను ఓపెన్ అవుతుంది.

** లొకేషన్ చిహ్నాన్ని ఎక్కువసేపు నొక్కడంతో లొకేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. దానిపై ఒకసారి నొక్కడం ద్వారా అది ఓపెన్ అవుతుంది.

** లేదా మీరు హోమ్ స్క్రీన్‌పై క్రిందికి స్వైప్ చేయండి లేదా సెట్టింగ్‌ల చిహ్నంపై నొక్కండి. తరువాత మీరు లొకేషన్ పేజీకి వెళ్లడానికి "లొకేషన్" ఎంపిక కోసం సెర్చ్ చేయవచ్చు.

** మీరు లొకేషన్ పేజీకి చేరుకున్న తర్వాత "యూస్ లొకేషన్" ఎంపిక యొక్క టోగుల్‌ను ఆఫ్ చేయండి.

ఈ పేజీలో మీరు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఉబర్, కెమెరా, గూగుల్ పే వంటి యాప్‌ల జాబితాను కూడా చూస్తారు. మీ లొకేషన్‌ను ట్రాక్ చేయాలా వద్ద అన్న దాన్ని ట్రాక్ చేయడానికి మీ అనుమతి కావాలి. మీరు మీ కోరిక మేరకు టోగుల్‌లను ఆన్ మరియు ఆఫ్ చేయవచ్చు.

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లో మీ లొకేషన్ ని ట్రాకింగ్‌ చేయకుండా ఆపడం ఎలా?

గూగుల్ ఇప్పుడు మీ యొక్క చివరి 15 నిమిషాల సెర్చ్ హిస్టరీను త్వరగా తొలగించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ వినియోగదారులందరికీ ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది. ఈ ఫంక్షనాలిటీని ఉపయోగించడానికి మీరు చేయాల్సిందల్లా గూగుల్ ఆండ్రాయిడ్ యాప్‌ని ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ ఫోటో మీద నొక్కండి. తరువాత "చివరి 15 నిమిషాలను తొలగించు" ఎంపిక కోసం చూడండి. ఈ ఫంక్షనాలిటీతో మీరు కొన్ని ట్యాప్‌లతో మీ ఇటీవలి సెర్చ్ హిస్టరీను సులభంగా తొలగించవచ్చు.

Best Mobiles in India

English summary
How to Stop Tracking Your Location on an Android Smartphone?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X