Whatsapp Groups మీకు తెలియని వ్యక్తులు మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి..?
వాట్సాప్ (Whatsapp) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేంజర్‌లలో ఒకటిగా ఉంది. భారత్‌లోనూ భారీగా యూజర్లు ఉన్నారు. భారత్‌లో సుమారు 50 కోట్లకు పైగా వినియోగిస్తున్నారు. అయితే భారీ స్థాయిలో ఉన్న యూజర్ల కోసం వాట్సాప్ అనేక మెరుగైన సౌకర్యాలు, మెరుగైన భద్రతా ఫీచర్‌లను అందిస్తోంది. ఇటీవల వాట్సాప్ ఇంటర్‌ఫేస్‌లోనూ మార్పులు చేసింది. దీంతోపాటు ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను తీసుకొస్తోంది.
ఎంతో ఉపయోగం :
వాట్సాప్ నుంచి గత సంవత్సరం ఛానల్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినా.. గ్రూప్ ఫీచర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో పాటు ఇతర అనేక గ్రూప్స్‌లో సభ్యులుగా ఉంటాం. దీంతోపాటు ఆఫీస్‌కు సంబంధించిన గ్రూప్స్‌లోనూ జాయిన్ అవుతాం. ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా అనేక మందితో చాటింగ్ సహా ఫోటో, వీడియోలను షేరింగ్ చేసుకోవచ్చు.

ఇలాంటి కారణాలతో :
అయితే ఇటీవల కాలంలో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. ఇందుకు వాట్సాప్, టెలికాం వంటి గ్రూప్స్, ఛానల్స్‌ను ఉపయోగించుకుంటున్నారు. దీంతో అనేక మంది బాధితులుగా మారిపోతున్నారు.
వాట్సాప్‌లో ఇప్పటికే అనేక భద్రతా ఫీచర్‌లు ఉన్నాయి. కొన్ని సెట్టింగ్స్‌లో మార్పులు చేసుకోవడం వల్ల ఎప్పుడూ సురక్షితంగా ఉండవచ్చు. మీ ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో లేని వ్యక్తులు వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయకుండా నియంత్రించేలా వాట్సాప్‌లో ప్రత్యేక ఫీచర్ ఉంది. ఈ సెట్టింగ్స్‌లో మార్పులు చేస్తే.. కొత్త వ్యక్తులు మీ అనుమతి లేకుండా వాట్సాప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయలేరు.
ఆండ్రాయిడ్, iOS యూజర్లకు అందుబాటులో ఉంది :
వాట్సాప్‌లో ఈ ఫీచర్ ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, iOS యూజర్లు కూడా ఈ సెట్టింగ్స్‌ను ఉపయోగించుకొని, వాట్సాప్‌ను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. అయితే సెట్టింగ్స్‌లో ఎలాంటి మార్పులు చేయాలి. పూర్తి వివరాలు.
- వాట్సాప్‌ను ఓపెన్ చేయాలి.
- ఆండ్రాయిడ్, iOS యూజర్లు సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది.
- అనంతరం ప్రైవసీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత కిందకు స్క్రోల్ చేయాలి.
- అక్కడ మీకు Groups అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అక్కడ మీకు Everyone, My Contacts, My Contacts Except అనే మూడు ఆప్షన్‌లు కనిపిస్తాయి
Everyone - అంటే ఎవరు అయినా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేయవచ్చు.
My Contacts - అంటే మీ ఫోన్‌లో ఉన్న కాంటాక్ట్స్ మాత్రమే వాట్సాప్ గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయవచ్చు.
My Contacts Except : అంటే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో ఎవరు యాడ్ చేయకూడదో ఎంచుకోవచ్చు.
- ఇందులో మీకు నచ్చిన ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
ఈ మూడు ఆప్షన్‌ల ద్వారా వాట్సాప్ గ్రూప్స్‌లో మిమ్మల్ని యాడ్ చేయలేరు. అయితే కొత్త వ్యక్తులు యాడ్ చేయాలంటే మీకు ప్రత్యేకంగా లింక్ పంపాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఆ వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ కావాలో.. వద్దో నిర్ణయం తీసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








