Home
How to

మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ..? ( సింపుల్ టిక్స్ )

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ రాజ్యమేలుతోంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఇవి మరీ ఊపందుకున్నాయి.

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు అనేవి కామన్ అయిపోయాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ రాజ్యమేలుతోంది. సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఇవి మరీ ఊపందుకున్నాయి. పొద్దున లేస్తే వాట్సప్ , ఫేస్ బుక్, ట్విట్టర్ వీటితోనే టైం పాస్ చేస్తున్నారు. టైంపాస్ వరకు బాగానే ఉంది కాని ఫోన్ ఛార్జింగ్ అనేది చాలా సమస్యగా మారిన విషయం అందరూ గమనించే ఉంటారు. అదీగాక ఫోన్లు ఛార్జింగ్ పెట్టగానే పేలిపోతున్నాయి ఈ మధ్య. మరి ఈ రోజు మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై కొన్ని సింపుల్ ట్రిక్స్ ఇస్తున్నాం..ఓ లుక్కేయండి.

 96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా..

96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా..

ఎప్పుడైనా ఛార్జింగ్ 96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. 20 శాతం కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి. అలాగే మొబైల్‌కి పౌచ్ ఉంటే తీసేసి ఛార్జింగ్ పెట్టాలి.

ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే..

ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే..

మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే 5 లేదా 10 నిమిషాల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టాలి. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్‌ చేసి చల్లబడ్డాక ఆన్ చేయాలి.

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు..

ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు..

మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వైఫై, హాట్ స్పాట్, సాంగ్స్, నెట్, కాల్స్, గేమ్స్ పొరపాటున కూడా వాడకూడదు. మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే వీడియో కాల్, హెవీ గేమ్స్ ఆడకూడదు. ఛార్జింగ్ అయిన తరువాత మొబైల్ హీట్ అయితే 5 నిమిషాల వరకు మొబైల్‌ని పట్టుకోకూడదు.

అవసరం లేని అప్లికేషన్స్ ..

అవసరం లేని అప్లికేషన్స్ ..

మీకు అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే మొబైల్ ఫోన్స్ నుంచి తీసెయ్యాలి. కొన్ని గేమ్స్, అప్లికేషన్స్ వల్ల మొబైల్ విపరీతంగా హీట్‌ అవుతుంది. వాటిని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేసెయ్యాలి.

 100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను..

100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను..

మొబైల్‌కి వచ్చిన ఛార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ ఛార్జర్‌ని కొనుక్కుని వాడాలి. 100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను వాడకూడదు. మీ మొబైల్ బ్యాటరీ అయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరి తీసుకొని మార్చాలి.

ప్యాంట్ జేబులో..

ప్యాంట్ జేబులో..

ప్యాంట్ జేబులో కూడా పెట్టుకోకూడదు. మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్‌లో మొబైల్‌ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఉంది.

ఛార్జింగ్ పెట్టి..

ఛార్జింగ్ పెట్టి..

కొంతమంది ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్‌లో సాంగ్స్ వింటుంటారు. అలా చేయడం వల్ల చాలా రిస్క్. ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పటికే కొంతమంది చనిపోయారు.

Best Mobiles in India

English summary
6 tips to avoid damage to battery while charging phone Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X