పాన్‌కార్డ్‌ పొందడం మరింత తేలిక

Written By:

మీరు పాన్ కార్డ్ కి అప్లయి చేయాలనుకుంటున్నారా..అయితే ఎలా అప్లయి చేయాలో తెలియడం లేదా..ఇప్పుడు మీ దగ్గర ఇంటర్నెట్ ఉంటే చాలు మీరు పాన్ కార్డుకు అప్లయి చేయవచ్చు. పాన్ కార్డ్ అప్లయి చేయడానికి వెళ్లే ముందు మీరు కొన్ని గుర్తింపు కార్డులు మీదగ్గర పెట్టుకోవాలి. ఐడెంటిటీ ఫ్రూఫ్స్, అడ్రస్ ప్రూఫ్, అలాగే పుట్టిన రోజును తెలిపే గుర్తింపు పత్రం, ఫోటోలు ఈ పత్రాలు మీ దగ్గర పెట్టుకుని మీరే పాన్ కార్డుకు ఆన్‌లైన్‌లో అప్లయి చేయవచ్చు. ఎలా అప్లయి చేయాలో చూద్దాం.

Read more : ఆధార్ కార్డు మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీరు ముందుగా సైట్ లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. అందుకోసం ఈ సైట్ లాగిన్ మీద క్లిక్ చేయండి.

స్టెప్ 12

అక్కడ చివర్లో ఉన్న ఇండివడ్యువల్ దగ్గర అప్లయి పాన్ కార్డ్ అని ఆప్సన్ మీద క్లిక్ చేసి దాన్ని సెలక్ట్ చేసుకోవాలి. మీకు అప్లికేషన్ ఇలా దర్శనమిస్తుంది.

స్టెప్ 3

ఇక్కడ నుంచి మీరు అప్లికేషన్ ఫాం జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏమైనా డౌట్లు వచ్చినప్పుడు ఈ లింక్ లో ఓ సారి చెక్ చేసుకుని జాగ్రత్తగా అప్లయి చేయండి.

 

 

స్టెప్ 4

ఫస్ట్ మీకు ఏఓ కోడ్ కనిపిస్తుంది .అందుకోసం ఈ కింది లింక్ లో ఉన్న సూచనలు ఫాలో అవ్వండి. లేకుంటే హెల్ప్ లైన్ 18001801961 కు కాల్ చేయండి.

స్టెప్ 5

ఆ తరువాత మీరు అక్కడ ఉన్న నంబర్లలో మీ వివరాలను నమోదు చేసుకుంటూ వెళ్లండి.మొత్తం 15 నంబర్ల వరకు మీ వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.

స్టెప్ 6

వివరాలన్నీ నమోదైన తరువాత అక్కడ మీకు ఫీజు గురించిన సమాచారం ఉంటుంది. మాములు ఫీజు 105 రూపాయలు. అదనంగా బ్యాంకు ఛార్జీలు ఉండవచ్చు. మీరు విదేశాల్లో ఉన్నట్లయితే మీకు అక్కడికి పంపాలంటే మాత్రం 971 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

స్టెప్ 7

అంతా అయిపోయిన తరువాత సబ్ మిట్ ఆప్సన్ మీద క్లిక్ చేయాలి. అన్ని చెక్ చేసుకోండని చెబుతూ మళ్లీ మీకు కనఫర్మ్ ఆప్సన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే అగ్రి అంటూ ఓ పేజీ ప్రత్యక్షమవుతుంది. అంటే ఇది పేమెంట్ కి సంబంధించిన వివరాలను అడుగుతుంది. అది అయిపోగానే మీకు కంప్లీట్ ది పేమెంట్ అనే ఆప్సన్ వస్తుంది.

స్టెప్ 8

ఇప్పుడు మీకు 15 డిజిట్ అక్నాలెడ్జెమెంట్ నంబర్లతో కూడిన ఫారం మీకు వస్తుంది. అది ప్రింట్ తీసుకుని దానిపై రెండు ఫోటోలు అంటించి సంతకాలు చేస్తే అప్లికేషన్ పని పూర్తి అయిపోయినట్లే.

స్టెప్ 9

దీనికి మీరు పేమెంట్ ఎలాచేశారో ( డిడి, చెక్, ) దానికి సంబంధించిన డాక్యుమెంట్లు జతపరిచి ఓ ఎన్వలప్ కవర్ లో వాటిని పెట్టి పాన్ కార్డు ప్రధాన కేంద్రానికి పంపిస్తే మీకు 15 రోజుల్లో కార్డు వస్తుంది.

స్టెప్ 10

మీరు ఎన్వలప్ కవర్ పైన APPLICATION FOR PAN అని రాసి 15 డిజిట్ అక్నాలెడ్జెమెంట్ నంబర్లను రాయడం మర్చిపోకండి. మీరు పోస్ట్ చేయాల్సిన అడ్రస్ NSDL at Income Tax PAN Services Unit, NSDL e-Governance Infrastructure Limited, 5th floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411016.

స్టెప్ 11

వారికి అది చేరిన దగ్గర నుంచి 15 రోజుల్లో మీరు పంపిన అడ్రస్ కు మీ పాన్ కార్డును పంపిస్తారు. అ లోపల మీరు మీ అప్లికేషన్ యెక్క స్టేటస్ ను తెలుసుకోవాలనుకుంటే 02027218080 ఈ నంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు.లేదంటే నేరుగా చెక్ చేసుకోవచ్చు. 

12

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write How to Submit PAN Card Application Online
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot