కొత్త ఫోన్ కోనుగోలు చేశారా, పాత ఫోన్ డేటా సంగతేంటి ?

|

మీరు కొత్తగా ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారా..అయితే ఇక్కడ మనకు ఓ తలనొప్పి వస్తూ ఉంటుంది. కొత్త ఫోన్ కొన్న తరువాత పాత ఫోన్ లోని డేటాను దానిలోకి ట్రాన్సఫర్ చేయాలంటే ఒక్కోసారి తలపట్టుకవాల్సి రావచ్చు.యాప్స్, గేమ్స్, అలాగే ముఖ్యమైన సమాచారం, కాంటాక్ట్స్, మేసేజ్ ఇలాంటివి కొత్త ఫోన్లోకి ఎలా పంపుకోవాలో చాలామందికి తెలియక ఇబ్బందులు పడుతుంటారు. ఇందులో ముఖ్యంగా గేమ్స్ అంటే చాలా మంది పడి చస్తుంటారు వారు పాత ఫోన్లోని గేమ్ డేటా కొత్త ఫోన్లోకి ఎక్కించుకునేందుకు దారిని వెతుకుతుంటారు. ఎందుకంటే గేమ్ మళ్లీ ఇన్ స్టాల్ చేస్తే పాత ఫోన్ డేటా సమాచారం అంతా ఎగిరిపోతుంది. అలా కాకుండా దీనికి కొన్ని దారులు ఉన్నాయి. అవేంటో ఓ సారి చూద్దాం..

 

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీని ఆదా చేసుకోవడం ఎలా, గూగుల్ చెప్పిన ట్రిక్స్

మెథడ్ 1 : గూగుల్

మెథడ్ 1 : గూగుల్

గూగుల్ ఈ మధ్య గూగుల్ ప్లే గేమ్స్ యాప్ లాంచ్ చేసింది. మీరు మీ జీమెయిల్ అకౌంటుతో లాగిన్ అయినట్లయితే మీ గేమ్ డేటా ఎక్కడికి పోకుండా ఉంటుంది. పాత ఫోన్లో ఐ అకౌంటుతో అయితే లాగిన్ అయ్యారో కొత్త ఫోన్లో కూడా అదే అకౌంటుతో లాగిన్ అయి గేమ్ యాప్ ని sync చేస్తే మీ గేమ్ డేటా మొత్తం ఎక్కడికీ పోదు.

మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి....

మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి....

మీరు మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఆ గేమ్ డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఆండ్రాయిడ్ గేమ్స్ మీ ఫోన్లో నిక్షిప్తమై ఉంటాయి. ఆ గేమ్ మీరు ఓపెన్ చేయగానే ఆటోమేటిగ్గా మీ అకౌంటు లాగిన్ వివరాలు అడుగుతుంది. పాత అకౌంట్ లాగిన్ వివరాలు ఇస్తే మీ డేటా చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది.ఇది కుదరకపోతే మాన్యువల్ గా మీరు మీ వివరాలతో లాగిన్ అయి సెట్ చేసుకోవచ్చు. అనేక రకాలైన గేమ్స్ గూగుల్ క్లౌడ్ ద్వారా వేరే డివైస్ లోకి sync చేసుకునే అవకాశం ఉంది.

Method 2: The social media way
 

Method 2: The social media way

ఇక మరో ఆప్సన్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా లాగిన్ కావడం. యూజర్లు ఏదైనా గేమ్ లోకి లాగిన్ కావాలంటే మీ జీమెయిల్ కాని , ఫేస్ బుక్ అకౌంట్ కాని యూజ్ చేసి లాగిన్ కావచ్చు. మీరు మీ కొత్త ఫోన్లోకి గేమ్ డేటాని కావాలనుకున్నప్పుడు అదే అకౌంటుతో లాగిన్ అయి sync చేస్తే మీ డేటా మొత్తం మళ్లీ రికవరీ అవుతుంది. మీ కొత్త ఫోన్ లోకి గేమ్ మొత్తం డౌన్లోడ్ కాగానే ఫోన్ ఓ సారి రీస్టార్ట్ చేస్తే సరిపోతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to sync game progress from one smartphone to another Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X