Instagram పోస్ట్‌లో ఏదైనా ప్రొడక్టులను ట్యాగ్‌ చేయడం ఎలా?

|

ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కొద్దిగా స్మార్ట్ గానే ఆలోచిస్తున్నారు. ఇందుకోసం చాలా మంది సోషల్ మీడియా యాప్ లను ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో గల అనేక సోషల్ మీడియా యాప్ లలో ఇన్స్టాగ్రామ్ కూడా ఒకటి. ఫోటోలను మరియు వీడియోలను అధికంగా షేర్ చేయడానికి ఉపయోగించే ఇన్స్టాగ్రామ్ యాప్ యునైటెడ్ స్టేట్స్‌లోని ప్రతి వినియోగదారుడికి తమ పోస్ట్‌లలో ఏదైనా ప్రోడక్ట్ ట్యాగ్‌లను జోడించే సామర్థ్యాన్ని విస్తరిస్తున్నట్లు ఇన్స్టాగ్రామ్ ప్రకటించింది. ప్రస్తుతానికి ఫీడ్‌లోని పోస్ట్‌లలో మాత్రమే ప్రొడక్టులను ట్యాగ్ చేయగలరు. అలాగే ప్రోడక్ట్ ట్యాగింగ్ అనేది పబ్లిక్ అకౌంటులలో మాత్రమే పని చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలలో కూడా ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొనిరావడానికి సంస్థ పనిచేస్తోంది.

How to Tag Any Products on Instagram Feed Posts: Here are Step by Step

ఇన్‌స్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్‌ను సృష్టించేటప్పుడు బ్రాండ్‌ను ట్యాగ్ చేయడానికి ట్యాగింగ్ ఫీచర్‌ని ఉపయోగించండి. ఆ తరువాత ప్రొడక్టు యొక్క పేరును పేర్కొనండి. మీరు పోస్ట్ చేసిన ఫీడ్ పోస్ట్‌లో ఎవరైనా మీ ప్రొడక్టు ట్యాగ్‌పై నొక్కినప్పుడు వారు ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రోడక్ట్ వివరాల పేజీ ద్వారా ప్రోడక్ట్ గురించి వివరణాత్మక సమాచారాన్ని పొందగలుగుతారు మరియు ఆ తర్వాత నేరుగా యాప్‌లో లేదా బ్రాండ్ ఉత్పత్తి వివరాల పేజీ ద్వారా ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు.

How to Tag Any Products on Instagram Feed Posts: Here are Step by Step

"ఇప్పుడు మేము పోస్ట్‌లలో ప్రొడక్టు ట్యాగింగ్‌ని ప్రారంభించడం ద్వారా యూజర్లకు సన్నిహితంగా ఉన్నవారిని ప్రేరేపించడానికి ప్రతి ఒక్కరికీ యాక్సెస్ ఇస్తున్నాము. మీరు ఇష్టపడే బ్రాండ్‌లకు మద్దతు ఇవ్వడం నుండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఇష్టపడే కొత్త ఉత్పత్తులను కనుగొనడంలో సహాయం చేయడం వరకు Instagramలో ఉత్పత్తులను భాగస్వామ్యం చేయడం సులభం అవుతుంది, "అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రోడక్ట్ ట్యాగ్‌ను జోడించే విధానం

How to Tag Any Products on Instagram Feed Posts: Here are Step by Step

** ఇన్‌స్టాగ్రామ్‌ ఫీడ్‌లో పోస్ట్‌ను సృష్టించడం ప్రారంభించండి.
** 'వ్యక్తులను ట్యాగ్ చేయండి' ఎంపిక మీద నొక్కండి.
** తరువాత బ్రాండ్‌ను సెర్చ్ చేసి ట్యాగ్ చేయండి. దిగువన 'పీపుల్స్' & 'ప్రోడక్ట్' అని లేబుల్ చేయబడిన 2 ఎంపికలు చూపబడతాయి.
** 'ప్రోడక్ట్స్' ఎంపిక మీద నొక్కండి.
** ప్రొడక్టులను ట్యాగ్ చేయడం ప్రారంభించడానికి ఫోటో మీద నొక్కండి. ఉత్పత్తిని కనుగొనడానికి డిస్క్రిప్టర్లను ఉపయోగించండి. మీరు ఉత్పత్తిని కనుగొన్న తర్వాత ఏవైనా స్టయిల్స్ మరియు కలర్ లను పేర్కొనండి. ఆపై ట్యాగ్‌ని జోడించడానికి ''యాడ్ ట్యాగ్‌" మీద నొక్కండి.
** పోస్ట్‌ను పబ్లిష్ చేయడానికి 'షేర్' ఎంపిక మీద నొక్కండి!

Best Mobiles in India

English summary
How to Tag Any Products on Instagram Feed Posts: Here are Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X