ఆండ్రాయిడ్ ఫోన్‌లలో లాంగ్ స్క్రోల్ స్క్రీన్ షాట్‌లను క్యాప్చుర్ చేయటం ఎలా?

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని స్ర్కీన్ షాట్ ఫీచర్‌ను మనలో చాలా మంది యూజర్లు రెగ్యులర్‌గా వినియోగించుకుంటుంటారు.

|

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని స్ర్కీన్ షాట్ ఫీచర్‌ను మనలో చాలా మంది యూజర్లు రెగ్యులర్‌గా వినియోగించుకుంటుంటారు. ఈ ఫీచర్ అనేక మంది అవసరాలను తీరుస్తున్నప్పటికి పలు రిస్ట్రిక్షన్స్ కారణంగా అనుకున్న స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోలేకపోతోంది. ఫోన్‌లతో ఇన్‌బిల్ట్‌గా వస్తోన్న స్ర్కీన్ షాట్ ఫీచర్ స్ర్కీన్ పై కనిపించే సమాచారాన్ని మాత్రమే క్యాప్చుర్ చేయగలుగుతుంది.దీంతో లాంగ్ స్ర్కోలింగ్ స్ర్కీన్ షాట్స్ అనేవి సాధ్యం కావటం లేదు. ఈ ఇబ్బందిని పరిగణంలోకి తీసుకున్న షావోమి (Xiaomi) తాజాగా లాంగ్ స్ర్కోలింగ్ స్ర్కీన్ షాట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. MIUI ప్లాట్‌ఫామ్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. లాంగ్ స్ర్కోలింగ్ స్ర్కీన్ షాట్ ఫీచర్‌ను ఉపయోగించుకోవటం ద్వారా లాంగ్ పేజీలను ఒకే స్ర్కీన్ షాట్ క్రింద క్యాప్చుర్ చేసుకునే వీలుంటుంది.

లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !లాభాల్లో దుమ్మురేపిన రిలయన్స్, జియో కస్టమర్లకు పండగే !

ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనూ వర్క్ అవ్వాలంటే..

ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనూ వర్క్ అవ్వాలంటే..

పానాసోనిక్ ఇమేజ్ క్యాప్చుర్ తరహాలో ఈ లాంగ్ స్ర్కోలింగ్ స్ర్కీన్ షాట్ ఫీచర్ వర్క్ అవుతుంది. ప్రస్తుతం ఈ లాంగ్ స్ర్కోల్ ఫీచర్‌ను షావోమి ఫోన్‌లను వాడుతోన్న యూజర్లు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు.

థర్డ్ పార్టీ యాప్‌లను

థర్డ్ పార్టీ యాప్‌లను

అయితే పలు థర్డ్ పార్టీ యాప్‌లను వినియోగించుకోవటం ద్వారా ప్రతి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోనూ లాంగ్ స్ర్కోల్ ఫీచర్ అనేవి వర్క అవుతుంది. లాంగ్ స్ర్కోలింగ్ స్ర్కీన్ షాట్ లకు సహకరిస్తోన్న యాప్స్ ఇంకా వాటి పనితీరును ఇప్పుడు తెలుసుకుందాం...

లాంగ్ షాట్ (LongShot)

లాంగ్ షాట్ (LongShot)

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతోన్న ఈ అప్లికేషన్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రత్యేకించి long form screenshotలను క్యాప్చుర్ చేసుకునేందుకు లాంగ్ షాట్ యాప్‌ను తయారు చేసారు. లాంగ్ స్ర్కీన్ షాట్‌లను తీసుకోవాలనుకుంటోన్న సమయంలో ముందుగా యాప్‌ను ఓపెన్ చేసి Capture అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ సెలక్ట్ అయిన తరువాత పాయింటింగ్ స్ర్కీన్‌ను నెమ్మదిగా మూవ్ చేసినట్లయితే మొత్తం షాట్ ఒకే ఇమేజ్ క్రింద విజయవంతంగా క్యాప్చుర్ కాబడుతుంది.

స్ర్కోల్ క్యాప్చుర్ (Scroll Capture)

స్ర్కోల్ క్యాప్చుర్ (Scroll Capture)

వెబ్ పేజీలకు సంబంధించిన లాంగ్ స్ర్కీన్ షాట్లను క్యాప్చుర్ చేయటంలో స్ర్కోల్ క్యాప్చుర్ యాప్ దిట్ట. యాప్‌ను విజయవంతంగా ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత స్ర్కీన్ షాట్ తీయాలనుకుంటోన్న వెబ్ పేజీని ఓపెన్ చేయాలి. పేజీ ఓపెన్ అయిన తరవాత యాప్‌కు సంబంధించిన క్యాప్చుర్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మొత్తం స్ర్కీన్‌షాట్ ఒకే ఇమేజ్ పై క్యాప్చుర్ కాబడుతుంది.

 

 

Best Mobiles in India

English summary
Screenshot feature has been a really useful function on the smartphone devices. Many of the people would have utilized it for many of the purposes.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X