స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?

స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ క్యాప్చూరింగ్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్. స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను స్ర్కీన్‌షాట్‌ క్యాప్చూరింగ్ ప్రక్రియ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను తీసుకునేందుకు అనేక యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికి, వాటి అవసరం లేకాండా ఫోన్‌లో ఇన్‌బిల్ట్‌గా పొందుపరిచిన కొన్ని కమాండ్‌లను ఉపయోగించుకుని స్ర్కీన్‌షాట్‌‌లను క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్‌ను ఇప్పుడు చూద్దాం

Read More : ఏప్రిల్‌లో మీరు కొనేందుకు 20 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో..

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చుర్ చేసుకోవాలంటే, ముందుగా ఫోన్‌ను అన్‌లాక్ చేసి స్ర్కీన్ షాట్ కావాలనుకున్న పేజీలోకి వెళ్లండి. మీరు క్యాప్చుర్ చేయాలనుకుంటున్న కంటెంట్ స్ర్కీన్‌లో ఫిట్ అయిన తరువాత పవర్‌బటన్ ఇంకా వాల్యుమ్ డౌన్ బటన్‌లను ఒకేసారి ప్రెస్ చేసి ఉంచండి. మూడు సెకన్లు పూర్తికాగానే స్ర్కీన్‌షాట్‌ క్యాప్చుర్ కాబడుతుంది. సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను చిత్రీకరించుకోవాలంటే పవర్+హోమ్ బటన్‌లను ప్రెస్ చేసి ఉంచాలి. క్యాప్చుర్ చేసిన ఫోటోలన్ని ఫోన్ గ్యాలరీలో కనిపిస్తాయి.

జియో ప్రైమ్ ఆఫర్ పొడిగింపు, ఒక నెల కొంటే 4 నెలలు ఉచితం

యాపిల్ ఐఫోన్‌లో..

యాపిల్ ఐఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చుర్ చేసుకోవాలంటే, ముందుగా ఫోన్‌ను అన్‌లాక్ చేసి స్ర్కీన్ షాట్ కావాలనుకున్న పేజీలోకి వెళ్లండి. మీరు క్యాప్చుర్ చేయాలనుకుంటున్న కంటెంట్ స్ర్కీన్‌లో ఫిట్ అయిన తరువాత పవర్ బటన్ + హోమ్ బటన్‌లను ఒకేసారి ప్రెస్‌చేసి ఉంచండి. కొన్ని సెకన్ల వ్యవధిలోనే స్ర్కీన్‌షాట్‌ క్యాప్చుర్ కాబడుతుంది. క్యాప్చుర్ చేయబడిన స్ర్కీన్‌షాట్‌లను ఫోటో రోల్‌లో బ్రౌజ్ చేసుకోవచ్చు.

రోజుకు 10జీబి డేటా, BSNL సంచలనం

విండోస్ ఫోన్‌లలో..

విండోస్ ఫోన్‌లలో స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చుర్ చేసుకోవాలంటే, ముందుగా ఫోన్‌ను అన్‌లాక్ చేసి స్ర్కీన్ షాట్ కావాలనుకున్న పేజీలోకి వెళ్లండి. మీరు క్యాప్చుర్ చేయాలనుకుంటున్న కంటెంట్ స్ర్కీన్‌లో ఫిట్ అయిన తరువాత పవర్ బటన్ + విండోస్ కీ బటన్‌ను ఒకే‌సారి ప్రెస్‌చేసి ఉంచండి. కొన్ని సెకన్ల వ్యవధిలోనే స్ర్కీన్‌షాట్‌ క్యాప్చుర్ కాబడుతుంది. క్యాప్చుర్ చేయబడిన స్ర్కీన్‌షాట్‌లను గ్యాలరీలో చూసుకోవచ్చు.

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లలో...

బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌లో స్ర్కీన్‌షాట్‌లను క్యాప్చుర్ చేసుకోవాలంటే, ముందుగా ఫోన్‌ను అన్‌లాక్ చేసి స్ర్కీన్ షాట్ కావాలనుకున్న పేజీలోకి వెళ్లండి. మీరు క్యాప్చుర్ చేయాలనుకుంటున్న కంటెంట్ స్ర్కీన్‌లో ఫిట్ అయిన తరువాత వాల్యుల్ అప్ ఇంకా వాల్యుమ్ డౌన్ బటన్‌లను ఒకేసారి ప్రెస్‌చేసి ఉంచండి. కొన్ని సెకన్ల వ్యవధిలోనే స్ర్కీన్‌షాట్‌ క్యాప్చుర్ కాబడుతుంది. క్యాప్చుర్ చేయబడిన స్ర్కీన్‌షాట్‌లను గ్యాలరీలో చూసుకోవచ్చు.

Redmi Note 4 బుకింగ్స్ ప్రారంభం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to take a screenshot on Android Smartphone. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot