మీ ఫోన్ ట్యాప్ చేశారని తెలుసుకోవడం ఎలా ?

ఈ మధ్య ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కలకలం రేపుతోంది.

|

ఈ మధ్య ఎక్కడ చూసినా ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కలకలం రేపుతోంది. దీని ద్వారా మొబైల్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులలు దొంగిలించి అక్రమ కార్యకలాపాలకు అనువుగా మలుచుకుంటున్నారు. బ్యాంక్‌ అకౌంట్‌ రహస్య వివరాలను తెలుసుకొని మీ ఖాతాల్లోని సొమ్మును స్వాహ చేస్తున్నారు. మీరే పంపించినట్లుగా అనుచిత సందేశాలను ఇతరులకు మీపై చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. ట్రాక్‌ వ్యూ లాంటి యాప్స్ ఇందుకు బాగా సహకరిస్తున్నాయి. అయితే దీని నుంచి మనల్ని రక్షించుకోవడం ఎలా అనే విషయంపై కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

మీకు వచ్చే ఫోన్ కాల్స్‌ని కంప్యూటర్ ద్వారా మాట్లాడటం ఎలా ?మీకు వచ్చే ఫోన్ కాల్స్‌ని కంప్యూటర్ ద్వారా మాట్లాడటం ఎలా ?

 మొబైల్‌ నుంచి శబ్దాలు

మొబైల్‌ నుంచి శబ్దాలు

ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు అనవసరమైన శబ్దాలు వినిపిస్తుంటే.. మీ ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని అనుమానించవచ్చు. నెట్‌వర్క్‌ సమస్యల వల్ల వచ్చినప్పటికీ ఫోన్‌ ఉపయోగించనప్పుడు కూడా ఇలాంటి శబ్దాలు వస్తుంటే అనుమానించాల్సిందే.

సౌండ్‌ బ్యాండ్‌ విడ్త్‌ సెన్సార్

సౌండ్‌ బ్యాండ్‌ విడ్త్‌ సెన్సార్

దీన్ని మనం ఖచ్చితంగా నిర్థారించుకోవాలంటే సౌండ్‌ బ్యాండ్‌ విడ్త్‌ సెన్సార్ అనే పరికరం ద్వారా నిర్ధారించుకోవచ్చు. దీనిని ట్యాపింగ్‌కు గురైన ఫోన్‌ దగ్గర పెట్టినట్లయితే అలారం మోగుతుంది. ఒకే నిమిషంలో ఎక్కువ సార్లు అలారం మోగినట్లయితే ఫోన్‌ ట్యాపింగ్‌కు గురైందని నిర్ధారించుకోవచ్చు.

బ్యాటరీ లైఫ్‌
 

బ్యాటరీ లైఫ్‌

మనకు తెలియకుండానే బ్యాక్‌ గ్రౌండ్‌లో ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ రన్‌ అవుతుంటే బ్యాటరీ లైఫ్‌ భారీగా పడిపోతుంది. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే దీనికి సరైన కాల్స్ వెతుక్కోవాలి. ఛార్జింగ్ సమయం, కాల్స్ సమయం, యాప్స్ వాడక, నెట్ బ్రౌజ్ లాంటి అంశాలను మనం చెక్ చేసుకోవాలి.

బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్‌

బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్‌

సెట్టింగ్స్‌->బ్యాటరీ సెట్టింగ్స్-> బ్యాటరీ యూసేజ్' ఆప్షన్‌తో ఈ వివరాలు తెలుసుకోవచ్చు. లేదంటే బ్యాటరీ లైఫ్‌, కోకోనట్‌ బ్యాటరీ తదితర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.‌ కొత్త ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం సంవత్సరం వరకు బాగా ఉంటుంది. ఆ తరువాత తగ్గిపోతుంది. అప్పుడు బ్యాటరీని ఎక్కువగా వినియోగించే యాప్స్‌, జీపీఎస్‌, వైఫై ఆఫ్‌ చేయడంతోపాటు, డిస్‌ప్లే స్క్రీన్‌ బ్రైట్‌నెస్ ని తక్కువగా వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ఫోన్‌ స్విచ్చాఫ్‌

ఫోన్‌ స్విచ్చాఫ్‌

మీ మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసిన వెంటనే షట్‌డౌన్‌ కావడం లేదా? స్విచ్‌ ఆఫ్‌ చేసినప్పటికీ లైట్‌ ఇండికేటర్‌ వెలుగుతూనే ఉందా? అయతే మీ ఫోన్‌ను ఎవరో ట్యాప్‌ చేశారని అనుమాన పడొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్‌ను ఒక్కసారి రీబూట్‌ చేయడం మంచిది. కొన్నిసార్లు కొత్తగా ఇన్‌స్టాల్‌ చేసిన యాప్స్ వల్లగానీ, ఆప్‌డేటెడ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఏమైనా లోపాలున్నా సరే ఇలాంటి సమస్యలు తలెత్తవచ్చు.

ఆటోమేటిక్‌గా ఆన్‌/ఆఫ్‌

ఆటోమేటిక్‌గా ఆన్‌/ఆఫ్‌

మీ ప్రమేయం లేకుండానే ఫోన్‌ ఆన్‌/ఆఫ్ అవుతోందా? అయితే మీ ఫోన్‌ను ఎవరో హ్యాక్‌ చేసినట్లే.. మీ మొబైల్‌లో కొన్ని స్పై యాప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసి మీ వ్యక్తిగత సమాచారాన్ని దొరకబుచ్చుకుంటారు. తద్వారా మీ కాల్స్‌ను ట్యాప్‌ చేస్తారు.

అలర్ట్స్‌ను యాక్టివేట్‌ ..

అలర్ట్స్‌ను యాక్టివేట్‌ ..

మీకు ఇలాంటి అనుమానం వచ్చినట్లయితే వెంటనే అలర్ట్స్‌ను యాక్టివేట్‌ చేసుకోండి. దీని ద్వారా మన మొబైల్‌లో ఎలాంటి యాప్స్‌ ఇన్‌స్టాలైనా సంబంధిత ఈ మెయిల్ అకౌంట్‌కు అలెర్ట్‌ మెసేజ్‌ వెళ్తుంది.

యాప్స్‌ డౌన్‌లోడ్‌

యాప్స్‌ డౌన్‌లోడ్‌

యాప్‌స్టోర్‌ నుంచి గానీ, గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి గానీ యాప్స్‌ని డౌన్‌లోడ్‌ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయా యాప్స్‌లో స్పైవేర్‌కి సంబంధించిన లక్షణాలు లేనప్పుడే వాటిని డౌన్‌లోడ్‌ చేయాలి. అయితే అధికారిక యాప్‌ స్టోర్‌ లేదా ప్లేస్టోర్‌లో ఉన్న యాప్స్‌ అన్నీ దాదాపు స్క్రీనింగ్‌ చేసినవే ఉంటాయి.

గేమింగ్‌ యాప్స్‌..

గేమింగ్‌ యాప్స్‌..

గేమింగ్‌ యాప్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఇన్‌స్టాల్‌ చేసినప్పుడు కాల్‌ హిస్టరీ, అడ్రస్‌బుక్‌, కాంటాక్ట్‌ లిస్ట్‌ కోసం పర్మిషన్‌ అడిగితే ఆలోచించుకోవాలి. మరికొన్ని చీటింగ్‌ యాప్స్‌ మనందరికీ తెలిసిన పేరుతో.. అదే లోగోతో కనిపిస్తాయి. అందువల్ల డౌన్‌లోడ్‌ చేసే ముందు ఆ యాప్‌ డెవలపర్‌ పేరును చెక్‌ చేసుకోవడం మంచిది.

Best Mobiles in India

English summary
How to Know If Your Device Is Being Tapped by Police more news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X