ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా డిసేబుల్ చేయడం ఎలా?

|

ఫోటోలు మరియు చిన్న వీడియోలను షేర్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఇది మొదటగా అక్టోబర్ 2010 లో ప్రారంభించింది. ఇది మొదట్లో ప్రముఖులలో బాగా ప్రాచుర్యం పొందింది. తరువాత కాలంలో వ్యక్తులకు ప్రజా సమస్యలను హైలైట్ చేసే ప్రదేశంగా అవతరించింది.

ఇన్‌స్టాగ్రామ్

భారతదేశంలో ఇటీవల పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు మరియు 2019 హాంకాంగ్ నిరసనలలో ఇన్‌స్టాగ్రామ్ ఒక మాధ్యమంగా మారింది. ఫేస్బుక్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నకిలీ వార్తలు మరియు తప్పుడు సమాచారంతో అనేక పోస్టులు కనబడుతున్నాయి. మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టీవేట్ చేయాలనుకోవటానికి ఇవి కూడా కారణం కావచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను డియాక్టీవేట్ చేయడం ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

 

ColorOS 7 ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్పష్టమైన ఆండ్రాయిడ్ స్కిన్...ColorOS 7 ఫీచర్స్ : స్మార్ట్‌ఫోన్‌ల కోసం స్పష్టమైన ఆండ్రాయిడ్ స్కిన్...

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా డియాక్టీవేట్ చేయడం ఎలా?

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా డియాక్టీవేట్ చేయడం ఎలా?

మీరు ఏదైనా కారణాల వలన మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా కొంత కాలం నిలిపివేయడానికి మీరు క్రింద ఉన్న దశలను పాటించండి.


**** మొబైల్ బ్రౌజర్ లేదా కంప్యూటర్ నుండి Https://instagram.com ని ఓపెన్ చేసి మీ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి.

 

ప్రొఫైల్

**** ఎగువవైపున కుడి మూలలో ఉన్న మీ యొక్క ప్రొఫైల్ యొక్క ఫోటో మీద క్లిక్ చేసి తరువాత అందులో గల ఎడిట్ ప్రొఫైల్ ఎంపికను ఎంచుకోండి.

**** ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేసి అందులో గల "తాత్కాలికంగా నా అకౌంట్ ను నిలిపివేయండి" అనే ఎంపిక మీద క్లిక్ చేయండి.

 

 

RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్RS.200 లోపు ఉత్తమ రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్న జియో,ఎయిర్‌టెల్, వొడాఫోన్

 

ఇన్‌స్టాగ్రామ్

**** తరువాత ఇన్‌స్టాగ్రామ్ మీకు ఎందుకు డిసేబుల్ చేస్తున్నారు? అనే డ్రాప్-డౌన్ మెను ఉన్న పేజీని చూపిస్తుంది. అందులో మీరు మీ యొక్క అకౌంట్ ను ఎందుకు డిసేబుల్ చేస్తున్నారో తెలపడానికి మీరు మెను నుండి ఒక ఎంపికను ఎంచుకొని ఆపై మీ యొక్క పాస్‌వర్డ్‌ను తిరిగి నమోదు చేయాలి. డ్రాప్-డౌన్ మెనులో వ్యక్తులను ఫాలో కాకపోవడం, నా డేటా గురించి ఆందోళన, విరామం అవసరం, ప్రైవసీ ఆందోళనలు, చాలా బిజీగా / చాలా అపసవ్యంగా, చాలా ప్రకటనలు మరియు ఏదైనా తీసివేయాలనుకోవడం వంటి ఎంపికలు ఉన్నాయి. తాత్కాలిక డిసేబుల్ చేయడానికి మీ కారణాన్ని తెలపకూడదు అనుకుంటే మీరు వేరే "అథర్స్" అనే ఎంపికను కూడా ఎంచుకోవచ్చు.

 

 

డిసేబుల్

**** డిసేబుల్ చేసే ప్రక్రియను పూర్తి చేయడానికి తాత్కాలికంగా స్టాప్ అకౌంట్ అనే బటన్‌ మీద క్లిక్ చేయండి.

 

 

సెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివిసెట్-టాప్ బాక్స్‌ల ధరలను తగ్గించిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివి

ఇన్‌స్టాగ్రామ్ యాప్

మీ మొబైల్ లోని ఇన్‌స్టాగ్రామ్ యాప్ ను ఉపయోగించి మీరు మీ అకౌంట్ ను తాత్కాలికంగా డిసేబుల్ చేయలేరని గమనించాలి. అలాగే అకౌంట్ ఒక సారి డిసేబుల్ చేయబడితే మీరు ఒక సారి లాగిన్ చేయడం ద్వారా దాన్ని తిరిగి యాక్టీవేట్ చేయవచ్చు. మీరు మీ అకౌంట్ ను తిరిగి యాక్టీవేట్ చేసే వరకు మీ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్, ఫోటోలు, మెసేజ్ లు మరియు ఇష్టాలు అన్ని దాచబడతాయి. ఇంకా మీరు వారానికి ఒకసారి మాత్రమే మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ను తాత్కాలికంగా డిసేబుల్ చేయవచ్చు.

 

Dell 86-inch, 43-inch టచ్ మానిటర్‌ ఫీచర్స్ ఇవే...Dell 86-inch, 43-inch టచ్ మానిటర్‌ ఫీచర్స్ ఇవే...

 

ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌

మీరు మీ అకౌంట్ ను డిసేబుల్ చేయకూడదనుకుంటే మీ ప్రైవసీ మరియు ప్రాధాన్యతలను సర్దుబాటు చేయడానికి మార్పులు చేయాలనుకుంటే మీ పోస్ట్‌లను ప్రైవేట్‌గా సెట్ చేయడానికి లేదా వ్యక్తులను బ్లాక్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ కొన్ని ఎంపికలను కూడా అందించింది.

Best Mobiles in India

English summary
How to Temporarily Deactivate Your Instagram account?: Step by Step in Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X