ఆ లింకులు ఓపెన్ చేస్తున్నారా, అయితే ఈ జాగ్రత్తలు పాటించండి

Posted By:

మీరు వాట్సప్‌లో ఉన్నప్పుడు కాని అలాగే మీ పర్సనల్ మెయిల్స్‌లో కాని , ఫేస్‌బుక్‌లో కాని కొన్ని రకాల లింకులు మీకు తగులుతుంటాయి. అవేంటో తెలియకపోయినా వాటి మీద క్లిక్ చేస్తుంటాం. అలాంటి సమయంలోనే మన అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతుంటాయి. మరి వీటిని తెలుసుకోవడమెలా అనేది చాలామందికి తెలియకపోవచ్చు. అలాంటి వాటిని ఎలా తెలుసుకోవాలో కొన్ని చిట్కాలు ఇస్తున్నాం. వాటిని పాటిస్తే మీ అకౌంట్లు రక్షణలో ఉంటాయి

డౌన్‌లోడ్ స్పీడ్‌ని డిసైడ్ చేసేది ఈ ఒక్క అక్షరమే, సమగ్ర విశ్లేషణ కథనం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మెదట ఆ లింకును రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అని ప్రెస్ చేసి లింకును కాపీ చేసుకోండి. దాదాపు అన్ని వైరస్ లింకులు ఆంటీవైరస్ ప్రోగ్రాములతో గుర్తించబడకుండా ఉండేందుకు పొట్టి లింకులుగా మార్చబడు ఉంటాయి. (tinyurl, mcaf.ee google url shorten వంటి సర్వీసులను ఉపయోగిస్తారు)

స్టెప్ 2

కాబట్టి వీటి నిజమైన లింకులను పొందేందుకు ఆ లింకును http://urlxray.com/ అనే సైట్లో ఎంటర్ చేసి X-Ray అని ప్రెస్ చెయ్యండి.

స్టెప్ 3

అప్పుడు అది చూపించిన లింకును కాపీ చేసుకుని దాన్ని  http://www.urlvoid.com/ లోని సెర్చ్ బాక్సులో వేసి scan చేస్తే ఆ లింకు సురక్షితమా కాదా అని రిపోర్టు వస్తుంది..

ఈ విషయాలను ఫాలో అయి..

ఈ విషయాలను ఫాలో అయి మీరు మీ అకౌంట్లను రక్షించుకోండి. లేకుంటే హ్యాకింగ్ చేసిన వాళ్లు మీకు అసభ్యమైన వీడియోలను అలాగే డేంజరస్ వైరస్ లను పంపిచేందుకు అవకాశం ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
How to Test a Suspicious Link Without Clicking it Read more News At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot