ఫోన్‌లో జీరో బ్యాలన్సా..?, అయినా కాల్ చేసుకోవచ్చు!

ఫోన్ బ్యాలన్స్ సున్నాకి చేరుకున్నప్పటికి అత్యవసర ఫోన్ కాల్స్ లేదా సందేశాలను పంపుకునేందుకు ప్రముఖ టెలికం ఆపరేటర్లు కాల్ విత్ జీరో బ్యాలన్స్ పేరుతో సరికొత్త సర్వీస్‌లను ప్రారంభించాయి. అత్యవసర సమయంలో ఈ సేవను ఉపయోగించుకుని సదురు సర్వీస్ ప్రొవైడర్‌కు ఓ ‘రిక్వెస్ట్’ పంపినట్లయితే కాల్ లేదా సందేశం పంపుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్లు కాల్ విత్ జీరో బ్యాలన్స్ సేవలను ఇప్పటికు ప్రారంభించాయి. ఆయా నెట్‌వర్క్ యూజర్లు ఈ సేవలను ఏలా ఉపయగించుకోవాలో ఇప్పుడు చూద్దాం......
ఎయిర్‌టెల్ యూజర్లయితే?
ఎయిర్ టెల్ ఈ సర్వీస్‌కు ‘కాల్ మీ బ్యాక్’గా నామకరణం చేసింది. ఈ సేవను పొందుగోరే వారు తమ ప్రీపెయిడ్ మొబైల్ నుంచి "*141#"కు కాల్ చేసి తరువాత వచ్చే ఆప్షన్‌ల ద్వారా కాల్ లేదా సందేశాన్ని పంపుకోవచ్చు. ఈ ‘కాల్ మీ బ్యాక్’ ఆఫర్‌లో భాగంగా నెలకు 5 సందేశాలను ఉచితంగా పంపుకోవచ్చు.
వొడాఫోన్ యూజర్లయితే?
వొడాఫోన్ తమ సర్కిళ్ల పరిధిలోని వినియోగదారుల కోసం ‘బ్యాలన్స్ ట్రాన్స్‌ఫర్’ సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ సర్వీస్‌లో భాగంగా ఆపదలో ఉన్న మీ మిత్రుడి వొడాఫోన్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ సమయంలో మీది కూడా వొడాఫోన్ నెట్‌వర్క్ అయి ఉండాలి. బ్యాలన్స్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియలో భాగంగా డోనార్ తన మొబైల్ నుంచి *131* పంపే నగదు సంఖ్య* మొబైల్ నెంబర్# జత చేసి డయల్ చేయాల్సి ఉంటుంది. ఈ సర్వీస్‌ను వినియోగించుకునే డోనార్ అలానే రిసీవర్‌లు ఐడియా నెట్‌వర్క్‌లోకి వచ్చి 90 రోజులు పై బడి ఉండాలి....
ఐడియా యూజర్లయితే..?
ప్రముఖ టెలికం ఆపరేటర్ ఐడియా, ‘ఐడియా లైఫ్ లైన్’ పేరుతో కాల్ విత్ జీరో బ్యాలన్స్ సర్వీస్‌ను అందిస్తుంది. ఈ సేవను ఉపయోగించుకునే వారు తమ ఐడియా మొబైల్ నుంచి 53367కు డయిల్ చేసి రూ.3 బ్యాలన్స్‌ను పొందవచ్చు. ఈ బ్యాలన్స్ తరువాతి టాపప్‌లో మినహాయించబడుతుంది. ఈ సర్వీస్‌ను వినియోగించుకునే యూజర్ ఐడియా నెట్‌వర్క్‌లోకి వచ్చి 90 రోజులు పై బడి ఉండాలి.


Click it and Unblock the Notifications