పోగొట్టుకున్న మీ ఫోన్ ను గూగుల్ మ్యాప్స్ ద్వారా కనిపెట్టడం చాలా సులభం
స్మార్ట్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగమైపోయింది. ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా అకౌంట్స్,బ్యాంకింగ్ కి సంబదించిన వ్యక్తి గత సమాచారం అంత ఇందులోనే నిక్షిప్తం చేస్తున్నారు.
స్మార్ట్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగమైపోయింది. ఫొటోలు, వీడియోలు, సోషల్ మీడియా అకౌంట్స్,బ్యాంకింగ్ కి సంబదించిన వ్యక్తి గత సమాచారం అంత ఇందులోనే నిక్షిప్తం చేస్తున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసే స్మార్ట్ ఫోన్ కూడా విలువైనదిగా మారిపోయింది. అందుకే పర్సు పోయినా బాధపడనివారు కూడా స్మార్ట్ ఫోన్ పోతే మాత్రం బాధపడతుంటారు.అయితే ఇప్పుడు ఫోన్ పోతే బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా ఫోన్‌ను చాలా సులభంగా ట్రేస్ చేయవచ్చు. ఆ ఫోన్ ఏ ప్రదేశంలో ఉందో చాలా సులభంగా తెలుసుకోవచ్చు.అయితే గూగుల్ మ్యాప్స్ ద్వారా కనిపెట్టడం కోసం మీ ఫోన్ లో లొకేషన్ ను ఎప్పుడు ఆన్ చేసి ఉండాలి .

మరొక ఫోన్, ల్యాప్టాప్, లేదా PC ద్వారా....
మొదటగా మీరు మరొక ఫోన్, ల్యాప్టాప్, లేదా PC ద్వారా www.maps.google.co.in బ్రౌజర్ ను ఓపెన్ చేయండి

గూగుల్ అకౌంట్ తో లాగ్ ఇన్...
మీరు పోగొట్టుకున్న ఫోన్ లో లింక్ చేసిన మీ గూగుల్ అకౌంట్ తో లాగ్ ఇన్ అవ్వండి

మూడు డాట్స్ పై క్లిక్ చేయండి....
కుడివైపున ఉన్న మూడు డాట్స్ పై క్లిక్ చేయండి

టైమ్ లైన్....
మీరు మీ టైమ్ లైన్ ఎంపికను క్లిక్ చేయండి.

ఫోన్ స్థానాన్ని కనుగొనడానికి....
మీ కోల్పోయిన ఫోన్ స్థానాన్ని కనుగొనడానికి నెల , రోజు , సంవత్సరం ను ఎంటర్ చేయండి.

ప్రస్తుత లోకేషన్ తో పాటు లొకేషన్ హిస్టరీ...
మ్యాప్లో మీ ఫోన్ యొక్క ప్రస్తుత లోకేషన్ తో పాటు లొకేషన్ హిస్టరీ మొత్తం చూపిస్తుంది


Click it and Unblock the Notifications








