స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
ప్రస్తుత రోజుల్లో స్మా్ర్ట్‌ఫోన్ రోజువారీ కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైనది ఉంది. ఫోన్ కాల్స్ సహా బ్యాంకింగ్ మరియు ఇతర అనేక సమాచారాన్ని చాలావరకు స్మార్ట్‌ఫోన్‌లో భద్రపరుస్తు్న్నాం. అయితే ఏదైనా సందర్భంలో స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకోవడం లేదా దొంగలించబడితే అందులోని డేటా పై ఆందోళన చెందుతాం.
అయితే ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు గూగుల్ కీలక ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ Google Find My Device ఫీచర్ ద్వారా పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ల లోకేషన్‌ను ట్రాక్ చేయవచ్చు. మరియు హ్యాండ్‌సెట్‌ను లాక్ చేయడంతోపాటు అందులోని డేటాను డిలీట్ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

ఈ గూగుల్ ఫైండ్ మై డివైజ్‌ను ఫీచర్‌ను వినియోగించుకొనేందుకు ఆండ్రాయిడ్ ఫోన్ 4.1 లేదా అంతకంటే తాజా వెర్షన్ పైన పనిచేస్తుండాలి. ఈ ఫీచర్ పనిచేసేందుకు లోకేషన్ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లోకేషన్ ను ఆన్ చేయాల్సి ఉంటుంది.
దీంతోపాటు ఫైండ్ మై డివైజ్ ఫీచర్‌ను ఉపయోగించుకొనేందుకు స్మార్ట్ ఫోన్‌ను గూగుల్ ఖాతాకు లింక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం సెట్టింగ్స్ లోని గూగుల్ ఆప్షన్ లోకి వెళ్లి ఫైండ్ మై డివైస్‌లోకి వెళ్లాలి. తర్వాత అవసరం అయిన అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ ఫైండ్ మై డివైజ్ ఫీచర్ స్మార్ట్ ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేస్తుంది. అందుకోసం మొబైల్ ఇంటర్నెట్ లేదా వైఫై అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్‌ను స్మార్ట్ ఫోన్‌లో యాక్టివేట్ చేశాక.. ఫోన్‌ను ట్రాకింగ్, అందులోని డేటాను డిలీట్ చేయవచ్చు.
ఈ ఫీచర్‌ను ఎలా వినియోగించాలి :
ఏదైనా సందర్భంలో మీ స్మార్ట్ ఫోన్‌ను పోగొట్టుకోవడం లేదా దొంగిలించినప్పుడు.. మరో డివైజ్‌లో ఫైండ్ మై డివైజ్ వెబ్‌సైట్‌ను ఒపెన్ చేయాలి. లేదా మరో స్మార్ట్‌ఫోన్‌లో ఫైండ్ మై డివైజ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అనంతరం మీరు పొగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌ను లింక్ చేసిన గూగుల్ అకౌంట్‌తో ఈ కొత్త డివైజ్‌లో లాగిన్ కావాలి. అనంతరం మీరు పొగొట్టుకున్న డివైజ్‌ను ట్రాక్ చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. అయితే లోకేషన్ సెట్టింగ్స్ మరియు కనెక్టివిటీ ఆధారంగా ఈ ఫీచర్ పనితీరు ఆధారపడి ఉంటుంది.
అనంతరం ఈ క్రింది పద్ధతిలో మీ స్మార్ట్‌ఫోన్‌ను గుర్తించవచ్చు.
ప్లే సౌండ్ : మీరు పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్ మీకు దగ్గరిలోనే ఉందని మీకు భావించినప్పుడు ఈ ఆప్షన్‌ను క్లిక్ చేయవచ్చు. ఫలితంగా ఫోన్ సైలెంట్ లేదా వైబ్రేషన్‌లో ఉన్నా కూడా 5 నిమిషాల పాటు మీ హ్యాండ్‌సెట్ భారీ సౌండ్ చేస్తుంది. ఫలితంగా మీ హ్యాండ్‌సెట్‌ను ఎవరిదగ్గర ఉందో తెలుసుకోవచ్చు.
సెక్యూర్ డివైజ్ : మీరు పోగొట్టుకున్న డివైజ్ లోని డేటాపై మీకు ఆందోళన ఉండే వెంటనే ఈ స్మార్ట్‌ఫోన్ ను రిమోట్‌గా లాక్ చేయవచ్చు. మీ గూగుల్ అకౌంట్‌ను నుంచి లాగ్ అవుట్ కానున్నారు. అయితే డిస్‌ప్లే పైన మీ ఫోన్ నంబర్ సహా ఇతర వివరాలు కనిపించనున్నారు.
ఎరేజ్ డివైజ్ : ఈ ఆప్షన్ ద్వారా ఫోన్ లోని పూర్తి డేటాను డిలీట్ చేయవచ్చు. అయితే ఈ డేటా అంతా శాశ్వతంగా డిలీట్ కానుందని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే చివరి ప్రయత్నంగా మాత్రమే ఈ ఆప్షన్ ను వినియోగించడం ఉత్తమం.
బ్యాటరీ మరియు నెట్‌వర్క్ : గూగుల్ ఫైండ్ మై డివైజ్‌లోని ఈ ఆప్షన్ ద్వారా మీరు పొగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్ రియల్‌టైం సమాచారాన్ని అందిస్తుంది. అంటే బ్యాటరీ లెవల్ మరియు నెట్‌వర్క్ కనెక్షన్ వివరాలను అందించనుంది. దీని ద్వారా మీ ఫోన్ పరిస్థితిని గుర్తించవచ్చు.


Click it and Unblock the Notifications








