ఆండ్రాయిడ్ ఫోన్‌ కాంటాక్ట్స్,ఫోటోస్‌ను ఐఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవటం ఎలా..?

|

యాపిల్ ఐఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు వినియోగించుకుంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లను స్టేటస్ సింబల్‌గా భావించే వారు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే యాపిల్ ఐఫోన్‌లకే ఎక్కువుగా ప్రాధాన్యతను ఇవ్వటం జరుగుతోంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి యాపిల్ ఐఫోన్‌లకు అప్‌గ్రేడ్ అవుతోన్న చాలా మంది యూజర్లు తమ పాత డివైస్‌లోని డేటాను కొత్త డివైస్‌లోకి ఎలా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనే దాని పై చాలా కన్ఫ్యూజన్‌కు గురవుతున్నట్లు తెలుస్తోంది.

 

బిగ్ టివి బంపరాఫర్, ఏడాది పాటు అన్నీ ఫ్రీ, నిర్ణీత మొత్తంతో..బిగ్ టివి బంపరాఫర్, ఏడాది పాటు అన్నీ ఫ్రీ, నిర్ణీత మొత్తంతో..

ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను ఐఫోన్‌లోకి..

ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను ఐఫోన్‌లోకి..

నేటి టిప్స్ అండ్ ట్రిక్స్ స్టోరీలో భాగంగా ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాంటాక్ట్స్ అలానే ఫోటోస్‌ను కొత్త ఐఫోన్‌లోకి ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనే దాని పై స్టెప్ బై స్టెప్ గైడ్‌ను మీకందించటం జరుగుతోంది. ఆండ్రాయిడ్ ఫోన్‌లోని కాంటాక్ట్స్‌ను ఐఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఈ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి..

 

 

స్టెప్ 1..

స్టెప్ 1..

ముందుగా మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లోని జీమెయిల్ అకౌంట్ ను ఓపెన్ చేసి సెట్టింగ్స్ మెనూలోకి వెళ్లండి. సెట్టింగ్స్ లోకి వెళ్లిన తరువాత "Users and Accounts" అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. యూజర్స్ అండ్ అకౌంట్స్ ఓపెన్ అయిన తరువాత "Automatically Sync Data" ఆప్షన్ ను సెలక్ట్ చేసుకున్నట్లయితే మీ ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం జీమెయిల్ అకౌంట్ తో సింక్ కాబడతాయి.

 

 

స్టెప్ 2..
 

స్టెప్ 2..

ఇప్పుడు మీ కొత్త ఐఫోన్ లోని సెట్టింగ్స్ మెనూని ఓపెన్ చేసి "Accounts and Passwords" అనే ఆప్షన్ ను సెలక్ట్ చేసుకుని అక్కడ మీ ఆండ్రాయిడ్ కాంటాక్ట్స్ తో సింక్ అయి ఉన్న జీమెయిల్ అకౌంట్ ను యాడ్ చేసుకోండి. అకౌంట్ యాడ్ అయిన తరువాత ఐఫోన్ కాంటాక్ట్స్ మెనూలోకి వెళ్లి కొత్తగా యాడ్ అయిన జీమెయిల్ అకౌంట్ నుంచి కాంటాక్ట్స్ లిస్ట్ ను యాక్సిస్ చేసుకుంటే సరిపోతుంది.

ఐఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు

ఐఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు

ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ఫోటోలను ఐఫోన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు ఈ ప్రొసీజర్‌ను ఫాలో అవ్వండి..
ముందుగా మీ కొత్త ఐఫోన్ ఇంకా పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లను యూఎస్బీ కేబుల్ సహాయంతో మీ డెస్క్‌టాప్ లేదా ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయండి. ఈ రెండు ఫోన్‌లు పీసీకి కనెక్ట్ అయ్యేందుకు అవసరమైన అన్ని రకాల డ్రైవర్స్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. మీ రెండు ఫోన్‌లు కంప్యూటర్‌కు కనెక్ట్ అయిన తరువాత సిస్టంలోని "My Computer" ని ఓపెన్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్ ఐకాన్ పై క్లిక్ చేయండి.

 స్టెప్ 1..

స్టెప్ 1..

ఆండ్రాయిడ్ ఫోన్ ఐకాన్ పై క్లిక్ చేసిన తరువాత "DCIM" పేరుతో ఓ ఫోల్డర్ మీకు కనిపిస్తుంది. ఈ ఫోల్డర్ లో మీ ఆండ్రాయిడ్ ఫోన్ కు సంబంధించిన మొత్తం ఫోటో కంటెంట్ స్టోర్ అయి ఉంటుంది. వీటిలో ఐఫోన్ లోకి ట్రాన్స్ ఫర్ చేయాలనుకుంటోన్న ఫోటోలను సెలక్ట్ చేసుకుని కాపీ చేసుకోండి.

స్టెప్ 2

స్టెప్ 2

ఫోటోలను కాపీ చేసుకున్న తరువాత మరోసారి "My Computer" విండోలోకి వెళ్లి ఐఫోన్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఐఫోన్ ఐకాన్ ఓపెన్ అయిన తరువాత దానిలోని డీఫాల్ట్ స్టోరేజ్ ఫోల్టర్ ను సెలక్ట్ చేసుకుని కాపీ చేసుకున్న ఫోటోలను అందులో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తయిన తరువాత ఐఫోన్ ను కంప్యూటర్ నుంచి డిస్కనెక్ట్ చేస్తే సరిపోతుంది.

Best Mobiles in India

English summary
If you have started using your new iPhone but are now not sure how to transfer data from your old Android, then don’t worry. Here is a step by step guide to transfer your contacts and photos from an old Android phone to your new iPhone..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X